E-Paper
Advertisement

హాలీవుడ్ లోకి నిఖిల్.. తెలుగు సినిమాలకు గుడ్ బై..?

హాలీవుడ్ లోకి నిఖిల్.. తెలుగు సినిమాలకు గుడ్ బై..?
Advertisement

Nikhil Siddarth : తెలుగులో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసి బిజీగా మారిన హీరోలు ఈమధ్య అడపాదడపా సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నారు. అయితే ఈ మధ్య వచ్చిన సినిమాలు కూడా వాళ్లకి మంచి క్రేజ్ ని సంపాదించి పెడుతున్నాయి. అలాంటి స్టార్ హీరోలలో నిఖిల్ సిద్ధార్థ్ ఒకరు. ఈయన కెరియర్ స్టార్టింగ్ లో వరుసగా సినిమాలు చేసే తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు.. కార్తికేయ సినిమాతో ఫ్యాన్ ఇండియా హీరోగా మారిన ఈ నిఖిల్ ఈమధ్య ఈయన నుంచి సినిమాలు రాలేదు. కార్తికేయ 2 తర్వాత స్వయంభు సినిమాలో నటిస్తున్నట్లు ఎప్పుడో ప్రకటించారు. పూజా కార్యక్రమాలతో మొదలైన ఆ మూవీ ఇప్పటివరకు షూటింగ్ అప్డేట్ కూడా మేకర్స్ ఇవ్వలేదు.

దాంతో ఈ సినిమా ఆగిపోయింది అన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో మొన్నటి వరకు ప్రచారంలో ఉన్నాయి. సినిమా గురించి అప్డేట్ రావడంతో సినిమా షూటింగు పూర్తికావస్తుంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.. ఈ మూవీ ఈ ఏడాదిలోనే థియేటర్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.. అయితే ఈ సినిమా తర్వాత నిఖిల్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నిఖిల్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

హాలివుడ్ స్టూడియోతో నిఖిల్..

Advertisement

యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఒక భారీ అంతర్జాతీయ ప్రాజెక్టులో భాగం కానున్నారని తెలుస్తుంది. ప్రముఖ గ్లోబల్ సంస్థ ఆయన అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ తో నిఖిల్ చేతులు కలిపినట్లు ఓ వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించిన ఒక ఫోటోని నిఖిల్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.. ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట బాగా వైరల్ అవుతుంది.. ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా నిఖిల్ ‘కార్తికేయ 2’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఇక ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన ఓ భారీ ప్రాజెక్టులో ఆయన భాగస్వామ్యం కావడంతో నిఖిల్ అభిమానులకు ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఆ ప్రాజెక్టులో నిఖిల్ ను ఎప్పుడెప్పుడు చూస్తామని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దీని గురించి అతి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మే 15న ఈ ప్రాజెక్టు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది..

Also Read :Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి క్లాస్ పీకిన సత్యం.. మీనాను తిట్టిన బాలు.. రోహిణి కోసం ప్రభావతి టెన్షన్…

స్వయంభు షూటింగ్ అప్డేట్..

Advertisement

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’.. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ మూవీ తెరకేక్కుతుంది. క్రీస్తుశకం 985 నాటి పరాక్రమవంతుడైన యోధుడిగా కనిపిస్తున్నారు. భారీ సెట్టింగ్‌లు, అద్భుతమైన పీరియడ్ వార్ సీక్వెన్స్‌లతో కూడిన మూవీ నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుందని ప్రకటించారు. త్వరలోనే మూవీ గురించి మరో అప్డేట్ రానున్నట్లు సమాచారం..

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×