E-Paper
Advertisement

పాలిటిక్స్ లోకి కోలీవుడ్ హీరో ఎంట్రీ.. ఉపఎన్నికల్లో పోటీ..

పాలిటిక్స్ లోకి కోలీవుడ్ హీరో ఎంట్రీ.. ఉపఎన్నికల్లో పోటీ..
Advertisement

Raghava lawrance : తమిళ రాజకీయాల్లోకి ఒక్కొక్కరుగా స్టార్ హీరోలు ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రీసెంట్ గా హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో పాటుగా ఎన్నికల్లో పోటీ చేసి అత్యధిక మెజారిటీ గెలుపొంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విజయ్ నేత్రుత్వంలో తమిళగ వెట్రి కళగం పార్టీ ఇప్పుడు మరో భారీ వ్యూహానికి తెరలేపినట్లు కోలీవుడ్ మీడియా వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. సీఎం విజయ్ తాను పోటీ చేసి గెలిచిన రెండు స్థానాలలో తిరుచ్చి అసెంబ్లీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఈసారి ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు రాఘవ లారెన్స్‌ను బరిలోకి దించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాస్త వివరాల్లోకి వెళితే..

లారెన్స్ ఎంట్రీ ఖాయం..

హీరో రాఘవ లారెన్స్ ప్రస్తుతం సినిమాలతో పాటుగా దర్శకత్వం బాధ్యతలు కూడా చేపడుతున్నారు.. ఈమధ్య ఈయన దర్శకత్వం వహించిన సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. అంతేకాదు మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రేక్షకుల మనసుల్లో నటుడిగా, గొప్ప మనసున్న వ్యక్తిగా ప్రజల మనసుల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నాడు. లారెన్స్ లాంటి సేవా దృక్పథం ఉన్న వ్యక్తిని తిరుచ్చి తూర్పు బరిలో నిలిపితే పార్టీ విజయం వరిస్తుందని టీవీకే పార్టీ భావిస్తుందని టాక్.. అయితే గతంలో ఈ స్థానం నుంచి హీరోయిన్ త్రిష పోటీ చేస్తుందని వార్తలు వినిపిస్తుంది. కానీ అవన్నీ పూకార్లు మాత్రం అని తేలింది.. నిజానికి త్రిష రాజకీయాల్లోకి వస్తుందని నమ్మకాలు లేవు.. మరి ఆ స్థానంలో హీరో రాఘవ లారెన్స్ పోటీ చేస్తారని మీడియా వర్గాల్లో టాక్..

Advertisement

Also Read :ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన ‘కరుప్పు’ ఎడిటర్.. హీరో సూర్య షాకింగ్ రియాక్షన్…

విజయ్ కు సపోర్ట్ గా లారెన్స్..

నిజానికి హీరో విజయ్ రాజకీయ ప్రస్థానానికి, ఆయన ఫాలో అవుతున్న సిద్దాంతాలకు రాఘవ లారెన్స్ ఎప్పుడు వ్యతిరేకి కాదు. టీవీకే పార్టీ ఘనవిజయం సాధించినప్పుడు ఈ హీరో తన ఎక్స్ ఖాతా ద్వారా విజయ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈయనను పోటీలో ఉంచితే విజయం పొందవచ్చు అని అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. రాఘవ లారెన్స్ తన రాజకీయ రంగ ప్రవేశంపై తన గురువు, సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తుంది. రజనీకాంత్ ఇస్తున్న సలహాలు సూచనల మేరకు లారెన్స్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. టీవీకే పార్టీ తరపున అధికారికంగా తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నిక అభ్యర్థిగా పిలుపు వస్తే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ప్రస్తుతం కోలీవుడ్ మీడియా వర్గాల్లో సస్పెన్స్ గా మారింది.. ఏది ఏమైనా కూడా లారెన్స్ రాజకీయాల్లోకి రావాలని చాలామంది అభిమానులు కూడా కోరుకుంటున్నారు.. మరి త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×