E-Paper
Advertisement

వానలు వచ్చేస్తున్నాయ్.. ఏసీలో ఈ సెట్టింగ్స్ మారిస్తే.. ఇక వర్షాకాలంలోనూ హాయిగా ఉండొచ్చు!

వానలు వచ్చేస్తున్నాయ్.. ఏసీలో ఈ సెట్టింగ్స్ మారిస్తే.. ఇక వర్షాకాలంలోనూ హాయిగా ఉండొచ్చు!
Advertisement

Rainy Season AC Tips: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. త్వరలో భారీ వర్షాలు సైతం కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే సాధారణంగా వర్షాకాలంలో ఉక్కపోత, గాలిలో తేమ (హ్యుమిడిటీ) ఎక్కువగా ఉంటుంది. దీనికి ఏసీతో చెక్ పెట్టవచ్చన్న విషయం చాలా మందికి తెలీదు. ఏసీ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఇల్లు చల్లగా, ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో ఏసీని ఏ విధంగా వాడాలో ఇప్పుడు చూద్దాం.

‘డ్రై మోడ్’ ఆన్

వర్షాకాలంలో గదిలో వేడి కంటే.. జిగటగా ఉండే ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏసీని ‘కూల్ మోడ్’ లో కాకుండా ‘డ్రై మోడ్’ (Dry Mode)లో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం ఏసీ రిమోట్‌ లో వర్షపు చుక్క గుర్తు ఉన్న మోడ్ ఆన్ చేయాలని సూచిస్తున్నారు. ఇది గదిలోని అదనపు తేమను పీల్చేసి.. వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

సరైన ఉష్ణోగ్రత

Advertisement

వర్షాకాలంలో ఏసీ టెంపరేచర్‌ను 24 డిగ్రీల నుండి 26 డిగ్రీల మధ్య ఉంచితే బెటరని నిపుణులు సూచిస్తున్నారు. బయట వాతావరణం అప్పటికే చల్లగా ఉండటం వల్ల.. ఇంతకంటే తక్కువ టెంపరేచర్ పెడితే గది మరీ చల్లగా అయిపోయి ఇబ్బందిగా మారోచ్చని పేర్కొంటున్నారు. 24 డిగ్రీల వద్ద కంప్రెషర్‌పై లోడ్ తగ్గి కరెంట్ బిల్లు కూడా తక్కువ వస్తుందని హితవు పలుకుతున్నారు.

‘టర్బో’ లేదా ‘ఫాస్ట్ కూలింగ్’

ఎండకాలంలో గది త్వరగా చల్లబడటానికి చాలా మంది ‘టర్బో’ మోడ్ వాడుతుంటారు. అయితే వర్షాకాలంలో దీని అవసరం అస్సలు ఉండదు. ఒకవేళ దీనిని ఆన్ చేస్తే కంప్రెషర్ నిరంతరం వేగంగా తిరిగి విద్యుత్ వినియోగం భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి వర్షాకాలంలో టర్బో మోడ్‌ను ఆఫ్‌లో ఉంచడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఫ్యాన్ స్పీడ్ ‘ఆటో’లో పెట్టండి

Advertisement

వర్షాకాలంలో ఏసీ ఫ్యాన్ స్పీడ్‌ను ఎప్పుడూ హైలో పెట్టకుండా ‘ఆటో’ మోడ్‌ లో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. గదిలోని తేమ శాతాన్ని బట్టి ఏసీనే ఫ్యాన్ స్పీడ్‌ను నియంత్రిస్తుందని పేర్కొంటున్నారు. దీనివల్ల గదిలో చల్లదనం ఒకే స్థాయిలో ఉంటూ వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందని స్పష్టం చేస్తున్నారు.

Also Read: కొత్త ఏసీ కొంటున్నారా? ఏఐ ఏసీ vs నార్మల్ ఏసీ.. ఏది బెస్ట్ ఛాయిస్?

దుమ్ము, దూళితో జాగ్రత్త

అయితే వర్షాకాలంలో గాలిలో తేమ వల్ల ఏసీ ఫిల్టర్లలో ధూళి, బూజు త్వరగా చేరే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి వారానికి ఒకసారి ఫిల్టర్లను శుభ్రం చేయడం ద్వారా గది వాతావరణాన్ని స్వచ్ఛంగా మార్చుకోవచ్చని సూచిస్తున్నారు. అదే సమయంలో ఏసీ లైఫ్ టైమ్ ను పెంచుకోవచ్చనని స్పష్టం చేస్తున్నారు. మెుత్తం మీద వర్షాకాలంలో ఏసీలో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా.. హాయిగా ఉండొచ్చని నిపుణులు వివరిస్తున్నారు.

Also Read: సరికొత్త లుమియో టీవీ.. డాల్బీ అట్మోస్, 4K డిస్‌ప్లే.. ఇక ఇంట్లోనే థియేటర్!

Related News

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

వేగంగా కదులుతోన్న ఆస్ట్రేలియా ఖండం.. ఆసియాలోని ఆ దేశాలను ఢీకొట్టనుందా?

ఈ మ్యూజిక్ బీట్స్ చూస్తే.. మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

పాకెట్ ఫ్రెండ్లీ ప్రైస్‌లో.. డైనమిక్ థండర్ సౌండ్!

కొత్త మోడల్ వచ్చేలోపే శాంసంగ్ మాస్టర్ ప్లాన్.. బెస్ట్ AI ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్!

భారీ బ్యాటరీ, అల్టిమేట్ లుక్.. మార్కెట్‌ను షేక్ చేయడానికి Redmi 17 5G వచ్చేసింది!

రూ.15,799లకే 43ఇంచుల టీవీ..ఆఫర్ అంటే ఇలా ఉండాలి

Big Stories

Advertisement
×