E-Paper
Advertisement

iPhone 18 Proలో భారీ మార్పులు.. లాంచ్‌కు ముందే బ్యాటరీ, డిస్‌ప్లే ఫీచర్లు లీక్.. ధర కూడా పెరగనుందా?

iPhone 18 Proలో భారీ మార్పులు.. లాంచ్‌కు ముందే బ్యాటరీ, డిస్‌ప్లే ఫీచర్లు లీక్.. ధర కూడా పెరగనుందా?
Advertisement

iPhone 18 Pro Leaks: యాపిల్ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఐఫోన్ 18 ప్రో లాంచ్‌కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన ఫీచర్లు ఇప్పుడే నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా బ్యాటరీ లైఫ్, ప్రాసెసింగ్ స్పీడ్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లేలా కంపెనీ సరికొత్త టెక్నాలజీపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

బ్యాటరీ సామర్థ్యంలో కీలక మార్పులు:

చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో వెలువడ్డ లీక్స్ ప్రకారం.. ఈసారి ప్రాంతాన్ని బట్టి బ్యాటరీ సామర్థ్యంలో మార్పులు ఉండబోతున్నాయి. కేవలం ఈ-సిమ్ (eSIM) మాత్రమే ఉండే యూఎస్ మోడళ్లలో 4,288mAh బ్యాటరీని, ఫిజికల్ సిమ్ ట్రే ఉండే చైనా మోడళ్లలో 4,056mAh బ్యాటరీని అందించే అవకాశం ఉంది. గత iPhone 17 Pro మోడళ్లతో పోలిస్తే ఇది చాలా పెద్ద అప్‌గ్రేడ్ అని చెప్పొచ్చు.

పవర్‌ఫుల్ చిప్‌సెట్:

Advertisement

iPhone 18 Proలో యాపిల్ తమ సరికొత్త A20 Pro చిప్‌ను పరిచయం చేయనుంది. ఇది ఫోన్ వేగాన్ని పెంచడమే కాకుండా.. రోజువారీ పనుల్లో తక్కువ బ్యాటరీని వినియోగించుకుంటుంది. దీంతోపాటు నెట్‌వర్క్ కనెక్టివిటీని, ఇంటర్నెట్ స్పీడ్‌ను మెరుగుపరచడం కోసం కొత్త C2 మోడమ్‌ను కూడా దీనిలో వాడనున్నట్లు సమాచారం.

Also Read: 50MP కెమెరా, 6,500mAh బ్యాటరీతో Motorola Edge 70 Pro+ లాంచ్.. ధర వింటే షాకే!

డిస్‌ప్లే టెక్నాలజీతో మరింత సేవింగ్స్:

Advertisement

ఫోన్ స్క్రీన్ వల్ల బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ అవ్వకుండా ఉండేందుకు యాపిల్ సరికొత్త LTPO+ డిస్‌ప్లే ప్యానెల్‌ను తీసుకురానుంది. ఇది యూజర్ అవసరాన్ని బట్టి స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను చాలా సమర్థవంతంగా అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల స్క్రీన్ క్వాలిటీ తగ్గకుండానే బ్యాటరీ లైఫ్ చాలా సేవ్ అవుతుంది.

ధర పెరిగే అవకాశం ఉందా?

సాధారణంగా యాపిల్ ఫోన్ల ధరల విషయంలో రకరకాల ఊహాగానాలు ఉంటాయి. కొందరు ఇన్సైడర్స్ ఈసారి ధరలు మారవని చెప్తుంటే.. మరికొందరు మాత్రం కొత్త ఫీచర్ల వల్ల iPhone 18 Pro ధర పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. కంపెనీ తమ ప్రాఫిట్ మార్జిన్‌ను తగ్గించుకుంటే తప్ప ధర పెరగడం ఖాయమని లీక్స్ సారాంశం.

ఏఐ ఫీచర్ల కోసమే ఈ కసరత్తు:

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలో AI వాడకం బాగా పెరిగింది. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏఐ ఫీచర్లు రన్ అవ్వడానికి ఎక్కువ పవర్ అవసరమవుతుంది. అందుకే యాపిల్ కేవలం బ్యాటరీ సైజ్ పెంచడమే కాకుండా.. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్లని కూడా దానికి తగ్గట్టుగా ట్యూన్ చేస్తోంది. భవిష్యత్తులో వచ్చే ఏఐ టూల్స్ వల్ల బ్యాటరీ లైఫ్ దెబ్బతినకుండా ఉండేందుకే కంపెనీ ఈ మాస్టర్ ప్లాన్ వేస్తోంది.

Also Read: డిజైన్ అదిరింది.. 5x పెరిస్కోప్ కెమెరాతో Xiaomi 17T లాంచ్, సేల్స్ ఎప్పటి నుంచంటే?

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×