Actor RajaSekhar:తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న హీరో రాజశేఖర్. పోలీస్ ఆఫీసర్ పాత్రలకైనా, ఇంటెన్స్ ఎమోషన్స్‌కైనా ఆయనే కేరాఫ్ అడ్రస్. అయితే, సాధారణంగా హీరోగా కనిపించే రాజశేఖర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ధ్రువ’ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందులో అరవింద స్వామి చేసిన స్టైలిష్ విలన్ పాత్ర తనను ఎంతగా ఆకర్షించిందో చెబుతూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాలలోకి వెళితే ..
రాజశేఖర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు విలన్ పాత్రలు చేయాలని ఉందని, అయితే అవి రొటీన్ గా ఉండకూడదని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ‘ధ్రువ’ సినిమా ప్రస్తావన వచ్చింది. అందులో అరవింద స్వామి పోషించిన ‘సిద్ధార్థ్ అభిమన్యు’ పాత్ర తనకు చాలా బాగా నచ్చిందని, అప్పట్లో ఆ పాత్రను తాను చేయాలని అనుకున్నట్లు రాజశేఖర్ వెల్లడించారు. ఇక ఆ పాత్రలో ఉన్న మేధస్సు, స్టైల్ చూశాక, ఇలాంటి క్యారెక్టర్ అయితే నెగటివ్ రోల్ చేయడానికి తాను సిద్ధమేనని ఆయన మనసులో మాట బయటపెట్టారు.
కెరీర్ ఆరంభం నుండి రాజశేఖర్ విలక్షణమైన కథలనే ఎంచుకుంటూ వస్తున్నారు. హీరోగా ‘గరుడ వేగ’ వంటి హిట్ తర్వాత, ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్‌లో సరికొత్త ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కేవలం హీరోగానే కాకుండా, కథలో బలం ఉంటే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడానికి కూడా తనకు అభ్యంతరం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘ధ్రువ’ లాంటి సినిమాల్లో విలన్ అంటే కేవలం అరిచేవాడు కాదు, హీరోకి ధీటుగా తెలివైన వాడు ఉండాలని, అలాంటి పాత్రలు తన నటనలోని కొత్త కోణాన్ని చూపిస్తాయని ఆయన భావిస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఈ పాత్ర కోసం తాను అవకాశం అడిగినా సరే ఇవ్వలేదని.. ముఖ్యంగా తనను పెట్టుకుంటే ఖర్చు ఎక్కువవుతుంది అని.. అరవిందస్వామి అయితే కొన్ని షాట్స్ వాడుకోవచ్చని.. అందుకే తనను తీసుకోలేదంటూ కామెంట్లు చేశారు రాజశేఖర్..
ALSO READ:Varalakshmi Sarathkumar: నాకు పునర్జన్మనిచ్చింది ఆయనే.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న వరలక్ష్మీ
రాజశేఖర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశంగా మారాయి. ఒకవేళ ధ్రువలో అరవింద స్వామి ప్లేస్‌లో రాజశేఖర్ ఉండి ఉంటే ఎలా ఉండేది? అని అభిమానులు ఊహించుకుంటున్నారు. ఇక రాజశేఖర్ బేస్ వాయిస్, ఆయన ఇంటెన్సిటీ ఆ పాత్రకు ఖచ్చితంగా మరో లెవల్ క్రేజ్ తెచ్చిపెట్టేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో రాజశేఖర్ తన కోరిక మేరకు ఏదైనా పెద్ద సినిమాలో పవర్‌ఫుల్ విలన్‌గా కనిపిస్తారేమో అని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోలు విలన్ పాత్రల వైపు మొగ్గు చూపడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఒక పక్క హీరోగా చేస్తూనే, మరోపక్క విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలని ఆయన అనుకోవడం సినీ ఇండస్ట్రీకి కూడా ప్లస్ పాయింట్.