E-Paper
Advertisement

Car Fuel Tank: ప్యూయల్ ట్యాంక్ కొన్నికార్లకు రైట్ సైడ్, మరికొన్ని కార్లకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఎందుకో తెలుసా?

Car Fuel Tank:  ప్యూయల్ ట్యాంక్ కొన్నికార్లకు రైట్ సైడ్, మరికొన్ని కార్లకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఎందుకో తెలుసా?
Advertisement

Car Fuel Tank Design: కార్లకు సంబంధించిన ఆసక్తికర విషయాల్లో ఒకటి ఫ్యూయెల్ ట్యాంక్. అన్ని కార్లకు ఫ్యూయెల్ ట్యాంక్ ఒకేవైపు ఉండదు. కొన్ని కార్లకు కుడి వైపున ఉంటుంది. మరికొన్ని కార్లకు ఎడమ వైపున ఉంటాయి. చాలా మంది ఎందుకు ఇలా ఉంటుందనేది ఆలోచిస్తుంటారు. అయితే, ఇలా వేర్వేరుగా సైడ్లలో ఉంచడానికి పలు కారణాలు ఉన్నాయి. ఇంతకీ అవేంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్యూయెల్ ట్యాంక్ ఎక్కడ ఉండాలో ఎలా నిర్ణయిస్తారు?

సాధారణంగా ఫ్యూయెల్ ట్యాంక్ ఎక్కడ ఉండాలనేది కార్ల తయారీ సంస్థలు కారు అభివృద్ధి దశలోనే ప్లాన్ చేస్తారు. ఇంజనీర్లు ఎగ్జాస్ట్ సిస్టమ్, సస్పెన్షన్ సెటప్, అండర్ బాడీ లేఅవుట్, అందుబాటులో ఉన్న స్థలం లాంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. లేటెస్ట్ కార్లలోని పలు మోడల్స్  ఆయా ప్లాట్‌ ఫారమ్ కు అనుగుణంగా ఫ్యూయెల్ ట్యాంక్ స్థానాన్ని ఫిక్స్ చేస్తారు. నిర్మాణం ఆధారంగా అన్ని మోడళ్లకు ఇది సాధారణంగా ఒకే విధంగా ఉంటుంది. దానిని మార్చడానికి ముఖ్యమైన భాగాలను రీ డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఖర్చుతో పాటు చాలా ఇబ్బంది కలిగిస్తుంది.

భద్రత, స్ట్రక్చర్ ప్లాన్

Advertisement

ప్యూయెల్ ట్యాంక్ నిర్మాణంలో భద్రతను కీలకంగా పరిగణిస్తారు. క్రాష్ సమయంలో ప్రమాదాలను తగ్గించడానికి ఇంజనీర్లు ఇంధన ట్యాంక్, ఫిల్లర్ పైపు ప్లేస్ ను అత్యంత జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. ట్యాంక్ సాధారణంగా ప్రధాన ఇంపాక్ట్ జోన్లు, ఎగ్జాస్ట్ సిస్టమ్ లాంటి హీట్ ప్లేసెస్ కు దూరంగా ఉండేలా చేస్తారు. సైడ్ ఇంపాక్ట్ ఢీకొన్నప్పుడు, నిర్మాణ బలం కీలక పాత్ర పోషిస్తుంది. ఫిల్లర్ పైపు, ట్యాంక్ ప్లేస్ క్రాష్ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అందుకే, ప్యూయెల్ ట్యాంక్ నిర్మాణం భద్రత, ఇంజనీరింగ్ బ్యాలెన్స్ చేస్తూ కొనసాగుతుంది.

ట్రాఫిక్ ప్యాట్రాన్, కన్వీనియెన్స్

పలు దేశాల్లో ట్రాఫిక్ నియమాలు కూడా కార్ల డిజైన్ ను ప్రభావితం చేస్తాయి. భారత్, యూకే, జపాన్ లాంటి దేశాల్లో వాహనాలు రోడ్డుకు ఎడమ వైపున ప్రయాణిస్తాయి. అమెరికాతో పాటు చాలా యూరప్‌లో వాహనాలు కుడి వైపున నడుస్తాయి. కొంతమంది తయారీ దారులు ఫిల్లర్ వైపు ఎంచుకునేటప్పుడు ఇంధనం నింపే సౌలభ్యానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తారు. కానీ, యూనివర్సల్ నియమం అంటూ ఏదీ లేదు.

Advertisement

Read Also: సెల్ఫ్ స్టార్ట్ ఫెయిల్.. కిక్ రాడ్ లేదు.. బైక్ ఎలా స్టార్ట్ చేయాలో తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా సర్వసాధారణం

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కుడి వైపు, ఎడమ వైపు ప్యూయెల్ ట్యాంకులు సర్వసాధారణంగా మారాయి. ఫ్యూయెల్ ట్యాంక్ క్యాప్ ఉన్న వైపుకు సూచించే డాష్‌బోర్డ్‌ లోని ఫ్యూయెల్ గేజ్ సింబల్ పక్కన ఉన్న చిన్న బాణాన్ని చూడటం ద్వారా ఎటు వైపు ఉందో ఈజీగా తెలుసుకుంటారు. ప్యూయెల్ నింపే సమయంలో అందుకు అనుగుణంగా కారును ఆపుతారు.

Read Also:  రేంజ్ రోవర్ ను మక్కికి మక్కి దింపేసిన చైనా, మరీ ఇంత ఘోరమా?

Related News

పెట్రోల్‌తో పాటు ఇథనాల్‌ తోనూ పరుగులు.. కియా సైరోస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు వచ్చేస్తోంది!

హీరో, హోండాకు టీవీఎస్ షాక్.. ఆగస్టులో నంబర్ వన్ టూ వీలర్ కంపెనీగా రికార్డ్!

కొత్త కలర్స్‌ తో కవాసకి Z సిరీస్.. నయా లుక్ సూపరో సూపరు!

కియా సోరెంటో వచ్చేసింది.. ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలే!

హిమాలయన్ 440 వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

టాటా కర్వ్‌ లో కొత్త సిరీస్ X.. తక్కువ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!

హోండా ఫ్యాన్స్‌ కు గుడ్‌న్యూస్.. ఎలివేట్, సిటీ, అమేజ్‌పై అదిరిపోయే డిస్కౌంట్లు!

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

Big Stories

Advertisement
×