E-Paper
Advertisement

Varalakshmi Sarathkumar: నాకు పునర్జన్మనిచ్చింది ఆయనే.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న వరలక్ష్మీ

Varalakshmi Sarathkumar: నాకు పునర్జన్మనిచ్చింది ఆయనే.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న వరలక్ష్మీ

Varalakshmi Sarathkumar:విలక్షణ నటుడు శరత్ కుమార్ (Sarath Kumar) వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar) హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న ఈ ముద్దుగుమ్మకు అవకాశం తలుపు తట్టలేదు. కొన్ని సినిమాలలో హీరోయిన్గా నటించినా.. ఆ చిత్రాలు పెద్దగా గుర్తింపును అందించలేదు. దీంతో తన రూట్ మార్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా హీరోయిన్గా వర్కౌట్ కాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తూ వచ్చిన వరలక్ష్మి శరత్ కుమార్.. తెలుగులో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమాలో విలన్ గా నటించి.. మొదటి సినిమాతోనే ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.

దర్శకురాలిగా మారిన వరలక్ష్మి శరత్ కుమార్..

ముఖ్యంగా తెలుగులో విలన్ పాత్రలతో ఆకట్టుకుంటున్న వరలక్ష్మి శరత్ కుమార్.. ఫ్లాపుల్లో ఉన్న హీరోలకి లక్కీ లేడీగా కూడా మారిపోయింది. అలాంటి ఈమె తాజాగా దర్శకురాలిగా అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ‘సరస్వతి’ అనే చిత్రాన్ని తెరకెక్కించింది. ట్రైలర్ రిలీజ్ చేయగా ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు..ఈ ఈవెంట్ కి ప్రముఖ నిర్మాత బన్నీ వాసు , డైరెక్టర్ గోపీచంద్ మలినేని గెస్ట్ గా వచ్చారు. ఈ ఈవెంట్లో వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది.

ALSO READ:Nabha Natesh: సమ్మర్ టార్గెట్.. రెండు ప్రెస్టేజియస్ మూవీస్ తో నభానటేష్.. ఇవైనా గట్టెక్కిస్తాయా?

నాకు పునర్జన్మనిచ్చింది ఆయనే..

సరస్వతి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మాట్లాడుతూ.. “నేను ఎప్పుడూ కూడా ఫిమేల్ రైట్స్ కోసం నిలబడతానని అందరికీ తెలుసు. అయితే ఇది కూడా అలాంటి సినిమానే. గోపీచంద్ మలినేని వల్లే తెలుగులో నాకు మళ్ళీ లైఫ్ వచ్చింది. ఆయనే నాకు పునర్జన్మని ఇచ్చారు. తెలుగు ఆడియన్స్ కి ధన్యవాదాలు. నాకు చాలా టెన్షన్స్ ఉన్నాయి. అందుకే ఎమోషనల్ అవుతున్నాను. ఇది రియల్ గా చాలా మంచి సినిమా.. ప్రమోట్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాము. ఈ సినిమాను కచ్చితంగా చూడండి
. ముఖ్యంగా ఇండస్ట్రీలో మహిళలు ఎదగడానికి హెల్ప్ చేయండి .సాధారణంగా నేను ఎమోషనల్ అవ్వను. కానీ ఈరోజు అయ్యాను. మహిళలు ఏడుపుని క్యారీ చేస్తారు.. నేను ఇండస్ట్రీలో ప్రతి అమ్మాయి కోసం నిలబడ్డానికి ప్రయత్నం చేస్తాను. ఒక అమ్మాయిగా ఇండస్ట్రీలో ఉండడం చాలా కష్టం” అంటూ ఎమోషనల్ అయ్యింది వరలక్ష్మి శరత్ కుమార్. మొత్తానికైతే అటు నటిగా ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు దర్శకురాలిగా ఒక కొత్త ప్రయోగం మొదలుపెట్టింది మరి ఈ ప్రయాణం వరలక్ష్మీ శరత్ కుమార్ ను ఎలాంటి గమ్యానికి చేరుస్తుందో చూడాలి.

Related News

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×