Ram Pothineni: ఇటీవల కాలంలో ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొంతమంది హీరోలు నిర్మాతలుగా మారి పెద్ద ఎత్తున సినిమాలను నిర్మిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు .మరి కొంతమంది దర్శకులుగా కూడా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొక హీరో కూడా మెగా ఫోన్ పెట్టబోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే దర్శకుడిగా మారబోతున్న ఆ హీరో మరెవరో కాదు నటుడు రామ్ పోతినేని(Ram Pothineni) అని తెలుస్తుంది. ఇటీవల కాలంలో రామ్ పోతినేని చేస్తున్న సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి.
ఇలా వరుస డిజాస్టర్ సినిమాలో వెంటాడుతున్న నేపథ్యంలో రామ్ పోతినేనితో సినిమాలు చేయటానికి పెద్దగా దర్శక నిర్మాతలు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలోనే రామ్ స్వయంగా తనకోసం ఒక కథను సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు అదే కథతో ఆయన దర్శకుడిగా మారి సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. రామ్ ఇటీవల ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఈయన ఒక పాటను రాసిన సంగతి తెలిసిందే. నువ్వుంటే చాలే అనే ఈ పాట ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకుంది . ఇప్పుడు అదే ప్రేరణతో రామ్ పోతినేని ఏకంగా ఓ సినిమా కథను కూడా సిద్ధం చేశారని తెలుస్తోంది.
తాజా నివేదికల ప్రకారం, రామ్ పోతినేని స్వయంగా రాసుకున్న కథకు, ‘ ది లోన్ వోల్ఫ్’ (The Lone wolf)అనే వర్కింగ్ టైటిల్ పెట్టినట్టు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాకు సరైన దర్శకుడి కోసం ఈయన వేట కూడా మొదలు పెట్టారని అయితే ఈ సినిమా చేయటానికి దర్శకులు ఎవరు ముందుకు రాని నేపథ్యంలో నేరుగా రామ్ పోతినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా కథ ,స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ , అలాగే నిర్మాతగా కూడా రామ్ పోతినేని వ్యవహరించబోతుండటం విశేషం.
కొత్త ప్రయోగాలు అవసరమా?
ఇక ఈ విషయం గురించి రామ్ పోతినేని నుంచి ఎలాంటి అధికారక ప్రకటన వెలబడలేదు కానీ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారడంతో అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేయగా మరికొందరు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ హీరోయిన్ పాత్రలు ఏ పాపం చేశాయి అవి కూడా మీరే చేసేయొచ్చు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక వరుస డిజాస్టర్ సినిమాలతో కెరియర్ ను ఇబ్బందులలో పడేసుకున్న రామ్ ఇలాంటి సమయంలో డైరెక్టర్ గా కొత్త ప్రయోగాలు అవసరమా అంటూ మరి కొంతమంది ఈ విషయంపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మరి రామ్ పోతినేని సినిమా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా స్పందించాల్సి ఉంది.
Also Read: క్యాస్టింగ్ కౌచ్ పై హన్సిక బోల్డ్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్స్!