MG Majestor India Launch Soon: భారత మార్కెట్ లో పెద్ద ఎస్‌యూవీలకు డిమాండ్ పెరుగుతున్ననేపథ్యంలో.. ఈ సెగ్మెంట్ లోకి కొత్త కారు అడుగు పెట్టబోతోంది. MG మెజెస్టర్ త్వరలో భారత్ లో విడుదల కాబోతోంది. సైజ్, పవర్, సౌకర్యం కలిపి ఫ్యామిలీ, అడ్వెంచర్ వినియోగదారులను అనుకూలంగా ఈ కారు రెడీ అవుతోంది. MG మెజెస్టర్ ఎస్‌యూవీ ప్రధానంగా ఆరు సీట్లు, ఏడు సీట్ల ఎంపికలతో అందుబాటులోకి రానుంది. పెద్ద కుటుంబాలు, ఎక్కువ స్థలం కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది. లోపలి భాగం విశాలంగా ఉండేలా డిజైన్ చేయబడింది. సుదూర ప్రయాణాల్లో కూడా ప్రయాణికులు సౌకర్యంగా వెళ్లే అవకాశం ఉంటుంది.
ఇంజిన్ పరంగా చూస్తే, ఈ మోడల్‌లో 2.0 లీటర్ సామర్థ్యం కలిగిన ట్విన్ టర్బో డీజిల్ ఇంజిన్ ను అమర్చుతున్నారు. ఇది సుమారు 212bhp పవర్, 478Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. హైవేలపై డ్రైవింగ్ అయినా, అడ్వెంచర్ రైడ్స్ కోసం అయినా ఈజీగా ఉపయోగించుకునేలా ఉంటుంది. ఇది కేవలం సిటీ ప్రయాణాలకు మాత్రమే కాకుండా, ఆఫ్ రోడ్ డ్రైవింగ్ కు కూడా అనుకూలంగా ఉంటుంది. ఇందులో 4×4 డ్రైవ్ సిస్టమ్ ఉండటం ఓ ముఖ్యమైన ప్రత్యేకత. అంతేకాదు, ట్రిపుల్ డిఫరెన్షియల్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉండటం వల్ల గతుకుల రోడ్లపై కూడా వెహికల్ ముందుకు సాగుతుంది. అడ్వెంచర్ ట్రిప్స్, పర్వత ప్రాంతాల్లో డ్రైవ్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా చెప్పుకోవచ్చు.
ఫీచర్ల విషయంలో కూడా ఈ ఎస్‌యూవీ చాలా ముందుంటుంది. ఆధునిక టెక్నాలజీతో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డిస్ ప్లేలు, సౌకర్యవంతమైన సీట్లు, ప్రీమియం మెటీరియల్స్ కలిపి లోపలి భాగాన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తాయి. ప్రయాణికుల సౌకర్యం కోసం తగినంత లెగ్ రూమ్, హెడ్ రూమ్ కూడా ఉంటుంది. భద్రత అంశాలు కూడా ఇందులో చాలా అత్యాధునికంగా ఉంటాయి. బలమైన నిర్మాణం, ఆధునిక భద్రతా ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మార్చుతాయి. సుదూర ప్రయాణాల్లో డ్రైవర్‌కు సౌకర్యం కోసం పలు అసిస్టెన్స్ ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
ఇక MG మెజెస్టర్ ధర విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ ప్రారంభ ధర సుమారు రూ. 40 లక్షల వద్ద ఉండవచ్చని అంచనా. ఈ ధరలో, పెద్ద సైజ్, పవర్ ఫుల్ ఇంజిన్, అధునాతన ఫీచర్లు కలిపి రానున్నాయి. ఈ ఎస్‌యూవీ భారత మార్కెట్‌లో ప్రీమియం సెగ్మెంట్ లో ఒక కొత్త ఆప్షన్ నిలిచే అవకాశం ఉంది. సౌకర్యం, పనితీరు, టెక్నాలజీ కలిపి, పెద్ద కుటుంబాలకు, అడ్వెంచర్ ప్రియులకు ఇదో ఆకర్షణీయమైన వెహికల్ కానుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
Read Also: కియా సోరెంటో హైబ్రిడ్ టెస్టింగ్ షురూ, లాంచింగ్ ఎప్పుడో తెలుసా?