E-Paper
Advertisement

క్యాస్టింగ్ కౌచ్ పై హన్సిక బోల్డ్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్స్!

క్యాస్టింగ్ కౌచ్ పై హన్సిక బోల్డ్ కామెంట్స్.. మండిపడుతున్న నెటిజన్స్!
Advertisement

Hansika Motwani: చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోయిన్ గా దక్షిణాది సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో హన్సిక ఒకరు. నార్త్ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అయినప్పటికీ తెలుగులో అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న హన్సిక అనంతరం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగారు. ఇటీవల హన్సిక సినిమాలను కూడా కాస్త తగ్గించారనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఈమె తన సినిమాల కంటే కూడా వ్యక్తిగత విషయాల ద్వారా వార్తలలో నిలుస్తున్నారు.

క్యాస్టింగ్ కౌచ్ పై హన్సిక రియాక్షన్..

ముఖ్యంగా హన్సిక తన భర్తకు విడాకులు ఇవ్వడంతో ఈమెకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేశాయి. ఇటీవల భర్త నుంచి అధికారికంగా విడాకులు తీసుకొని విడిపోయిన హన్సిక తిరిగి కెరియర్ పరంగా బిజీ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్(Casting Couch) గురించి ఈమెకు ప్రశ్నలు ఎదురయ్యాయి.

నాకు ఇలాంటి అనుభవం ఎదురవ్వలేదు..

Advertisement

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ ఇప్పటికీ ఎంతో మంది సెలబ్రిటీలు వారు ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హన్సికకు కూడా క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నలు ఎదురవడంతో ఆమె సమాధానం చెబుతూ.. నిజంగానే పనిచేయాలి అనుకునేవారికి ఇలాంటివి ఎప్పుడు ఎదురవ్వవని నేను భావిస్తాను. నా విషయంలో ఎప్పుడు ఇలా జరగలేదు కాబట్టి నేను అలాగే భావిస్తాను అంటూ హన్సిక క్యాస్టింగ్ కౌచ్ పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు మీకు ఎదురు కాకపోయినంత మాత్రాన ఇండస్ట్రీలో ఈ సమస్య లేదని అర్థం కాదు కదా అంటూ మరో ప్రశ్న ఎదురయింది.

నాకు అవగాహన లేదు..

Advertisement

ఈ ప్రశ్నను హన్సిక సమాధానం చెబుతూ.. అవును పక్కవారి గురించి నాకు తెలియదు కాబట్టి ఈ విషయంపై నేను కామెంట్ చేయదలచుకోలేదు, నాకు ఈ విషయంపై ఏ విధమైనటువంటి అవగాహన లేదని ఈమె సమాధానం చెప్పడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇలా క్యాస్టింగ్ కౌచ్ గురించి హన్సిక చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హన్సిక స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కనీసం పక్కవారి కష్టాలను గుర్తించలేని విధంగా ఈమె ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అంటూ హన్సిక వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలు ఈ విధమైనటువంటి అంశాల గురించి మాట్లాడేటప్పుడు కాస్త సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.

Also Read: దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీ…కీలక నిర్ణయం తీసుకున్న రాకా టీమ్..

Related News

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

Big Stories

Advertisement
×