E-Paper
Advertisement

శివ కార్తికేయన్ ప్రొడక్షన్ పేరుతో భారీ మోసం.. అసలు నిజం బయటపెట్టిన హీరో!

శివ కార్తికేయన్ ప్రొడక్షన్ పేరుతో భారీ మోసం.. అసలు నిజం బయటపెట్టిన హీరో!
Advertisement

Siva Karthikeyan:ఒకప్పటితో పోల్చుకుంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో అటు మోసాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ప్రముఖుల పేర్లు, ప్రముఖుల సంస్థల పేరుతో కొంతమంది మోసాలకు పాల్పడుతుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలు కూడా కోర్టును ఆశ్రయిస్తూ ఇలాంటి మోసాలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు మరో హీరో ప్రొడక్షన్ సంస్థతో భారీ మోసానికి పాల్పడడంతో ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగారు సదరు హీరో.. అంతే కాదు ఈ విషయాలపై ఆయన స్పందించి అందరినీ అలర్ట్ చేశారు.

శివ కార్తికేయన్ ప్రొడక్షన్ పేరుతో భారీ మోసం..

అసలు విషయంలోకి వెళ్తే.. ఇలాంటి మోసం ఇప్పుడు ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ విషయంలో జరిగింది. కోలీవుడ్లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన.. 2018 లో శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ పేరుతో సినిమా నిర్మాణ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే . ముఖ్యంగా ఈ నిర్మాణ సంస్థ ద్వారా పలువురు కొత్త దర్శకులకు, నటీనటులకు అవకాశాలు కల్పిస్తూ చిత్రాలను నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా వచ్చే ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుంది ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు ఈ ప్రొడక్షన్ బ్యానర్ నిర్మిస్తున్న చిత్రం అమ్మాముత్తు.. సూర్య దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది . ఇలాంటి సమయంలో శివ కార్తికేయన్ ప్రొడక్షన్స్ పేరుతో కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారనే విషయం తాజాగా హీరో శివ కార్తికేయన్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందిస్తూ మీడియాకి ఒక ప్రకటన విడుదల చేశారు .అంతేకాదు ఈ ప్రకటనతో అందరిలో అవేర్నెస్ కూడా తీసుకొచ్చారు.

ప్రకటన విడుదల చేసిన శివకార్తికేయన్..

Advertisement

శివ కార్తికేయన్ తన ప్రకటనలో ఈ విధంగా రాసుకొచ్చారు. “మా సంస్థ నిర్మించే చిత్రాల కోసం నటీనటులను ఎంపిక చేయడానికి దర్శకులను, నిర్వాహకులను , కాస్టింగ్ ఏజెంట్లను, మరెవరినో మేము ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఎస్కే ప్రొడక్షన్స్ పేరుతో విడుదలయ్యే వివరాలతో కూడిన ప్రకటనలను మేము అధికారిక సామాజిక మాధ్యమాల ద్వారానే వెల్లడిస్తాము. ఇతర ఏ సామాజిక మాధ్యమాలలో జరుగుతున్న ప్రచారాలను మీరు నమ్మకండి. శివ కార్తికేయ ప్రొడక్షన్స్ పేరును మోసపూరితంగా ఉపయోగిస్తున్న వారిపై త్వరలోనే చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అంటూ శివ కార్తికేయన్ హెచ్చరించారు. ఇక ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్లు వైరల్ గా మారాయి.

also read:విజయ్ ఒంటరితనాన్ని త్రిష వాడుకుంటోంది.. సంచలన కామెంట్లు చేసిన సింగర్!

శివ కార్తికేయన్ సినిమా జీవితం..

Advertisement

శివ కార్తికేయన్ విషయానికి వస్తే.. తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. వాస్తవానికి తమిళ్ చిత్రాలను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్న ఈయన ఇటీవల మదరాసి , పరాశక్తి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఇప్పుడు మరికొన్ని ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు. ఒకవైపు హీరోగా మరొకవైపు చిత్రాలను నిర్మిస్తూ మరింత బిజీగా మారిపోయారు శివ కార్తికేయన్.

Related News

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

ఫిగర్ బాలేదని టార్చర్.. 40 ఏళ్లొచ్చాకే ఆ నరకం నుండి బయటపడ్డానంటున్న తారక్ హీరోయిన్

యాంకర్ సుమ హీరోయిన్‌గా నటించిన ఏకైక సినిమా ఏంటో తెలుసా ?

‘టాక్సిక్’ ట్రైలర్ డేట్ ఫిక్స్..ఇదైనా ఖాయమా యష్?

72వ జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన తెలుగు సినిమాలు.. ఉత్తమ చిత్రం ఏదంటే?

విక్రమ్ 1 సక్సెస్.. చిరు ఫిదా: ప్రైవేట్ రాకెట్ ప్రయోగంపై మెగాస్టార్ క్రేజీ రియాక్షన్!

Big Stories

Advertisement
×