E-Paper
Advertisement

కేవలం రూ.2 లతో రూ.10 లక్షలు.. పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్

కేవలం రూ.2 లతో రూ.10 లక్షలు.. పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్
Advertisement

Postal Accidental Insurance: కేవలం 2 రూపాయలతో రూ.10 లక్షలు వచ్చే పోస్టాఫీస్ స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ లో మనం రోజుకు రెండు రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే.. మనకు ఏదైనా ప్రమాదం జరిగితే నామినీకి రూ.10 లక్షలు ఇస్తారు. ఇదే పోస్టాఫీస్ గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే.. పాలసీలో మెన్షన్ చేసిన నామినీకి రూ.10 లక్షలు లభిస్తాయి. ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలతో పాటు చాలా రకాల ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే ఇలాంటి యాక్సిడెంటల్ పాలసీ అనేది ఉండడం చాలా అవసరం.

రూ.5 లక్షలు, రూ.10 లక్షల బీమా

పోస్టాఫీస్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లో రెండు రకాలు ఉన్నాయి. ఏడాది రూ.339 చెల్లిస్తే మీకు రూ.5 లక్షల బీమా లభిస్తుంది. అలాగే ఏడాదికి రూ.699 చెల్లిస్తే మీకు రూ.10 లక్షల యాక్సిడెంటల్ బీమా లభిస్తుంది. అంటే రోజుకు సుమారు 2 రూపాయలతో రూ.10 లక్షల పాలసీ పొందవచ్చు. ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత వైకల్యం లేదా పాక్షిక వైకల్యం, ప్రమాదం వల్ల పక్షవాతం, ప్రమాదాలకు సంబంధించిన వైద్య ఖర్చులు ఈ పాలసీలో కవర్ అవుతాయి. ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే.. మీ వయస్సు 18-65 మధ్య ఉండాలి. ఈ పాలసీ కావాలనుకుంటే మీ దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్తే సరిపోతుంది.

అదనపు ప్రయోజనాలు

Advertisement

ప్రమాదంలో పాలసీ హోల్డర్ మరణిస్తే నామినీకి రూ.10 లక్షలు ఇస్తారు. ప్రమాదంలో పర్మినెంట్ టోటల్ డిజబిలిటీకి రూ.10 లక్షలు ఇస్తారు. పార్షియల్ డిజబిలిటీకి రూ.10 లక్షల వరకు పొందవచ్చు. అంబులెన్స్ ఖర్చులు రూ.25 వేలు, అంతిమ సంస్కారాలకు రూ.5 వేల వరకు ఇస్తారు. అలాగే బాధిత వ్యక్తి.. ఇద్దరు పిల్లల చదువులకు సమ్ అస్యూర్డ్ లో 10 శాతం వరకు ఇస్తారు. రూ.10 లక్షల పాలసీ అయితే లక్ష రూపాయల వరకు ప్రయోజనం పొందవచ్చు. టెర్రరిజం వల్ల జరిగే ప్రమాదాలు కూడా ఈ పాలసీలో కవర్ చేస్తారు. ప్రమాదాల వైద్య ఖర్చులు లక్ష రూపాయలు, ఓపీడీకి రూ.30 వేల వరకు చెల్లిస్తారు. అలాగే రోజుకు రూ.500 వరకు క్యాష్ బెనిఫిట్ కూడా పొందవచ్చు. దీంతో పాటు మరెన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

Also Read:  పంట నష్టం జరిగితే ఏం చేయాలి?.. 72 గంటల రూల్ తెలుసా?

Related News

ఫుడ్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. SBI ఎటర్నల్ కార్డ్ లాంచ్.. ఉచితంగా జొమాటో గోల్డ్ సేవలు!

బంగారం-వెండి వస్తువుల ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

చిన్న వయసులోనే కోటీశ్వరుడు అవ్వడం ఎలా? ఇదిగో అత్యుత్తమ ప్లాన్.. రూ.10 వేలు ఉంటే చాలు!

పోటీకి మేం సిద్ధమే.. మస్క్ ఆరోపణలపై రిలయన్స్ స్ట్రాంగ్ కౌంటర్

మధ్యతరగతి రిటైర్మెంట్ కోసం రూ.1 కోటి సరిపోతుందా? భవిష్యత్తు కోసం మేజిక్ ఫిగర్ ఎంత?

భార్య లోన్ కట్టకపోతే భర్త పెన్షన్ డబ్బులు కట్ చేసిన బ్యాంక్.. కోర్టు తీర్పు ఇదే

తప్పుడు అకౌంట్‌కు యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి!

డబ్బులు కావాలని ఫోన్ చేస్తే.. బంధువులు, స్నేహితులకు ‘నో’ చెప్పడం ఎలా?

Big Stories

Advertisement
×