E-Paper
Advertisement

ఐదుసార్లు చావును దగ్గరగా చూశాను.. అదే నాకు ఇంపార్టెంట్.. హీరో కామెంట్స్..

ఐదుసార్లు చావును దగ్గరగా చూశాను.. అదే నాకు ఇంపార్టెంట్.. హీరో కామెంట్స్..
Advertisement

Hero Suhas : సినిమాలోకి రావాలన్న కోరిక ఉంటేనే సరిపోదు సినిమాలు కోసం ఎంత త్యాగమైనా చేయాలి అంటూ.. ఈమధ్య ఇండస్ట్రీలోని చాలామంది హీరోలు పలు ఇంటర్వ్యూలలో బయటపెడుతున్నారు. కొందరేమో సినిమాల కోసం ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టాల్సి వస్తుంది అంటూ చెబుతున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కూడా అలాంటి విషయాన్ని షేర్ చేస్తారు. ఇండస్ట్రీలో మనం ఏంటో నిరూపించుకోవాలంటే దానికి చాలా కష్టపడాలి అంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన సినిమా విశేషాల గురించి పంచుకుంటూనే తాను సినిమాల కోసం చేస్తున్న రిస్కీ స్టంట్ల గురించి బయటపెట్టారు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.. ఆ హీరో ఏమన్నారు..? ఎందుకు ఆయన రిస్క్ చేశాడు అన్న విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఐదు సార్లు చావును చూశాను.. 

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ప్రస్తుతం హీరోగా మాత్రమే కాదు. విలన్ గా కూడా నటిస్తున్నాడు. మండాడి అనే సినిమాలు ప్రస్తుతం నటిస్తున్నాడు. ఈ మూవీలో అత్యంత భయంకరంగా కనిపించే విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. అందులో భాగంగా మూవీ నుంచి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్బంగా సినిమా కోసం చేసిన రిస్కీ స్టెంట్స్ గురించి బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు.. ఈ సినిమాలో కీలకమైన ఒక సీన్ గురించి బయటపెట్టారు. ఈ సినిమాలో తన లుక్ చూసి అందరూ షాక్ అయిపోయారు. అంత రగ్డ్, వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ పాత్ర తన కెరీర్లో ఒక మైలురాయిలా నిలిచిపోతుందని భావిస్తున్నాడు సుహాస్.. ఈ మధ్య కొన్ని సినిమాలు మాత్రం గ్రాఫిక్స్ పెడతారు. కానీ ఈ మూవీ టీం మాత్రం నిజంగా సముద్రంలోనే ముఖ్య సన్నివేశాలన్నీ తీసింది. ఈ సందర్భంగా బోటు తిరగబడి కొందరు తృటిలో ప్రాణాలతో బయటపడడం.. కెమెరాలు మునిగిపోవడం గమనార్హం అంటూ అతను అన్నారు. ఇలా ఐదు సార్లు సాహసం చేసాము.. దాదాపు 45 రోజులు పాటు సముద్రంలో ఇలాంటి యుద్ధం చేశామని సుహాస్ అన్నారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది. ఇది విన్న నెటిజన్లు నిజంగా గ్రేట్ బ్రో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రం నుంచి బయటకొచ్చిన అప్డేట్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..

సుహాస్ సినిమాల విషయానికొస్తే..

Advertisement

సుహాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కమెడియన్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. యూట్యూబ్ వీడియోలతో బాగా ఫెమస్ అయిన ఆయన ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత సినిమాల్లో హీరోగా చేశాడు. కలర్ ఫోటో సినిమాతో తెలుగు వెండితెర పైకి హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఆ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో వరుసగా సినిమాలు చేసే అవకాశాలు అందుకున్నాడు. ఆయన చేసిన ప్రతి మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం తెలుగుతో పాటుగా వేరే భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు..

Also Read : గార్జీయస్ లుక్ లో మెరిసిపోతున్న పూజిత.. కుర్రాళ్ళు ఏమైపోతారమ్మా..!

Related News

హరికృష్ణ 70వ జయంతి..ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్!

“ప్రజలు మెచ్చిన నాయకుడు”.. పవన్ కళ్యాణ్ కు చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్!

Poojitha Ponnada : గార్జీయస్ లుక్ లో మెరిసిపోతున్న పూజిత.. కుర్రాళ్ళు ఏమైపోతారమ్మా..!

HBD Pawan Kalyan : బర్త్ డే స్పెషల్.. ఆ ఒక్కటే పవర్ స్టార్ ను చేసిందా..?

కృష్ణుడిగా రామ్ చరణ్.. సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయనున్నారా?

టాక్సిక్ సినిమాకు రేటింగ్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ రేటింగ్.. ఇంత రారుణమా?

మై లిటిల్ ప్యారడైజ్..కొడుకుతో క్యూట్ ఫోటోలను షేర్ చేసిన నాని..

Big Stories

Advertisement
×