Dolby Atmos Smart TVs: ప్రస్తుత డిజిటల్ కాలంలో.. థియేటర్‌కి వెళ్లే టైం కుదరకపోయినా.. ఓటీటీల పుణ్యమా అని ఇంట్లోనే ఆ థియేటర్ కిక్ కోరుకుంటున్నారు మూవీ లవర్స్. దీని కోసం కేవలం.. 4K డిస్‌ప్లే ఉన్న టీవీలు ఉంటే సరిపోదు, చెవులకు ఇంపుగా ఉండే.. అద్భుతమైన సౌండ్ సిస్టమ్ కూడా ఉండాలి. అందుకే ప్రముఖ టీవీ బ్రాండ్లు అన్నీ ఇప్పుడు ‘డాల్బీ అట్మాస్’, ‘డాల్బీ ఆడియో’ టెక్నాలజీపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ టెక్నాలజీ వల్ల సౌండ్ కేవలం ముందు నుంచి కాకుండా.. మీ చుట్టూ, పైనుంచి వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.ప్రస్తుతం మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న , బడ్జెట్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు లభించే టాప్ స్మార్ట్ టీవీల వివరాలు..
బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి TCL బ్రాండ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఇందులో వచ్చే డాల్బీ అట్మాస్ , డాల్బీ విజన్ సపోర్ట్ మీ విజువల్స్ , ఆడియో ఫీల్ డబల్ చేస్తుంది.
దీని ధర సుమారు రూ.36,000 నుంచి రూ.42,990 వరకు ఉంది.
హైయర్ సంస్థ ఇటీవల మార్కెట్లోకి తెచ్చిన ఈ కొత్త సిరీస్, అద్భుతమైన పిక్చర్ క్లారిటీతో పాటు పవర్ ఫుల్ 2.1 ఛానెల్ స్పీకర్లను కలిగి ఉంది. ఇది డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో వస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు రూ.39,190 నుంచి మొదలవుతుంది.
ఫిలిప్స్ లూమినా సిరీస్ టీవీలు అద్భుతమైన కలర్ రీప్రొడక్షన్ తో పాటు పవర్ ఫుల్ 30W డాల్బీ అట్మాస్ సౌండ్‌ను అందిస్తాయి. గేమింగ్ , మూవీస్‌కి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. దీని ధర సుమారు రూ.34,999 నుంచి రూ. 78,799 వరకు మోడల్ బట్టి లభిస్తుంది.
హైసెన్స్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ టీవీలు తక్కువ ధరలోనే లేటెస్ట్ ఫీచర్లను అందిస్తున్నాయి. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ కాంబినేషన్‌తో సినిమా థియేటర్ ఫీల్ పక్కాగా దొరుకుతుంది. దీనిధర సుమారు రూ.46,999 నుంచి రూ.49,999 మధ్య ఉంది.
వియు బ్రాండ్ టీవీలు వాటి.. వైబ్రెంట్ డిస్‌ప్లే , లౌడ్ ఆడియోకు పేరుగాంచాయి. ఇందులో.. ఉన్న డాల్బీ ఆడియో , అట్మాస్ ఫీచర్ క్లియర్ డైలాగ్ డెలివరీని ఇస్తుంది. దీని ధర సుమారు రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది.
ప్రీమియం సౌండ్ , పిక్చర్ క్వాలిటీ విషయంలో.. సోనీ బ్రావియాకు సాటి ఏదీ లేదు. ఎక్స్ఆర్ ప్రాసెసర్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో ఇది ప్రతి సీన్‌ను జీవం పోస్తుంది. దీని ధర సుమారు మోడల్‌ను బట్టి సుమారు రూ.63,490 నుంచి ప్రారంభమవుతుంది.
Also Read: రూ.2,390లకే డైమండ్ కట్ డిజైన్ స్మార్ట్‌వాచ్..పెబుల్ వియన్నా స్పెషల్ లుక్!
సామాన్యులకు కూడా అందుబాటు ధరలో బెస్ట్ డాల్బీ ఆడియో ఫీచర్లను షియోమి అందిస్తోంది. గూగుల్ టీవీ ఓఎస్ తో నడిచే ఈ టీవీలు స్మార్ట్ ఫీచర్లకు కేరాఫ్ అడ్రస్. దీని ధర సుమారు రూ.25,000 నుంచి రూ.39,999 వరకు ఉంటుంది.
మీ ఇంట్లో ఒక చిన్న థియేటర్ సెటప్ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే.. ఈ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న స్మార్ట్ టీవీలు మీకు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి. మీ బడ్జెట్, రూమ్ సైజ్ ఆధారంగా తగిన మోడల్‌ను ఎంచుకోండి.