E-Paper
Advertisement

Funky Movie : సూపర్ రన్ టైంతో వస్తున్న ‘ఫంకీ’.. విశ్వక్ ఈసారి కొట్టేస్తాడా..?

Funky Movie : సూపర్ రన్ టైంతో వస్తున్న ‘ఫంకీ’.. విశ్వక్ ఈసారి కొట్టేస్తాడా..?
Advertisement

Funky Movie : టాలీవుడ్ మాస్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం ఫంకీ… టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వం వహించగా బ్యూటిఫుల్ హీరోయిన్ కాయదు లోహర్ హీరోయిన్గా నటిస్తుంది. వాలంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. గతంలో ఎన్నడు కనిపించిన విధంగా విశ్వక్ ఈ మూవీలో కనిపించడంతో ఈ సినిమాకి హైప్ నెలకొంది.. జాతి రత్నాలు లాంటి కామెడీ మూవీతో జనాలని కడుపుబ్బా నవ్వించిన అనుదీప్ ఈ సినిమాతో మరో హిట్ను తన ఖాతాలో వేసుకోబోతున్నాడని ట్రైలర్ చూస్తే అర్థమౌతుంది. తాజాగా ఈ చిత్రం క్రీస్పి రన్ టైం ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. మరి ఎన్ని నిమిషాల నిడివితో మూవీ రాబోతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

విశ్వక్ ‘ఫంకీ’ మూవీ రన్ టైం..

కామెడీ, లవ్ ఎంటర్టైనర్ గా రాబోతున్న చిత్రం ఫంకీ.. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.. ​ఈ సినిమా సుమారు 130 నిమిషాల (2 గంటల 10 నిమిషాలు) నిడివితో చాలా క్రిస్పీగా ఉండబోతోందని తెలుస్తుంది. భారీ కథనంతో రాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద లాభల్లోకి రావాలంటే మాత్రం రూ.15 కోట్లు గ్రాస్ రాబట్టాలి. అలాగే దాదాపు 40 కోట్లు వసూళ్లను అందుకోవాలి. అప్పుడే మూవీ హిట్ అవుతుంది. ఫిబ్రవరి 13న స్టార్ హీరోల సినిమాలు ఏవి లేకపోవడంతో ఈ సినిమాకు పెద్దగా పోటీ కూడా లేదని చెప్పాలి.. దాంతో సినిమా కనక బాగుంటే కలెక్షన్లు భారీగా వసూల్ అయ్యే అవకాశం ఉంది..

Advertisement

Also Read : బిగ్ బాస్ ఆఫర్ పై సుప్రిత షాకింగ్ కామెంట్స్.. ఆ ఒక్కటే నేను చేసిన మిస్టేక్..

దర్శకుడుగా విశ్వక్.. 

హీరో విశ్వక్ సేన్ ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే.. కానీ ఇప్పుడు రాబోతున్న ఫంకీ మూవీలో ఈ హీరో డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. డైరెక్టర్ గా ఇందులో నటించగా, హీరోయిన్ను నిర్మాతగా వ్యవహరిస్తుంది. మొత్తానికి ఇది ఒక సినిమా స్టైల్ స్టోరీ అనే చెప్పాలి. ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. కేవలం మూడు రోజులు మాత్రమే ఉండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో జోరుని పెంచింది. హీరో హీరోయిన్లు పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ లిస్తూ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.. ఇక ​సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వాలంటైన్స్ డే వీకెండ్‌లో యువతకు మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్‌గా ‘ఫంకీ’ నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో నరేష్, వీటీవీ గణేష్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు.

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×