E-Paper
Advertisement

Supritha Naidu : బిగ్ బాస్ ఆఫర్ పై సుప్రిత షాకింగ్ కామెంట్స్.. ఆ ఒక్కటే నేను చేసిన మిస్టేక్..

Supritha Naidu : బిగ్ బాస్ ఆఫర్ పై సుప్రిత షాకింగ్ కామెంట్స్.. ఆ ఒక్కటే నేను చేసిన మిస్టేక్..
Advertisement

Supritha Naidu : తెలుగు సినీ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలలో కీలక పాత్రలో నటించి జనాలను తన నటనతో మెప్పించింది. ఆమె కూతురు సుప్రీత ప్రస్తుతం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈమె శివ కంఠమనేని కొత్త సినిమా ‘అమరావతికి ఆహ్వానం’లో ఆమె నటిస్తున్నారు.. ఇందులో ఎస్తేర్, ధన్యా బాలకృష్ణ హీరోయిన్లు. ఇందులో సుప్రీతా నాయుడు కీలక పాత్ర చేశారు. హరీష్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి 13న థియేటర్లలోకి రాబోతుంది. ఈ సందర్భంగా సినిమాలోని కీలక పాత్రలో నటించిన నటీనటులు అందరూ కూడా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నటి సుప్రీత నాయుడు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.. అందులో ఆమె బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం అది హాట్ టాపిక్ గా మారింది.. సుప్రీత బిగ్ బాస్ గురించి ఏమందో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

బిగ్ బాస్ లోకి అందుకే వెళ్ళలేదు.. 

సురేఖ వాణి కూతురు సుప్రీత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకు ముందే ఆమె సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ పాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇటీవలే హీరోయిన్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. బిగ్ బాస్ అమర్దీప్ తో కలిసి ఓ సినిమా చేసింది. ప్రస్తుతం అమరావతికి ఆహ్వానం అనే సినిమాలో కీలక రోల్ లో నటిస్తుంది.. ఈ సినిమా మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ లిస్టు సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది.. తాజాగా ఈ అమ్మడు ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో భాగంగా తన గురించి ఎన్నో విషయాలను పంచుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్ లో ఆఫర్ వచ్చినప్పుడు తను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అని చెప్పింది. అయితే సినిమా వల్ల బిజీగా ఉండడంతో ఆ ఆఫర్ ని వదిలేసుకున్నట్లు ఆమె చెప్పింది. అంతేకాదు బిగ్ బాస్ లోకి వెళ్లడం అంటే నాకు చాలా ఇష్టం. ఈసారీ ఆఫర్ వస్తే తప్పకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నేను వెళ్తాను అని సుప్రీత చెప్పేసింది.. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Also Read :చక్రికీ పై మహా సీరియస్.. మాధవ్ కు నిజం చెప్పిన చక్రీ.. హాస్టల్ కు మహా వెళ్తుందా..?

అమరావతికి ఆహ్వానం మూవీ..

సుప్రీతా నాయుడు ప్రస్తుతం నటిస్తున్న సినిమా అమరావతికి ఆహ్వానం.. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 13న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. శివ కంఠంనేని, ధ‌న్య బాల‌కృష్ణ‌, ఎస్తేర్, సుప్రిత, హ‌రీష్, అశోక్ కుమార్‌, భ‌ద్ర‌మ్‌, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ ఇతర కీల‌క‌ పాత్ర‌లు పోషించారు.. డైరెక్ట‌ర్ జీవీకే ఈ మూవీని తెరకెక్కించారు.. నిర్మాత ముప్పా వెంక‌య్య చౌద‌రి గారి నిర్మాణ సార‌థ్యంలో జి. రాంబాబు యాద‌వ్ స‌మ‌ర్పణ‌లో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేన‌ర్‌పై కేఎస్ శంక‌ర్‌రావు, ఆర్ వెంక‌టేశ్వ‌ర రావు ఈ సినిమాను నిర్మించారు.. భారీ అంచనాలతో రాబోతుంది.. ఈ హిట్ అయితే మాత్రం సుప్రీత లైఫ్ పూర్తిగా మారిపోతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు..

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×