E-Paper
Advertisement

కేజిఎఫ్ 3 పై యష్ బిగ్ అప్డేట్ .. ఖచ్చితంగా ఉంటుంది కానీ?

కేజిఎఫ్ 3 పై యష్ బిగ్ అప్డేట్ .. ఖచ్చితంగా ఉంటుంది కానీ?
Advertisement

KGF 3 -Yash: రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న చిత్రం కేజిఎఫ్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి ఆదరణను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా కే జి ఎఫ్ 2 పాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్లను రాబట్టే సంచలనాలను సృష్టించింది. ఈ సినిమా క్లైమాక్స్ లో కేజిఎఫ్ 3 కూడా ఉండబోతుందని చిత్ర నిర్మాతలు తెలియజేశారు. ఇలా మూడో భాగం ఉంటుందని చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమాపై ఏమాత్రం అప్డేట్ లేకపోవడంతో బహుశా కే జి ఎఫ్ 3 ఉండదేమో అంటూ అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేశారు. అయితే తాజాగా నటుడు యశ్ కేజిఎఫ్ 3 గురించి బిగ్ అప్డేట్ తెలియజేశారు.

కేజిఎఫ్ 3 ఉంటుంది కానీ, ఆలస్యమవతుంది..

ఈ నేపథ్యంలోనే యష్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. కేజిఎఫ్3 కచ్చితంగా ఉంటుంది. ప్రశాంత్ నీల్, తాను ఈ విషయం గురించి ఇప్పటికే చర్చలు కూడా జరుపుకున్నామని అయితే ఈ సినిమా సరైన సమయంలోనే పట్టాలెక్కుతుందని తెలిపారు. ప్రస్తుతం తాను టాక్సిక్ సినిమాతో పాటు రామాయణ సినిమా పనులలో బిజీగా ఉన్నాను. ఈ సినిమాలు పూర్తి అయిన తర్వాతనే కే జి ఎఫ్ 3 ఉంటుందని యష్ ఈ సందర్భంగా క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేసినప్పటికీ ఈ సినిమాలు పూర్తి అయ్యేసరికి 2028 అవుతుందని అప్పుడు ఈ సినిమా మొదలుపెడితే 2030 వరకు ఎదురు చూడాల్సిందేమో అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ డ్రాగన్ పనులలో బిజీగా ప్రశాంత్ నీల్..

Advertisement

ఇక రామాయణ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ సినిమాలన్నీ షూటింగ్ పూర్తి అయిన తర్వాతనే యష్ కేజిఎఫ్ 3 పై ఫోకస్ చేయనున్నారు. మరోవైపు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరువాత ప్రభాస్ హీరోగా సలార్ 2 సినిమా కూడా చేయాల్సి ఉంటుంది. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాతనే కేజిఎఫ్ 3 పనులు మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

విడుదలకు సిద్ధమవుతున్న టాక్సిక్..

Advertisement

ఈ సినిమా 2027 జూన్ 11వ తేదీ విడుదల కాబోతుందని నేడు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్టు తెలియచేశారు. ఇక యశ్ విషయానికి వస్తే ఈయన నటించిన టాక్సిక్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతుంది. ఈ సినిమాని జూన్ 4వ తేదీ విడుదల చేయబోతున్నట్టు సమాచారం. మరోవైపు రామాయణ సినిమా పనులలో యష్ బిజీగా ఉన్నారు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం 2026 దీపావళి పండుగ సందర్భంగా రాబోతోంది. ఇక రెండో భాగం 2027 దీపావళిని పురస్కరించుకొని విడుదల కానున్నట్లు తెలిపారు.

Also Read: వందకోట్ల క్లబ్ లో చరణ్.. పెద్ది కోసం భారీ రెమ్యూనరేషన్ ..కెరీర్ లోనే హైయెస్ట్!

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×