E-Paper
Advertisement

‘చాలా క్యూట్‌ ఉన్నారు.. మీ వయసెంత’.. మహిళతో ర్యాపిడో డ్రైవర్ పిచ్చివేషాలు!

‘చాలా క్యూట్‌ ఉన్నారు.. మీ వయసెంత’.. మహిళతో ర్యాపిడో డ్రైవర్ పిచ్చివేషాలు!
Advertisement

Rapido Driver Harassment: ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి రైడ్-హెయిలింగ్ సంస్థలు మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రకటనల జారీ చేస్తుంటాయి. కానీ రియాలిటీలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటోంది. మహిళలతో ఆయా సంస్థల డ్రైవర్లు అనుచితంగా ప్రవర్తించిన ఘటనలు తరుచూ నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఓ యువతి పట్ల ఆటో డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ర్యాపిడో సంస్థ క్షమాణలు సైతం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది.

అసలేం జరిగిందంటే?

ఘజియాబాద్‌లో ఒక మహిళ తన ప్రయాణం కోసం రాపిడో బైక్ ను బుక్ చేసుకుంది. రైడ్ పూర్తయిన కొద్దిసేపటికే ఆమె వాట్సాప్‌కు ఒక అపరిచిత నంబర్ నుండి మెసేజ్ వచ్చింది. ‘గుర్తుపట్టలేదా? ఇప్పుడే నిన్ను డ్రాప్ చేశాను’ అంటూ అవతలి వ్యక్తి సందేశాలు పంపాడు. ఆమె ప్రశ్నించగా తాను రాపిడో రైడర్‌నని స్వయంగా ఒప్పుకున్నాడు. సంప్రదాయ దుస్తుల్లో చాలా క్యూట్ గా ఉన్నారని, వయసెంతో చెప్పాలని ప్రశ్నలు వేశాడు. ఒంటరిగా ఉంటున్నారా? అంటు వ్యక్తిగత ప్రశ్నలు వేసి.. మర్నాడు సాయంత్రం 4 గంటలకు కలుద్దామా? అని మహిళా ప్రయాణికురాలిని కోరారు.

బాధితురాలి ఆవేదన..

Advertisement

ర్యాపిడో డ్రైవర్ అనుచిత సందేశాలతో విసిగిపోయిన ఆమె.. వెంటనే ఆ నెంబర్ ను బ్లాక్ చేసింది. అతడితో జరిగిన చాట్ ను స్క్రీన్ షాట్ తీసి.. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ‘రాపిడో బుక్ చేసుకుంటే ఏమవుతుందిలే అని అనుకున్నాను.. కానీ ఇలా జరిగింది’ అంటూ వీడియో రూపంలో తన ఆవేదనను వ్యక్తం చేసింది. దీంతో బుకింగ్ రైడ్ సేవల్లో మహిళ భద్రతపై చర్చ మెుదలైంది. పెద్ద ఎత్తున నెటిజన్లు మహిళకు అండగా కామెంట్స్ చేస్తున్నారు. డ్రైవర్ తో పాటు అలాంటి వ్యక్తిని నియమించుకున్న ర్యాపిడో సంస్థపై కూడా నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల ఫోన్ నంబర్లు డ్రైవర్లకు అందుబాటులో ఉండటం వల్ల ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయని.. ప్రైవసీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: వాషింగ్ మిషన్‌లో.. అల్యూమినియం ఫాయిల్ బాల్స్.. ఆ తర్వాత జరిగే మ్యాజిక్కే వేరు!

క్షమాపణలు కోరిన ర్యాపిడో..

Advertisement

ర్యాపిడో డ్రైవర్ వ్యవహరం నెట్టింట తీవ్ర దుమారం రేపుతుండటంతో సదరు సంస్థ స్పందించింది. డ్రైవర్ ప్రవర్తనను అనైతికమని, ఏమాత్రం ఆమోదయోగ్యం కానిదని పేర్కొంది. అంతేకాకుండా ఆమెకు కలిగిన అసౌకర్యానికి కంపెనీ తరపున క్షమాపణలు సైతం చెప్పింది. సదరు రైడ్ కు సంబంధించిన ఐడీ, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ వివరాలను తమకు అందించాలని కోరింది. దీనిపై సమగ్ర విచారణ జరిపి డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

Also Read: AC Cooling Tips: సర్వీసింగ్ చేయించినా.. ఏసీ కూలింగ్ రావడం లేదా? వెంటనే ఇలా చేయండి!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×