E-Paper
Advertisement

Yash Mother Pushpa: హీరో యష్ తల్లికి బెదిరింపులు… లక్షల్లో మోసం చేసిన పీఆర్వో!

Yash Mother Pushpa: హీరో యష్ తల్లికి బెదిరింపులు… లక్షల్లో మోసం చేసిన పీఆర్వో!

Yash Mother Pushpa: కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతూ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్న నటుడు యశ్(Yash) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకు కన్నడ చిత్ర పరిశ్రమలోనే హీరోగా కొనసాగుతున్న ఈయనకు కేజీఎఫ్ సినిమా అద్భుతమైన విజయాన్ని అందించడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చింది. ఈ సినిమా అనంతరం యష్ వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.

హీరో తల్లికి బెదిరింపులు..

ఇక పాన్ ఇండియా హీరో అయిన తర్వాత ఈయన తల్లి పుష్ప(Pushpa) నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో పుష్ప ఎన్నో సందర్భాలలో వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఈమె మరోసారి తనని మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటూ పోలీసులను ఆశ్రయించి ఏకంగా ఐదుగురుపై కేసు నమోదు చేశారు. తన వీఆర్వో హరీష్ ఉర్స్ తో పాటు మరో నలుగురి పై బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పుష్ప నిర్మాతగా వ్యవహరించిన కొత్తల వాడి(Kotthalavaadi) అనే సినిమా ప్రమోషన్లలో భాగంగా తన వద్ద నుంచి 64 లక్షల రూపాయల మోసానికి పాల్పడినట్లు వెల్లడించారు.

రూ. 64 లక్షలు మోసం..

ఈ క్రమంలోనే సినిమా పబ్లిసిటీ కోసం తన నుంచి నిందితులు 64 లక్షల రూపాయలు డబ్బు తీసుకున్నారని, ఈ డబ్బు తీసుకున్న తర్వాత సినిమాకు ప్రమోషన్లను నిర్వహించడమే కాకుండా ఉదేశపూర్వకంగానే తన సినిమాపై కక్షతో నెగిటివ్ గా ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఇదే విషయం గురించి ఈమె మాట్లాడుతూ మొదట 23 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఈ సినిమా పబ్లిసిటీ కోసమే తన వీఆర్వో హరీష్ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే డబ్బులు తీసుకున్నారు. మొత్తం డబ్బు చెల్లించిన తర్వాత సినిమాలకు ప్రమోషన్లు చేయకపోతే డబ్బు వెనక్కి తిరిగి ఇవ్వమని చెప్పాము దీంతో మా సినిమాకు వ్యతిరేకంగా ప్రమోషన్లను చేస్తామని బెదిరించినట్లు తెలిపారు.

సినిమా పై నెగిటివ్ ప్రచారం..

ఇలా సినిమా ప్రమోషన్ల విషయంలో భారీ స్థాయిలో తనని మోసం చేశారని ఈమె మీడియా ముందు కూడా తన బాధను వ్యక్తం చేశారు తాను మాత్రమే కాకుండా హరీష్ చేతిలో మోసపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు కానీ ఎవరు కూడా భయంతో బయటకు రాలేదని తెలిపారు. ఇక నిందితులలో స్వర్ణలత, గురు అనే వ్యక్తులు తమకు మీడియాతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి డబ్బులు అడిగితే తన గురించి చెడుగా మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరించినట్లు కూడా ఈ సందర్భంగా పుష్ప తెలిపారు. ఇలా తనని మోసం చేయడమే కాకుండా బెదిరింపులకు కూడా పాల్పడటంతో ఈమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇక ఈమె నిర్మించిన కొత్తల వాడి సినిమా విషయానికి వస్తే..
ఈ సినిమా ఆగస్టు ఒకటో తేదీ థియేటర్లలో విడుదలైంది. అలాగే ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో ప్రసారమవుతుంది.

Also Read: Deepika Padukone: ఆ రెండు సినిమాల నుంచి అందుకే తప్పుకున్నా… అసలు మ్యాటర్ చెప్పిన దీపిక!

Related News

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

యూట్యూబర్ ‘నందూస్ వరల్డ్’ దంపతులపై చీటింగ్ కేసు.. యూకే ఉద్యోగాల పేరిట భారీ వసూళ్లు

అభిమానిపై ‘రాకింగ్ స్టార్’ రియల్ ప్రేమా.. క్యాన్సర్ బాధితుడికి వీడియో కాల్ చేసిన యష్!

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

Big Stories

×