E-Paper
Advertisement

Top 20 News Today: తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి కలకలం.. 140 కేజీలు సీజ్, హరీష్ రావు, కేటీఆర్ పై అడ్లూరి ఫైర్

Top 20 News Today: తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి కలకలం.. 140 కేజీలు సీజ్, హరీష్ రావు, కేటీఆర్ పై అడ్లూరి ఫైర్

1. భగ్గుమన్న కార్యకర్తలు

జూబ్లీహిల్స్ ఓటమిపై బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ ఎదుట భగ్గుమన్నారు. డివిజన్ ఇన్‌ఛార్జ్‌ల నిర్లక్ష్యం, నాయకుల తప్పుడు ప్రచారం ఓటమికి కారణమని కార్యకర్తలు మండిపడ్డారు. ఓటమికి కారణాలను విన్న కేటీఆర్‌, సద్దిచెప్పి పరిస్థితిని చక్కదిద్దారు.

2. కవిత అరెస్ట్

సింగరేణి భవన్‌ను ముట్టడించేందుకు యత్నించిన కల్వకుంట్ల కవితను అరెస్ట్‌ చేశారు పోలీసులు. జాగృతి కార్యకర్తలతో కలిసి సింగరేణి భవన్‌ ముందు బైఠాయించారు కవిత. పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, మెడికల్ బోర్డు వెంటనే ఏర్పాటు చేయాలని కోరుతూ నిరసనకు దిగారు.

3. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి

బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. జగిత్యాల జిల్లా స్తంభంపల్లిలో ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై ఎంపీ కృష్ణయ్య చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసే నాయకులు.. చిత్తశుద్ది ఉంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు అడ్లూరి.

4. ఐ బొమ్మ రవి.. కీలక అంశాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఐ బొమ్మ’ పైరసీ కేసులో రవి అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే రవిని విచారించడానికి ఐదు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఈ కేసుపై ఈడీ కూడా దృష్టి సారించింది, విచారణలో మరిన్ని కీలక అంశాలు బయటపడే అవకాశం ఉంది.

5. గర్భిణీ మిస్సింగ్

హైదరాబాద్ కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి నుంచి నిండు గర్భిణీ మిస్సయ్యింది. భర్తతో వాగ్వాదం జరగడంతో మనస్తాపం చెంది, డెలివరీకి 24 గంటల ముందు ఆసుపత్రి నుంచి ఆటోలో వెళ్లిపోయింది. భర్త ఫిర్యాదుతో సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

6. నేతలు అరెస్ట్

సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డు పునరుద్ధరణ కోరుతూ తెలంగాణ జాగృతి, హెచ్ఎంఎస్ సింగరేణి భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ సహా పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

7. హరీష్ రావు, కేటీఆర్ పై అడ్లూరి ఫైర్

పత్తి రైతులను పరమర్శిస్తున్న హరీష్ రావు, కేటీఆర్‌లు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పత్తి రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా స్తంభంపల్లిలో చేపల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బావ, బావ మరుదులు చెరో దిక్కు వెళ్లి పత్తి రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు అడ్లూరి.

8. తిరుపతి జిల్లాలో దారుణ హత్య.. నడిరోడ్డు పై పీక కోసి

తిరుపతి జిల్లా పుత్తూరు మండలం గొల్లపల్లి వద్ద పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య జరిగింది. మిట్ట పల్లూరు గ్రామానికి చెందిన రామ్మూర్తి రెడ్డి గొల్లపల్లి వద్ద ఓ డాబాలో రొట్టెలు తీసుకొని ఇంటికి వెళుతున్నాడు. ఈ క్రమంలో తమిళనాడుకు చెందిన నరసింహరాజు, పేటకు చెందిన రవితో కలిసి నడిరోడ్డుపై రామ్మూర్తిరెడ్డి పీక కోశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

9. మావోయిస్టుల పోస్టుమార్టానికి ఏర్పాట్లు

అల్లూరి జిల్లా రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాల పోస్టుమార్టానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇందుకోసం 6 టేబుళ్లు సిద్ధం చేయగా, ఛత్తీస్‌ఘడ్ నుంచి మావోయిస్టుల కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకున్నారు.

10. వైద్య పరీక్షలు

ఏలూరు జిల్లాలో పట్టుబడిన 15 మంది మావోయిస్టులను పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు. ప్రస్తుతం కట్టుదిట్టమైన భద్రత మధ్య మరికొద్ది సేపట్లో వారిని ఏలూరు జిల్లా కోర్టులో హాజరుపర్చనున్నారు.

11. ఎన్‌కౌంటర్‌పై ఎస్పీ ఆసక్తికర వ్యాఖ్యలు

అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఎస్పీ అమిత్ బర్దార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సంభవ్’లో 7 మృతదేహాలు లభ్యం కాగా, వాటిలో 20 లక్షల రివార్డు ఉన్న కీలక మావోయిస్టు జోగారావు ఉన్నాడు. మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందగా, 2 ఏకే 47లు లభ్యమయ్యాయని తెలిపారు.

12. లిక్కర్ స్కాం నిందితులకు షాక్

అమరావతి హైకోర్టులో లిక్కర్ స్కాం నిందితులకు షాక్ తగిలింది. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు మంజూరు చేసిన డిఫాల్ట్ బెయిల్‌ను హైకోర్టు రద్దు చేసింది. నిందితులు ఈ నెల 26లోపు ఏసీబీ కోర్టులో సరెండర్ కావాలని ఆదేశించింది, మెరిట్స్ ఆధారంగా బెయిల్ పిటిషన్‌పై విచారణ జరపాలని సూచించింది.

13. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వారికే టికెట్లు

ప్రజల కోసం పనిచేసేవారికే రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే అఖిలప్రియ. ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశం సమావేశంలో ఆమె పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఏ సమస్య ఉన్న వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే.

14. తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి కలకలం.. 140 కేజీల గంజాయి సీజ్

తూర్పుగోదావరి జిల్లా వీరవల్లి టోల్ ప్లాజా వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. టాటా ఏసీ వాహనంలో రవాణా చేస్తున్న 140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నల్లజర్ల పోలీసులు. పాడేరు ఏజెన్సీ నుంచి హైదరాబాద్‌కు వాహనంలో పుష్ప సినిమా రేంజ్‌లో పైన ఫ్రూట్స్ లోడ్ వేసుకొని గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు పోలీసులు.

15. పుత్తూరులో విద్యుత్ కాంట్రాక్టర్ హత్య

తిరుపతి జిల్లా పుత్తూరు మండలం గొల్లపల్లి జాతీయ రహదారి వద్ద విద్యుత్ కాంట్రాక్టర్ రామ్మూర్తిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. తీవ్ర గాయాల పాలైన రామ్మూర్తిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో ఒక నిందితుడిని పుత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

16. భారత్‌కు తరలింపు

ఎన్సీపీ నేత బాబా సిద్దిఖీ హత్య కేసులో నిందితుడు, గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ సోదరుడు అన్మోల్‌ బిష్ణోయ్‌ను అమెరికా నుంచి భారత్‌కు తరలించారు. ఇవాళ ఢిల్లీకి చేరుకున్న అతడితో పాటు మరో 199 మందిని డిపోర్ట్ చేశారు. సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు, సిద్ధూ మూసేవాలా హత్య కేసుల్లోనూ అతడు నిందితుడు. అన్మోల్‌పై NIA రూ.10 లక్షల రివార్డు కూడా ప్రకటించింది.

17. నిధులు విడుదల

కేంద్ర ప్రభుత్వం పీఎం-కిసాన్ 21వ విడత నిధులను కోయంబత్తూరులో విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పథకం కింద తొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో 18వేల కోట్లకు పైగా జమ కానున్నాయి. ఈ సందర్భంగా మోదీ సేంద్రియ సాగు, పంట వైవిధ్యీకరణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. తృణ ధాన్యాలను ‘సూపర్‌ ఫుడ్‌’గా పేర్కొంటూ.. ఈ పంటలను సాగు చేయాలని రైతులకు పిలుపునిచ్చారు ప్రధాని.

18. పదోసారి సీఎంగా నితీశ్

బిహార్‌లో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తదుపరి ముఖ్యమంత్రిగా నీతీశ్‌ కుమార్‌ ఖరారయ్యారు. ఈ మేరకు ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు.. తమ కూటమి నేతగా నీతీశ్‌ను ఎన్నుకున్నారు. మరోవైపు గురువారం పదోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీతీశ్‌ ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తోంది.

19. వివాదాల్లో వారణాసి

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం వారణాసి విడుదలకాకముందే వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. టైటిల్ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి చేసిన “నేను దేవుళ్లను నమ్మను” అన్న కామెంట్ హిందూ సంస్థల కోపానికి గురైంది. దీంతో రాష్ట్రీయ వానరసేన, మరికొన్ని హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

20. ఒక్క పాయింట్‌‌తో..

టీమిండియా బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక్క పాయింట్‌ తేడాతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో సెంచరీ చేసిన న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్ 782 పాయింట్లతో రెండు స్థానాలు ఎగబాకి నంబర్‌ వన్‌ ర్యాంక్‌కు చేరుకున్నాడు. హిట్‌మ్యాన్ 781 రెండో స్థానానికి పడిపోయాడు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×