మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటి. ప్రతిరోజూ రక్తాన్ని శుద్ధి చేసి, టాక్సిన్స్‌ను బయటకు పంపించే పని కిడ్నీలు చేస్తాయి. అయితే ప్రస్తుతం జీవన శైలిలో మార్పులు, తగినంత నీరు తాగకపోవడం, ఎక్కువ ఉప్పు వాడకం, ఆయిల్ ఫుడ్స్ అధికంగా తినడం, చక్కెర నిండిన ఆహారాలు తినడం, డయాబెటిస్, హైబీపీ వంటి సమస్యలు పెరగడం వంటి కారణాల వల్ల కిడ్నీలు చెడిపోతున్నాయి. కిడ్నీలు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన సూపర్ ఫుడ్స్ చేర్చడం చాలా ఉపయోగకరం
నీళ్లు
కిడ్నీలను కాపాడే అత్యంత ముఖ్యమైన పానీయం నీరు. నీరు తక్కువగా తాగితే రక్తం మందంగా మారుతుంది. విషపదార్థాలు, వ్యర్తాలు నిల్వ అవుతాయి. ఇవి మూత్రపిండాలపై ఒత్తిడిని కలుగుచేస్తాయి.రోజుకు 6 8 గ్లాసులు నీరు తాగితే కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం శరీరానికి ఇంకా మంచిది.
బెర్రీలు
బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, క్రాన్బెర్రీ వంటి బెర్రీలు యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ప్రత్యేకంగా క్రాన్బెర్రీ మూత్ర నాళ ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది. బెర్రీల్లో ఉండే ప్రత్యేకమైన పోషకాలు కిడ్నీలపై వాపు, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి సహజంగా రక్షణ కల్పిస్తాయి. రోజుకు ఒక చిన్న బౌల్ బెర్రీలు తింటే కిడ్నీలకు మంచి మద్దతు లభిస్తుంది.
ఆపిల్
ఆపిల్‌లో ఉన్న ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అదే సమయంలో టాక్సిన్స్ నిల్వ కాకుండా కిడ్నీలను రక్షిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారికి కూడా ఆపిల్ మంచిదే. రోజుకు ఒక ఆపిల్ తింటే కిడ్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
వెల్లుల్లి
వెల్లుల్లి శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. బీపీ ఎక్కువైతే కిడ్నీలు ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. అందుకే వెల్లుల్లి కిడ్నీలకు సహజ రక్షణ కవచం లాంటిది. రోజూ రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవడం ప్రయోజనకరం.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్‌లో మంచి కొవ్వులు (healthy fats) ఉంటాయి. ఇది శరీరంలో వాపు తగ్గించడమే కాకుండా కిడ్నీల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. ఇతర నూనెల కంటే ఆలివ్ ఆయిల్ కిడ్నీ ఆరోగ్యానికి మరింత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కాలీఫ్లవర్
కిడ్నీలు ఆరోగ్యానికి కాలీఫ్లవర్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్ తక్కువగా ఉండే కూరగాయ. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారికి సురక్షితం. దీనిలో ఉన్న విటమిన్ C, K కిడ్నీల పనితీరును మద్దతు ఇస్తాయి.
దోసకాయ
దోసకాయలో అధికంగా నీటి శాతం ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తూ కిడ్నీలలో టాక్సిన్స్ నిల్వ కాకుండా సహాయం చేస్తుంది. వేసవిలో ఎక్కువగా దోసకాయ తినడం మంచి అలవాటు.
రాగులు
రాగుల్లో పొటాషియం తక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు ఉన్నవారికి కూడా రాగులు మంచి ఆహారం. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారు రాగులను ఆహారంలో చేర్చితే కిడ్నీ పనితీరుకు మేలు జరుగుతుంది.
చేపలు
సాల్మన్, సార్డీన్స్ వంటి చేపల్లో ఒమేగా–3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. వి శరీరంలో వాపు తగ్గిస్తాయి, రక్తపోటును నియంత్రిస్తాయి. ఈ రెండు అంశాలు కిడ్నీ ఆరోగ్యానికి కీలకం. వారానికి రెండు సార్లు చేపలు తినడం ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.