Film industry:సాధారణంగా కొంతమంది జీవితం సజావుగా సాగుతున్న సమయంలో అనూహ్యంగా వారు తీసుకునే మలుపులు వారి జీవితాన్ని అగాథంలోకి నెట్టివేస్తాయని చెప్పవచ్చు.. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ కెరియర్లో తప్పటడుగులు వేసి చేజేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నారు.. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా అలాంటి తప్పు పనే చేసి పోలీసులకు చిక్కింది . ఏకంగా వ్యభిచార దందా నడుపుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇన్ని రోజులు తన అందంతో ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఇలా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడంతో అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఆమె ఎవరు? అసలేమైంది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ఈమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ అనుష్క మోనీ మోహన్ దాస్ (Anushka Moni mohan Das). 41 ఏళ్ల ఈ నటి ముంబైకి సమీపంగా ఉన్న మహారాష్ట్ర రాష్ట్రంలోని ఠాణే జిల్లాలో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారని ఆరోపణలు రావడంతో పోలీసులు సెప్టెంబర్ 5వ తేదీన ఆమెను అరెస్టు చేశారు. సినిమాలు, టీవీ సీరియల్స్ తో ఒక మోస్తారుగా గుర్తింపును సొంతం చేసుకుంది. ఇకపోతే పక్కా ప్లాన్ తోనే పోలీసులు ఈమెను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దీని నుండి ఈ వ్యభిచార రొంపులో చిక్కుకున్న మరో ఇద్దరు నటీమణులను కూడా పోలీసులు రక్షించారు. ప్రస్తుతం పోలీసులు ఈమెను రిమాండ్ కు తరలించి విచారణ చేపడుతున్నట్లు సమాచారం.. ఏది ఏమైనా సినిమాల ద్వారా కెరియర్ ను ఉన్నతంగా మార్చుకోవాల్సిన ఈ హీరోయిన్లు ఇలా తప్పుదోవ పట్టి జీవితాన్ని నాశనం చేసుకోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఇలాంటి కేసులో చాలామంది హీరోయిన్స్ పట్టుబడ్డ విషయం తెలిసిందే.
అలాంటి వారిలో శ్వేతా బసు ప్రసాద్ (Swetha Basu Prasad).. ‘కొత్త బంగారులోకం’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ చిన్నది.. చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరియర్ మొదలు పెట్టింది.. అప్పట్లో యువత మనసు దోచుకున్న ఈమె వ్యభిచారం చేస్తూ అడ్డంగా దొరికిపోయినట్లు అప్పుడు వార్తలు వినిపించాయి. అంతేకాదు ఈమెపై ఎన్నో కేసులు కూడా నమోదయ్యాయి..తర్వాత తన పద్ధతిని మార్చుకొని ఇప్పుడు చిత్రాలు చేస్తోంది. మధ్యలో పెళ్లి చేసుకుంది కానీ వెంటనే విడాకులు ఇచ్చేసింది.
ఈమెతో పాటు కిన్నెర (Kinnera) కూడా ఇలాంటి దందాలోనే ఇరుక్కుంది. తెలుగులో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) హీరోగా నటించిన ‘చెట్టు కింద ప్లీడరు’ , ‘ఆదిత్య 369’ వంటి చిత్రాలలో నటించిన ఈమె వ్యభిచారం చేస్తూ దొరికిపోయిందనే ఆరోపణలు ఎదుర్కొంది. అంతేకాదు అవకాశాల కోసం వచ్చిన మహిళలతో కిన్నెర ఇలా వ్యభిచారం చేయించిందని ఆరోపణలు కూడా ఉన్నాయి.
వినీత(Vineetha).. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన ‘ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలో నేపాలి అమ్మాయి పాత్రలో నటించిన వినీత కూడా అవకాశాలు తగ్గడంతో చెన్నైలో ఒక గదిలో ఇలా వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా అందరికీ పోయింది.
వీరే కాకుండా సుకన్య కూడా ఇలా ఈ కేసులో ఇరుక్కున్నట్లు సమాచారం. యమునా కూడా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారని వార్తలు రావడంతో.. ఈమెపై కేసు ఫైల్ అయింది. కానీ కోర్టులో విచారణ తర్వాత అసలు నిజం బయటకు రావడంతో ఆమె నిర్దోషిగా బయటకు వచ్చారు.
ALSO READ:Teacher’s day: టీచర్స్ డే స్పెషల్.. సినిమాల్లో టీచర్స్ గా మెప్పించిన హీరోయిన్స్ వీళ్ళే!