Chinnaswamy Stadium : ఐపీఎల్ 2025 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 18 సంవత్సరాలకు బెంగళూరు జట్టు తొలి ట్రోఫీ ని ముద్దాడింది. అయితే ట్రోఫీని గెలుచుకున్న సందర్భంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఘనంగా సంబురాలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే 18 సంవత్సరాలకు బెంగళూరు టైటిల్ సాధించడంతో ఆర్సీబీ అభిమానులు అంతా సంబురాలకు హాజరయ్యేందుకు లక్షలాది మంది చిన్నస్వామి స్టేడియం వద్దకు వచ్చారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగి 11 మంది మరణించారు. దీంతో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అయితే ఈ ఎఫెక్ట్ నేటి వరకు కూడా బెంగళూరు చిన్న స్వామి స్టేడియం పై ఇంకా పోలేదు. కర్ణాటక స్టేట్ క్రికెట్ లీగ్ లో ఇది కూడా ఒక వేదిక. సేప్టీ దృష్ట్యా ఇక్కడ ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్ లు నిర్వహించనున్నట్టు క్రిక్ ఇన్ఫో పేర్కొంది. సెమీ ఫైనల్, ఫైనల్ కూడా అభిమానులు లేకుండానే నిర్వహిస్తారని తెలిపింది.
Also Read : Saaniya Chandhok: వివాదంలో సచిన్ ఫ్యామిలీ…పెళ్లి కాక ముందే ఆ పని చేసిన అర్జున్ కు కాబోయే భార్య
జూన్ 04న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్టరీ పరేడ్ గ్రౌండ్ లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో 50 మంది వరకు గాయపడ్డట్టు సమాచారం. దీంతో భద్రతా కారణాల వల్ల గత మూడు నెలల నుంచి చిన్నస్వామి స్టేడియంలో ఒక్క మ్యాచ్ కూడా జరుగలేదు. అయితే చిన్నస్వామి స్టేడియంలో డొమెస్టిక్ లీగ్ మహారాజా టోర్నీ, ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ లో పలు మ్యాచ్ లు జరగాల్సి ఉంది. కానీ ఆయా ఆయా కారణాల వల్ల మహారాజా టోర్నీని మైసూర్ కి మార్చగా.. మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లను నవీ ముంబైకి మార్చారు. ఇప్పుడు మళ్లీ అదే స్టేడియంలో మ్యాచ్ లు పునః ప్రారంభం కానున్నాయి. తొక్కిసలాట ఘటన తరువాత మొదటిసారి క్రికెట్ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. దీంతో బెంగళూరు క్రికెట్ అభిమానులు కాస్త సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే మ్యాచ్ లు చూసేందుకు మాత్రం స్టేడియంలోకి ప్రేక్షకులకు అనుమతి లేదు. ఈ విషయం తెలిసి కొందరూ అంత కొసానికి మ్యాచ్ లను ఎందుకు జరుపుతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
మైసూర్ కి చెందిన టీమిండియా మాజీ క్రికెటర్ తిమ్మప్పయ్య జ్ఞాపకార్థం కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రతీ సంవత్సరం నిర్వహిస్తుంటుంది. ఈ తరుణంలో ఇవాళ మ్యాచ్ ప్రారంభం అయింది. ఈ మ్యాచ్ లు నాలుగు రోజుల టెస్ట్ ఫార్మాట్ లో జరుగుతాయి. మొత్తం ఇందులో 16 మ్యాచ్ లు జరుగనున్నాయి. వీటిలో 6 మ్యాచ్ లు చిన్న స్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. లీగ్ మ్యాచ్ లు, సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ కూడా చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగనున్నాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ మ్యాచ్ లకు ప్రేక్షకులను స్టేడియం లోపలికి అనుమతించడం లేదని కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ముంబై, విదర్భ, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, గోవా, గుజరాత్ వంటి రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ నుంచి క్రికెట్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి.