Teacher’s day: భూమి మీద పడ్డ ప్రతి జీవికి తల్లి మొదటి గురువు అయితే.. నడక నేర్పే నాన్న రెండవ గురువు.. ఆ తర్వాత విద్యాబోధనలు నేర్పే ఉపాధ్యాయులు.. ముఖ్యంగా మనిషి జీవన మనుగడకు మార్గం చూపిస్తూ.. తెలివితేటలను పెంచుతూ.. వారికంటూ ఒక సరైన జీవితాన్ని ప్రసాదించడంలో గురువు మొదటి పాత్ర పోషిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం కావడంతో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తమ అధ్యాపకులను గుర్తు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇకపోతే సినిమాలలో కూడా ఇలా టీచర్స్ గెటప్ వేసి.. ప్రేక్షకులను అలరించిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. మరి అలా టీచర్ పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించిన హీరోయిన్స్ ఎవరు? ఏ సినిమాల్లో చేశారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..
నేటి తరం యువతకు పెద్దగా పరిచయం లేకపోయినా.. నాటితరం యువతకు ఈమె ఒక డ్రీమ్ గర్ల్ అని చెప్పాలి.. సాంప్రదాయమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించి..ఎన్టీఆర్(NTR ), ఏఎన్నార్ (ANR) వంటి హీరోలతో సమానంగా ప్రేక్షకులను సంపాదించుకున్నారు సావిత్రి. నేడు మన మధ్య లేకపోయినా ఆమె పోషించిన ఎన్నో పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.. సావిత్రి(Savitri)కి మంచి పేరు తెచ్చిన పాత్రలలో టీచర్ పాత్ర కూడా ఒకటి. ఈమె మిస్సమ్మ సినిమాలో టీచర్గా అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారు.
ఆసిన్:
నేటి కాలంలో టీచర్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్స్ లో ప్రధమంగా వినిపించే పేరు ఆసిన్(Asin). ఈమె వెంకటేష్ (Venkatesh ) హీరోగా వచ్చిన ‘ఘర్షణ’ సినిమాలో మాథ్స్ టీచర్ గా కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇప్పటికీ టీచర్ పాత్ర అంటే వెంటనే ఆసిన్ మనకు గుర్తొస్తుంది. అంతలా ఆ పాత్రలో లీనం అయిపోయింది ఈ ముద్దుగుమ్మ.
కమలిని ముఖర్జీ:
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘హ్యాపీ డేస్’ ఇందులో కమలిని ముఖర్జీ బీటెక్ స్టూడెంట్స్ కి టీచర్ గా నటించి అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈమెను ప్రేమించే స్టూడెంట్ పాత్రలో నిఖిల్ చాలా అద్భుతంగా ఒదిగిపోయారు.
కలర్స్ స్వాతి..
అక్కినేని హీరో సుమంత్ హీరోగా వచ్చిన ‘గోల్కొండ హై స్కూల్’ చిత్రంలో స్వాతి స్టూడెంట్స్ ఫేవరెట్ టీచర్గా నటించి మెప్పించారు. ముఖ్యంగా ఈ సినిమా ఈమెకు మరింత ఇమేజ్ తెచ్చిపెట్టింది.
సాయి పల్లవి – శృతిహాసన్:
మలయాళం లో వచ్చిన ‘ప్రేమమ్’ సినిమాలో సాయి పల్లవి టీచరుగా నటించి మెప్పించగా.. అదే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసినప్పుడు ఆ పాత్రలో శృతిహాసన్ నటించిన ఆకట్టుకున్నారు.
ఇక వీరితో పాటు మరికొంతమంది హీరోయిన్స్ కూడా ఇలాంటి టీచర్ పాత్ర పోషించి ప్రేక్షకులను అలరించారు. హీరోయిన్లే కాదు హీరోలు కూడా టీచర్ పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా ఇలాంటి పాత్రలు ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి అనడంలో సందేహం లేదు.
ALSO READ:Bigg Boss 9: అగ్నిపరీక్ష నుండి 5గురు కాదు 6గురు.. లిస్ట్ వైరల్!