E-Paper
Advertisement

Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకా వర్కౌట్ అవుతుందా, గతంలో ఆ కాన్సెప్ట్ ఫెయిల్

Andhra King Taluka : ఆంధ్ర కింగ్ తాలూకా వర్కౌట్ అవుతుందా, గతంలో ఆ కాన్సెప్ట్ ఫెయిల్
Advertisement

Andhra King Taluka : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాలేవి కూడా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. మళ్లీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసిన డబ్బులు ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా ఊహించిన సక్సెస్ ఇవ్వలేకపోయింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన స్కంద కూడా అంతంత మాత్రమే ఆడింది.

ప్రస్తుతం మహేష్ బాబు దర్శకత్వంలో ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా చేస్తున్నాడు రామ్. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. దీనికి పలు రకాల కారణాలు ఉన్నాయి. ఈ సినిమా దర్శకుడు మహేష్ బాబు గతంలో చేసిన మిస్శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాకి సంబంధించి వీడియో కంటెంట్ కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఆ కాన్సెప్ట్ ఫెయిల్ 

Advertisement

రారా కృష్ణయ్య సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. ఆ సినిమా డీసెంట్ సక్సెస్ సాధించింది కానీ ఊహించిన స్థాయిలో పేరు రాలేదా. మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా విపరీతమైన సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమా కాన్సెప్ట్ అభిమానికి మరియు హీరోకి మధ్య జరుగుతుంది. గతంలో ఈ జోనర్ లో వచ్చిన సినిమాలేవి ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఫ్యాన్, ఒక విచిత్రం, నేనింతే, శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఈ సినిమాలన్నీ కూడా హీరోకి మరియు అభిమానికి మధ్య ఉన్న బాండింగ్ గురించి ఉంటాయి.మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది.

ఆల్బం సూపర్ హిట్ 

Advertisement

ఈ సినిమా నుంచి ఇప్పటివరకు మొత్తం నాలుగు పాటలు విడుదలయ్యాయి. నాలుగు పాటలు కూడా మంచి సక్సెస్ సాధించాయి. చాలామందికి సినిమా మీద కూడా ఇదే రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నవంబర్ 27వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

రామ్ ఈ సినిమాతో కం బ్యాక్ ఇస్తాడు అని చాలామంది నమ్ముతున్నారు. రామ్ సరసన భాగ్యశ్రీ ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా తనలో ఉన్న కొత్త కొత్త టాలెంట్స్ బయటకు తీశాడు రామ్. పాటను రాయడం, అదే విధంగా పాటలు పాడటం కూడా ఈ సినిమా కోసం చేశాడు.

Also Read: Puri Jagannadh: పని పాట లేని వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయి, పూరి వీడియో వైరల్

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×