E-Paper
Advertisement

Nagachaitanya -Sobhita: నాగచైతన్య శోభిత మధ్య గొడవలు..వార్ వన్ సైడ్ అంటూ!

Nagachaitanya -Sobhita: నాగచైతన్య శోభిత మధ్య గొడవలు..వార్ వన్ సైడ్ అంటూ!
Advertisement

Nagachaitanya -Sobhita: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా కొనసాగుతున్న నాగచైతన్య(Nagachaitanya) ప్రస్తుతం కెరియర్ పరంగా వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన ప్రస్తుతం విరూపాక్ష దర్శకుడు కార్తీక్ వర్మ దండు(Karthik Varma Dandu) దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం NC 24 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

నాగచైతన్య శోభిత గొడవ…

ఇదిలా ఉండగా నాగచైతన్య తాజాగా ప్రియదర్శి (Priyadarshi)ఆనంది హీరో హీరోయిన్లుగా నటించిన ప్రేమంటే(Premante) సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సినిమా నవంబర్ 21వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ నిర్వహించారు. ఈ సినిమాలో సుమ కనకాల కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుమ నాగచైతన్యను ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. ప్రేమంటే సినిమాలో ఆనంది ప్రియదర్శి మధ్య ఎప్పుడు గొడవలు ఉంటాయి ఈ గొడవలు ఒక కప్పు టీతో సెటిల్ చేసుకుంటూ ఉంటారు అలాగే మీకు శోభితకు(Sobhita) మధ్య గొడవలు జరిగితే ఎలా సెటిల్ చేసుకుంటారు అంటూ ప్రశ్న వేశారు.

వార్ వన్ సైడ్..

Advertisement

సుమ ఈ విధంగా ప్రశ్నించడంతో నాగచైతన్య సమాధానం చెబుతూ.. మా ఇంట్లో వార్ వన్ సైడ్ అంటూ సమాధానం చెప్పడంతో వెంటనే మాకు అర్థమైంది లేండనీ సుమ మాట్లాడారు. ఇక ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఏ విషయంలోనైనా శోభిత నాగచైతన్యను డామినేట్ చేస్తారని స్పష్టంగా అర్థమవుతుంది. ఇక నాగచైతన్య శోభితను రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. సమంత విడాకులు ఇచ్చిన తరువాత గత ఏడాది శోభితతో నాగచైతన్య ఏడడుగులు నడిచారు.

శోభితపై చైతూ ప్రశంసలు..

Advertisement

ఇలా రెండవ వివాహం చేసుకున్న నాగచైతన్య తన వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్నారు. శోభిత తన జీవితంలోకి రావడం సంతోషంగా ఉందని ప్రతి విషయంలోనూ చాలా కచ్చితంగా ఉంటుందని, ముఖ్యంగా నాకు సంబంధించిన అన్ని విషయాలలో శోభిత సలహాలు తీసుకుంటానని తెలిపారు. ఇలా ఎప్పటికప్పుడు తన భార్య శోభిత గురించి నాగచైతన్య మాట్లాడుతూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. ఇక నాగచైతన్య చివరిగా తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నాగచైతనే తదుపరి కార్తీక్ దండు దర్శకత్వంలో బిజీగా ఉన్నారు. ఇక శోభిత నాగచైతన్యను పెళ్లి చేసుకున్నప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ ఈమె కూడా కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

Also Read: Aishwarya Rai: సత్య సాయి బాబా శతజయంతి వేడుకలు.. సందడి చేసిన ఐశ్వర్యరాయ్

Related News

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

పవన్‌ కల్యాణ్‌ ఆస్తుల లెక్క ఇదిగో.. కళ్లు తిరిగే నంబర్లు!

Big Stories

Advertisement
×