E-Paper
Advertisement

Hey Bhagavan: ‘హే భగవాన్’ కంటే ముందు పది కథలు.. ఏదీ నచ్చలేదంటోన్న నిర్మాత!

Hey Bhagavan: ‘హే భగవాన్’ కంటే ముందు పది కథలు.. ఏదీ నచ్చలేదంటోన్న నిర్మాత!
Advertisement

Hey Bhagavan: ‘హే భగవాన్’ కంటే ముందు పది కథలు విన్నాను. కానీ ఏది నచ్చలేదని అన్నారు నిర్మాత బి. నరేంద్ర రెడ్డి. సుహాస్ (Suhas), శివానీ నగరం (Shivani Nagaram), సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్లో నటించిన చిత్రం ‘హే భగవాన్’ (Hey Bhagavan). గోపీ అచ్చర (Gopi Achara) దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి. నరేంద్ర రెడ్డి (B Narendra Reddy) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఫిబ్రవరి 20న నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాస్‌.. ఈ ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు గ్రాండ్‌గా తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలో చిత్ర నిర్మాత బి. నరేంద్ర రెడ్డి మీడియాకు ఈ సినిమాకు సంబంధించిన విషయాలను తెలిపారు.

Also Read- Nagavamsi: నేనేమైనా సాగర సంగమం తీసానా? ఫంకీ సినిమా పై నాగ వంశీ కామెంట్స్!

ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్

Advertisement

కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన నేను, ప్రస్తుతం బెంగుళూరులో కన్‌స్ట్రక్షన్‌ రంగంలో ఉన్నాను. చిన్నప్పటి నుండి సినిమాలంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే కన్నడలో నిర్మాతగా ప్రవేశించాను. తెలుగులో నిర్మాతగా నా తొలి సినిమా ‘హే భగవాన్‌’. కన్నడ సినీ పరిశ్రమలో సినిమాలకు ఫైనాన్స్‌ ఇచ్చేవాడిని. అలా నాకు కూడా సినిమాలపై ప్యాషన్ ఏర్పడింది. ఆ ప్యాషన్‌తో నిర్మాతగా మారాను. మా సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత రమణా రెడ్డి ఈ కథ గురించి చెప్పారు. ‘హే భగవాన్‌’ కంటే ముందు దాదాపు పది కథల వరకు విన్నాను. కానీ ఏదీ నాకు నచ్చలేదు. ఈ కథ వినగానే ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషనల్‌గా ఉండే కథ కావడంతో.. ఈ సినిమాతోనే నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్నాను.

Also Read- Shiva Ram Konidela: శివ రామ్ కొణిదెల.. ఉపాసనకు ఇష్టమైన బాలీవుడ్ హీరో పేరా!

ఊహకు అందని విధంగా స్క్రీన్‌ప్లే

Advertisement

స్టోరీ నచ్చి ఈ సినిమా ప్రొడ్యూస్ చేశాను. మొదట అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా మొత్తం పూర్తయింది. ప్రతీది ప్లానింగ్‌ ప్రకారమే జరిగింది. సినిమాకు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుంది. అంత క్వాలిటీగా అవుట్‌పుట్‌ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో ఫాదర్‌ అండ్ సన్‌ ఎమోషన్‌ అందరి హృదయాలను తాకుతుంది. సినిమా కథ విన్నప్పుడు నేను ఏదైతే ఫీల్‌ అయ్యానో.. రేపు సినిమా విడుదల తర్వాత ఆడియన్స్‌ కూడా అదే థ్రిల్ ఫీలవుతారు. ప్రతి సన్నివేశం ఎంతో ఎంటర్‌టైనింగ్‌గా, ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో హీరో సుహాస్‌, నటుడు నరేష్‌, కమెడియన్ సుదర్శన్‌, వెన్నెల కిషోర్‌ ఇలా ప్రతి పాత్ర ఆడియన్స్‌ను బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. మరీ ముఖ్యంగా ఎవరి ఊహకు అందని విధంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే ఉంటుంది. బన్నీ వాస్‌, వంశీ అసోసియేషన్‌తో ఈ సినిమా విజయంపై మరింత నమ్మకం పెరిగింది. మా బ్యానర్‌లో తదుపరి ఫ్రెండ్‌షిప్‌ నేపథ్యంలో ఓ సినిమా ఉంటుంది. సత్యదేవ్‌ హీరో. లక్ష్మీనారాయణ దర్శకుడు. అవుట్‌ అవుట్‌ అండ్‌ కమర్షియల్ మూవీ ఇది. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌ నటిస్తారు’’ అని నిర్మాత బి. నరేంద్ర రెడ్డి చెప్పుకొచ్చారు.

Also Read- Naga Chaitanya: నాగార్జున రొమాంటిక్ సినిమాలలో నాగచైతన్య.. నిన్నే పెళ్ళాడుతా నుంచి మన్మధుడు వరకు..!

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×