E-Paper
Advertisement

Naga Chaitanya: నాగార్జున రొమాంటిక్ సినిమాలలో నాగచైతన్య.. నిన్నే పెళ్ళాడుతా నుంచి మన్మధుడు వరకు..!

Naga Chaitanya: నాగార్జున రొమాంటిక్ సినిమాలలో నాగచైతన్య.. నిన్నే పెళ్ళాడుతా నుంచి మన్మధుడు వరకు..!
Advertisement

Naga Chaitanya: నాగార్జున అక్కినేని అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో రొమాంటిక్ కింగ్ అని చెప్పాలి. ప్రేమకథల్లో ఆయన చూపించిన స్టైల్.. హావభావాలు ప్రేక్షకులను ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. అదే సమయంలో మాస్ సినిమాల్లో కూడా తనదైన మార్క్ వేసుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో నాగార్జున ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇక ఆయన వారసుడిగా వచ్చిన నాగచైతన్య కూడా తండ్రి బాటలోనే నడుస్తూ ప్రేమకథలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఏ మాయ చేసావే వంటి సినిమాలతో యువతకు బాగా దగ్గరయ్యారు.

వాలంటైన్స్ డే సమీపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ వైరల్ అవుతోంది. అదేంటంటే… నాగార్జున చేసిన సూపర్ హిట్ సినిమాల్లో నాగచైతన్య హీరోగా నటిస్తే ఎలా ఉంటుందన్న ఊహతో అభిమానులు తయారు చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్లు. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

నిన్నే పెళ్ళాడుతాలో నాగచైతన్య..!

అందులో ముందుగా ఎక్కువగా వైరల్ అవుతున్న సినిమా నిన్నే పెళ్లాడుతా. నాగార్జున కెరియర్‌లోనే ఇది ఒక ఆల్‌టైమ్ హిట్. ఈ సినిమాలో నాగచైతన్య హీరోగా ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తూ పోస్టర్ రూపొందించారు. ఇందులో హీరోయిన్‌గా తమన్నాను ఊహించారు. ఈ కాంబినేషన్ చాలా బాగుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

అలాగే నాగార్జున కెరియర్‌లో మైలురాయిగా నిలిచిన గీతాంజలి సినిమా పోస్టర్ కూడా నాగచైతన్యతో వైరల్ అవుతోంది. ఇందులో హీరోయిన్‌గా సాయి పల్లవిను పెట్టారు. ఈ పోస్టర్ చూసిన వారు “ఈ సినిమా నిజంగా మళ్లీ వస్తే బాగుంటుంది” అని కామెంట్స్ చేస్తున్నారు.

శివ సినిమాలో కూడా..!

ఇక మాస్ సినిమాల విషయానికి వస్తే, నాగార్జునకు స్టార్ ఇమేజ్ తెచ్చిన శివ సినిమా పోస్టర్ కూడా నాగచైతన్యతో రూపొందించారు. ఇది యువతలో మంచి ఆసక్తిని కలిగిస్తోంది.

అదే విధంగా మన్మథుడు సినిమాను కూడా నాగచైతన్యతో ఊహించారు. ఇందులో అప్పట్లో హీరోయిన్‌గా నటించిన సోనాలి బింద్రే స్థానంలో ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ను చూపిస్తూ పోస్టర్లు వైరల్ చేస్తున్నారు.

మొత్తం పైన.. ఈ ఫ్యాన్ మేడ్ పోస్టర్లు వాలంటైన్స్ డే ముందు అభిమానుల్లో మంచి హడావుడి తీసుకొస్తున్నాయి. నిజంగా ఇలాంటి సినిమాలు వస్తే ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

ALSO READ: Jeevitha Rajasekhar: బ్రేకప్ అంచుల వరకు వెళ్లిన జీవిత-రాజశేఖర్ బంధం.. చివరకు పెళ్లి వరకు ఎలా చేరిందంటే..?

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×