E-Paper
Advertisement

S.S.Rajamouli: వారణాసి బ్యాన్ సరికాదు… జక్కన్నకు సపొర్ట్‌గా హిందూ సంఘం

S.S.Rajamouli: వారణాసి బ్యాన్ సరికాదు… జక్కన్నకు సపొర్ట్‌గా హిందూ సంఘం
Advertisement

S.S.Rajamouli: టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి(S.S.Rajamouli) ఇటీవల మహేష్ బాబు వారణాసి(Varanasi) సినిమా వేడుకలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా టైటిల్ గ్లింప్స్ ప్రసారంలో సాంకేతిక లోపాలు తలెత్తిన నేపథ్యంలో తనకు హనుమంతుడి(Hanuman) పై నమ్మకం లేదంటూ మాట్లాడటంతో ఈ వ్యాఖ్యల పట్ల హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకత చూపుతూ రాజమౌళి సినిమాలను బ్యాన్ చేస్తామంటూ ఆందోళన చేపట్టారు. ఇలాంటి తరుణంలోనే హిందూ జనశక్తి సంఘం అధ్యక్షుడు లలిత్ కుమార్(Lalith Kumar) ఈ వివాదం పై స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

సాంకేతిక లోపానికి హనుమంతుడు కారణమా?

ఈ సందర్భంగా లలిత్ కుమార్ బిగ్ టీవీతో మాట్లాడుతూ.. రాజమౌళి వారణాసి సినిమా వేడుకలో భాగంగా తలెత్తిన సాంకేతిక లోపం గురించి మాట్లాడుతూ హనుమాన్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు. ఆ సాంకేతిక సమస్యను హనుమంతుడు సృష్టించలేదు కదా అంటూ మాట్లాడారు. ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు క్షణికావేశంలో పరిస్థితులకు అనుగుణంగా దేవుళ్ళ గురించి ఇలా మాట్లాడటం సరి కాదని ఈ దోరని ప్రతి ఒక్కరూ మార్చుకోవాలని తెలిపారు. ఇలా రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలపై చాలామంది ఆయన సినిమాలను బ్యాన్ చేస్తాం అని మాట్లాడుతున్నారు ఇలా బ్యాన్ చేయడం కూడా సరైన విషయం కాదని తెలిపారు.

దేవుడిని కించపరుస్తూ సినిమాలు చేయ్యలేదే?

Advertisement

రాజమౌళి నాస్తికుడు అనే సంగతి ఇప్పుడు చెప్పింది కాదు గత పది సంవత్సరాల క్రితమే ఆయన దేవుడి గురించి తన అభిప్రాయాన్ని తెలిపారు. మన హిందూ సనాతన ధర్మంలో నాస్తికత్వం కూడా ఒక భాగమేనని లలిత్ కుమార్ వెల్లడించారు. ఇక రాజమౌళికి సినిమాలు అంటే నమ్మకం లేదని చెప్పారు కానీ, ఆయన తన సినిమాలలో దేవుడికి సంబంధించిన అంశాలను ఎక్కడ తప్పుగా చిత్రీకరించలేదు. నాకు దేవుడిపై మాకు నమ్మకం ఉంది అంటూనే హిందూ ధర్మాన్ని కించపరుస్తూ ఎంతోమంది వందల సినిమాలు చేశారు కానీ రాజమౌళి ఎప్పుడు సనాతన ధర్మాన్ని, హిందూ దేవుళ్లను కించపరచలేదని తెలిపారు.

Advertisement

ఒక రాజమౌళి మాత్రమే నాస్తికుడు కానీ ఈ సినిమా కోసం పనిచేస్తున్న వారందరూ కూడా దేవుడిపై నమ్మకం ఉన్నవారేనని లలిత్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ హనుమంతుడి భక్తుడు. దేవుడే నా చేత ఈ సినిమా కథ రాయించారని ఇదే కార్యక్రమంలోనే తెలిపారు. ఇక రాజమౌళి భార్య రమ గారు కూడా ఆంజనేయ స్వామి భక్తురాలని తనతో మాట్లాడుతుందని రాజమౌళి తెలిపారు. ఇలా ఇంతమంది దేవుడిపై నమ్మకం ఉన్నవారు సినిమా కోసం పనిచేశారు. ఇక రాజమౌళి అప్పుడు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దేవుడి గురించి అలా మాట్లాడారే తప్ప, హిందూ దేవుళ్లను కించపరచటం తన ఉద్దేశం కాదంటూ లలిత్ కుమార్ ఈ సందర్భంగా వివరణ ఇవ్వడంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఒకవేళ రాజమౌళి కూడా తన సినిమాలలో హిందూ ధర్మాన్ని హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా చూపించి ఉంటే కచ్చితంగా ఈ చర్యలను మనం అడ్డుకోవాల్సిందే కానీ అలా చేయలేదని లలిత్ కుమార్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఎంతోమంది మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Aswini Dutt: అశ్వినీదత్ కుమార్తె ప్రీ వెడ్డింగ్.. సందడి చేసిన ప్రభాస్, తారక్.. ఫోటోలు వైరల్!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×