E-Paper
Advertisement

Aswini Dutt Daughter: అశ్వినీదత్ కుమార్తె ప్రీ వెడ్డింగ్.. సందడి చేసిన ప్రభాస్, తారక్.. ఫోటోలు వైరల్!

Aswini Dutt Daughter: అశ్వినీదత్ కుమార్తె ప్రీ వెడ్డింగ్.. సందడి చేసిన ప్రభాస్, తారక్.. ఫోటోలు వైరల్!
Advertisement

Aswini Dutt Daughter: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ (Aswini Dutt)ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తన బ్యానర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన అశ్విని దత్ ప్రస్తుతం తన నిర్మాణ సంస్థ బాధ్యతలను తన కుమార్తెలకు అప్పగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రియాంక, స్వప్న దత్ ఈ వైజయంతి బ్యానర్ వ్యవహారాలను చూసుకుంటున్నారు.. అశ్విని దత్ ఇంట పెళ్లి బాజలు మోగబోతున్నాయి. అశ్వినీ దత్ మూడో కుమార్తె స్రవంతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

అశ్వినీ దత్ ఇంట మోగనున్న పెళ్లి భాజలు..

ఇలా నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పటికీ ఈయనకు కాబోయే అల్లుడు ఎవరు ఏంటి అనే విషయాలను మాత్రం ఎక్కడా వెల్లడించలేదు. ఇకపోతే త్వరలోనే స్రవంతి వివాహం జరగబోతుందని తెలుస్తోంది. ఇలా తన చెల్లెలు పెళ్లి జరగబోతున్న నేపథ్యంలో తన అక్కలు ఇద్దరు ఎంతో ఘనంగా పార్టీ అరేంజ్ చేశారు ఈ వేడుకలో భాగంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరై సందడి చేసినట్టు తెలుస్తుంది. తాజాగా ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హాజరైన ప్రభాస్ తారక్..

Advertisement

ఈ కార్యక్రమంలో భాగంగా నటి కీర్తి సురేష్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలు ప్రభాస్(Prabhas) ఎన్టీఆర్ (Ntr)వంటి తదితరులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి కూడా ఈ ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు. ఇక పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ వేడుకలో భాగంగా ప్రభాస్ లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇటీవల కాలంలో ఎక్కడికి వెళ్లినా ప్రభాస్ తలకు క్యాప్ పెట్టుకొని కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఈయన స్టైలిష్ లుక్ లో కనిపించడంతో అభిమానులు ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు.

అశ్విని దత్ మూడవ అల్లుడు బ్యాక్ గ్రౌండ్?

Advertisement

ఇలా స్రవంతి దత్ ప్రీ వెడ్డింగ్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కానీ ఈమె పెళ్లి ఎక్కడ? ఏంటి ?ఎప్పుడు అనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. ఇక పెళ్లి వేడుకలలో భాగంగా టాలీవుడ్ సినీ ప్రముఖులు మొత్తం హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. ఇక అశ్విని దత్ రెండో కుమార్తె ప్రియాంక ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈయన కూడా నిర్మాతగా దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. మరి మూడవ అల్లుడు ఏం చేస్తారు ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలు తెలియాల్సి ఉంది.

Also Read: Ibomma Ravi:రవి వాళ్ల అమ్మ పెద్ద క్రిమినల్… అందుకే వీడు ఇలా… అసలు నిజం బయట పెట్టిన తండ్రి

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×