Hollywood : ఈమధ్య సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాద వార్తలు వింటూనే ఉన్నాము.. నటీనటుల మరణ వార్తలు, ఆత్మ హత్యలు, హత్యలు కామన్ అయ్యాయి. తాజాగా హాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ హాలివుడ్ డైరెక్టర్ రాబ్ రైనర్ ను గుర్తు తెలియని దుండగులు హత్య చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆయన నివాసంలో డైరెక్టర్ ఆయన సతీమణి అనుమానాస్పదంగా మృతి చెందిన్నట్లు పోలీసులు గుర్తించారు. డైరెక్టర్ మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణంతో ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించిన ఈయన ఇలా చనిపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు డైరెక్టర్ హత్య వెనకాల గల కారణాలు ఏంటి? అన్న కోణంలో విచారణ జరుపుకున్నారు. ప్రస్తుతం అనుమానం ఉన్న వ్యక్తులను విచారిస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ జంట హత్య గురించి పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి..
డైరెక్టర్ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు..
హాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా విషాద ఘటనలు వెలుగు చూస్తున్నాయి.. ఇండస్ట్రీలో ఇప్పటికే ప్రముఖ నటీనటులు మరణించారు. తాజాగా ఓ సంచలనాత్మక ఘటన చోటుచేసుకుంది. హాలీవుడ్ లో ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించిన రాబ్ రైనర్ హత్యకు గురయ్యారు. ఆయన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో డైరెక్టర్ అయిన భార్య మరణించి ఉన్నారు.. ఈ ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య వెనకాల ఏదైనా కుట్ర ఉందా? ఉగ్రవాదులు ఏమైనా దాడి చేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ కేసులో అనుకోని ట్విస్టులు కూడా ఎదురవుతున్నట్లు తెలుస్తుంది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఈయన కూడా ఒకరు.. అలాంటి గొప్ప పేరున్న డైరెక్టర్ హత్యకు గురికావడంతో సినీ ఇండస్ట్రీ షాక్ లో ఉంది. ఆయనను హత్య చేసి చంపేంత శత్రువులు కూడా ఉన్నారా అని చర్చలు మొదలయ్యాయి.. ఏది ఏమైనా కూడా హాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది.
హాలీవుడ్ దర్శకులలో స్టార్ ఇమేజ్ ఉన్న వారిలో ఈయన ఒకరు.. హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించి ప్రేక్షకుల మనసులో డైరెక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రైనర్ యొక్క అద్భుతమైన రచనలలో “వెన్ హ్యారీ మెట్ సాలీ,” “ది ప్రిన్సెస్ బ్రైడ్”, “ఎ ఫ్యూ గుడ్ మెన్” ఉన్నాయి. అంతేకాదు కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహారించారు. టీవీలో “ఆల్ ఇన్ ది ఫ్యామిలీ”లో అద్భుతమైన నటన కనబరిచారు. ఇకపోతే సినిమా మరియు టెలివిజన్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులలో రాబ్ రైనర్ ఒకరు. రైనర్ దాదాపు ఆరు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగారు. ఎన్నో చిత్రాలకు అవార్డులను కూడా అందుకున్నారు.. అలాంటి వ్యక్తి ఇప్పుడు లేరని తెలుసుకున్న చాలా మంది ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. డైరెక్టర్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేస్తున్నారు.. హంతుకులను వెంటనే పట్టుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ ఘటనపై విచారణ జరుగుతున్న పోలీసులు హంతకులు ఎవరన్న విషయాన్ని త్వరలో వెల్లడించే అవకాశం ఉంది..