E-Paper
Advertisement

Varanasi Movie: మహేష్ బాబు తండ్రిగా ఆ విలక్షణ నటుడు… హిట్ కాంబో రిపీట్!

Varanasi Movie: మహేష్ బాబు తండ్రిగా ఆ విలక్షణ నటుడు… హిట్ కాంబో రిపీట్!
Advertisement

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న మొట్టమొదటి చిత్రం వారణాసి. రాజమౌళి దర్శకత్వంలో సినిమా అంటేనే సినిమా పట్ల మంచి అంచనాలు ఉంటాయి. ఇక మొదటిసారి మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై అంతర్జాతీయ స్థాయిలో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు ఏకంగా 5 విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారు అంటూ ఇటీవల మహేష్ బాబు పాత్రకి సంబంధించిన వార్తలు హల్చల్ చేశాయి.

వారణాసిలో భాగమైన ప్రకాష్ రాజ్..

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ బాబు తండ్రి పాత్ర కూడా ఈ సినిమాలో కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం పలువురు హీరోలకు లుక్ టెస్ట్ కూడా చేశారని ఫైనల్ గా మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం నటుడు ప్రకాష్ రాజ్ ను రాజమౌళి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ ఎంపిక అవడమే కాకుండా ప్రస్తుతం ఈయన షూటింగ్ లొకేషన్ లోకి కూడా అడుగుపెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది.

మహేష్ తండ్రిగా ప్రకాష్ రాజ్?

Advertisement

ఈ విధంగా ప్రకాష్ రాజ్ మహేష్ బాబుకి తండ్రిగా కనిపించబోతున్నారని విషయం గురించి అధికారిక ప్రకటన లేకపోయినా సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారడంతో మహేష్ బాబు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి ఈ హిట్ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదివరకు మహేష్ బాబు నటించిన పోకిరి, ఒక్కడు, అతడు, అర్జున్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, దూకుడు వంటి సినిమాలలో ప్రకాష్ రాజ్ నటించారు. ఈ సినిమాలన్నీ కూడా సూపర్ సక్సెస్ అందుకున్నాయి.

2007 సమ్మర్ రిలీజ్..

Advertisement

ఇక దూకుడు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలలో ప్రకాష్ రాజ్ మహేష్ బాబుకి తండ్రిగా కనిపించిన సంగతి తెలిసిందే .అయితే మరోసారి ఈయన తండ్రిగా కనిపించబోతున్నారనే విషయం తెలియడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక త్వరలోనే ఈ విషయానికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందని తెలుస్తోంది. అయితే మొదట్లో నటుడు మాధవన్ మహేష్ బాబుకి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి కానీ ఇందులో నిజం లేదని మాధవన్ హనుమంతుడి పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా 2027 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు.

Also Read: Mowgli Day 2 collections: మోగ్లీ డే 2 కలెక్షన్స్.. పాపం.. 2 కోట్లు కూడా రాలేదు

Related News

Shalini Pandey : బాపురే.. బాత్ రూమ్ వీడియోతో ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ రచ్చ.. తట్టుకోలేరమ్మ..!

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

Big Stories

Advertisement
×