E-Paper
Advertisement

Pixel Pro Fold: గూగుల్ ఫోల్డబుల్ ఫోన్‌పై రూ.77,000 తగ్గింపు.. ఇప్పుడు రూ.లక్షలోపే పిక్సెల్ ప్రో ఫోల్డ్

Pixel Pro Fold: గూగుల్ ఫోల్డబుల్ ఫోన్‌పై రూ.77,000 తగ్గింపు.. ఇప్పుడు రూ.లక్షలోపే పిక్సెల్ ప్రో ఫోల్డ్

Google Pixel 9 Pro Fold Discount| గూగుల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడూ లేనంత అతి తక్కువ ధరలో లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్ ఉంది. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్‌చేంజ్ బెనిఫిట్స్ అన్నీ కలిపి రూ.77,000కు పైగా పొదుపు చేయొచ్చు. ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ అయిన పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ కావాలనుకునేవాళ్లకి ఇది అద్భుతమైన ఆఫర్.

ధర, ఆఫర్లు ఏమిటి?

పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ (16GB+256GB) లాంచ్ ధర రూ.1,72,999. అయితే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌తో రూ.99,999కే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ బజాజ్ ఫిన్‌సర్వ్ EMI కార్డు తో కొనుగోలు చేస్తే.. రూ.400 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఉంది. దీంతో ధర రూ.99,599 అవుతుంది. అదే కాకుండా ఎస్‌బిఐ కార్డు లేదా ఫ్లిప్‌కార్డ్ యాక్సిస్ బ్యాంక్ కార్డుతో పేమెంట్ చేస్తే అదనంగా రూ.4000 ధర తగ్గుతుంది. కనీసం రూ.73,000 వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో కలిపి రూ.77,000 డిస్కౌంట్.

ఎక్స్‌ఛేంజ్ ఆఫర్

పాత ఫోన్ ఇస్తే రూ.62,400 వరకు ఎక్స్‌చేంజ్ వాల్యూ + కొన్ని మోడల్స్‌కి ఎక్స్‌ట్రా రూ.5,000 ధర తగ్గుతుంది.

డిస్‌ప్లే ఎలా ఉంది?

పిక్సెల్ 9 ఫోల్డ్ ప్రో ఓపెన్ చేస్తే 8 అంగుళాల LTPO ఓలెడ్ ఇన్నర్ డిస్‌ప్లే ఉంది. దీని రిజల్యూషన్ 2076×2152 పిక్సెల్స్, 120Hz రిఫ్రెష్ రేట్, 2700 నిట్స్ బ్రైట్‌నెస్. కవర్ డిస్‌ప్లే 6.3 అంగుళాల OLED స్క్రీన్ ఉంది. రిజల్యూషన్ 1080×2424, 120Hz రిఫ్రెష్ రేట్, అదే బ్రైట్‌నెస్. రెండూ సూపర్ క్వాలిటీ స్క్రీన్స్.

పర్ఫామెన్స్, సాఫ్ట్‌వేర్ ఎలా ఉంది?

ఫోన్ లోపల గూగుల్ Tensor G4 చిప్ + Titan M2 సెక్యూరిటీ చిప్ ఉన్నాయి. ఫోన్ లో యాప్స్ Android 16 ఆధారంగా రన్ అవుతాయి. వస్తుంది. పర్ఫామెన్స్ చాలా స్మూత్, సురక్షితంగా ఉంటుంది.

కెమెరా ఎలా ఉంది?

ఈ ప్రీమియం ఫోల్డెబుల్ ఫోన్ వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. 48MP వైడ్ (f/1.7), 10.5MP అల్ట్రావైడ్ (f/2.2), 10.8MP టెలిఫోటో (f/3.1). ముందుభాగంలో రెండు 10MP సెల్ఫీ కెమెరాలు (f/2.2). ఫోటోలు, వీడియోలు అద్భుతంగా వస్తాయి.

Also Read: ఆండ్రాయిడ్ లో ఐఫోన్ ఫీచర్స్.. 15 ఏళ్ల ఇండియన్ కుర్రాడి అద్భుత సృష్టి

బ్యాటరీ, కనెక్టివిటీ ఎలా ఉంది?

ఫోన్ లో 4650mAh బ్యాటరీ + 45W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. 5G, వైఫై 7, బ్లూటూత్ 5.3, NFC, GPS, USB 3.2 Type-C – అన్నీ లేటెస్ట్ కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

గత ఏడాది ఆగస్టులో రూ.1.73 లక్షలకి విడుదలైన ఫోన్ ఇప్పుడు రూ.99000కే ఇప్పుడు లభించడం ఒక సూపర్ డీల్! ప్రీమియం ఫోల్డబుల్ కావాలంటే ఈ ఆఫర్ మిస్ చేయొద్దు. ఫ్లిప్‌కార్ట్‌లో స్టాక్ త్వరగా అయిపోవచ్చు!

Related News

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

Big Stories

×