Hollywood : ఈ మధ్య సీనియర్ ఇండస్ట్రీలోని నటీనటులు ఏదో ఒక కారణంతో మృతి చెందుతున్న విషయం తెలిసిందే. తెలుగులోనే కాదు అటు హిందీలోనూ మిగిలిన భాషల్లో కూడా అనారోగ్య సమస్యల కారణంగా ఎంతో మంది నటీనటులు ఇండస్ట్రీకి దూరమయ్యారు.. కొందరు స్వర్గస్తులు అవ్వగా మరి కొంతమంది అనారోగ్య సమస్యలతో సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఎంతోమంది రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.. తాజాగా హాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. హాలీవుడ్ లో పలు సినిమాలలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కేలి కన్నుమూశారు. ఆమె కారు ప్రమాదంలో ఆమె చనిపోయారు. 18 ఏళ్ల వయసులోనే కేలి కన్నుమూయడంతో హాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఆ అమ్మాయి మరణ వార్తను విన్న అభిమానులు కేలి అతి చిన్న వయసులోనే దూరం అవ్వడంతో బాధపడుతున్నారు.. కేలి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సోషల్ మీడియాలో మిస్ యూ కేలి అంటూ పోస్టులు పెడుతున్నారు.. హాలీవుడ్ ఇండస్ట్రీ ఒక టాలెంటెడ్ నటిని కోల్పోవడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.. తనతో కలిసి పనిచేసిన నటీనటులు అందరూ కూడా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.. కేలి మరణం హాలీవుడ్ ఇండస్ట్రీలో తీరని లోటు.. నేడు ఆమె అంత్యక్రియలను ఘనంగా నిర్వహించనున్నారని సమాచారం.. ఈ కార్యక్రమానికి కేళి ఈ కుటుంబ సభ్యులతో పాటుగా సినీ ఇండస్ట్రీలోని పలువురు నటీనటులు కూడా హాజరుకానున్నట్లు టాక్..
హాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి తన నటనతో మెప్పించిన కేలి ఇప్పుడు లేదన్న వార్త విన్న అభిమానులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అది చిన్న వయసులోనే ఆమె చనిపోవడం ఇండస్ట్రీకి షాక్ అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అతి చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చిన కేలి ఆమె నటించిన సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.. 18 ఏళ్ల వయసున్న ఈ కేలి కారు ప్రమాదంలో మరణించింది. మేరీల్యాండ్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో ఈ అమ్మాయి చనిపోయింది. తనకి వినికిడి లోపం ఉన్న సరే ఎక్కడ వెనక్కి తగ్గకుండా సినిమా అవకాశాలను అందుకుంటూ అతి చిన్న వయసులోనే ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది కేలి.. గత కొన్నేళ్లుగా ఈమె వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ప్రస్తుతం ఈ అమ్మాయి చేతిలో రెండు భారీ యాక్షన్ చిత్రాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈమె మరణించడంతో ఆ ప్లేస్లో మరి ఎవరు నటిస్తారు అన్నది చూడాలి..
చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన హాలీవుడ్ నటి కేలి పలు సినిమాలలో నటించి తన నటనతో హాలీవుడ్ లో ఎంతో మందిని అభిమానులుగా మార్చుకుంది.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’, ‘గాడ్జిల్లా ఎక్స్ కాంగ్: ది న్యూ ఎంపైర్’ సినిమాల్లో నటించి ఆమె మంచి గుర్తింపు పొందారు.. ఫ్యామిలీ వారసత్వంగా వినికిడి లోపం ఉందన్న విషయం తెలిసిందే.. జన్యుపరమైన లోపాల వల్ల ఆమెకు వినికిడి లోపం కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది.. అయితే ఈ రెండు సినిమాలలో కూడా ఆమె అలానే నటించింది. కేలీ వినికిడి లోపం ఉండి సైన్ లాంగ్వేజ్‌తో మాట్లాడే జియా అనే బాలిక పాత్రను పోషించారు.. ఏది ఏమైనా కూడా హాలీవుడ్ ఇండస్ట్రీ మంచి నటిని కోల్పోయింది. ఎంతోమంది ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 18 ఏళ్ల వయసున్న కేలి ప్రస్తుతం హీరోయిన్గా కూడా సినిమాలు చేస్తూ వస్తుంది.