E-Paper
Advertisement

MAD Junior: ‘మ్యాడ్ జూనియర్’ పూజా కార్యక్రమాలు పూర్తి.. స్పీడు మీదున్న నాగ వంశీ!

MAD Junior: ‘మ్యాడ్ జూనియర్’ పూజా కార్యక్రమాలు పూర్తి.. స్పీడు మీదున్న నాగ వంశీ!
Advertisement

MAD Junior:  ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున సినిమాలు ఫ్రాంచైజీలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఒక సినిమా సక్సెస్ అయ్యిందిఅంటే ఆ సినిమాకు  వరుసగా ఫ్రాంచైజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే నాగ వంశీ నిర్మాతగా కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమాలలో మ్యాడ్ సినిమా(Mad) ఒకటి. రామ్ నితిన్, నార్నే నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా  ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు మూడో భాగం కూడా ఉండబోతుందని ఇటీవల చిత్ర బృందం తెలియచేశారు.

మ్యాడ్ జూనియర్..

తాజాగా ఈ సినిమాకు సంబంధించి పూజ కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకు మ్యాడ్ జూనియర్(Mad Junior) అనే టైటిల్ పెట్టబోతున్నట్లు తెలియజేశారు. ఇక ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియజేశారు. ఈ సినిమా పూజ కార్యక్రమాలు పూర్తి కావడంతో రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను అధికారికంగా వెల్లడించనున్నారు.

నెట్ ఫ్లిక్స్ చేతికి డిజిటల్ హక్కులు..

Advertisement

ఇక ఈ సినిమా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 37 సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కైవసం చేసుకున్నట్టు ఇటీవల నెట్ ఫ్లిక్స్ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక గత ఏడాది పలు సినిమాల ద్వారా నాగ వంశీ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి నిరాశ ఎదుర్కొన్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా నాగ వంశీ నిర్మాణంలో తెరకెక్కిన అనగనగా ఒక రాజు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాతో హిట్ కొట్టిన నాగ వంశీ తదుపరి సినిమాని కూడా ప్రారంభించారు.

హర్రర్ కామెడీ నేపథ్యంలో..

Advertisement

ఇక మ్యాడ్ జూనియర్ సినిమా కూడా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఈసారి హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుండడం విశేషం. అయితే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సినిమాలు హర్రర్ కామెడీ నేపథ్యంలోనే విడుదలవుతున్నాయి. ఇక ఈ సినిమా కూడా హర్రర్ కామెడీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నాగవంశీ సాహసం చేస్తున్నారా? లేదా ఇదివరకు సినిమాలు మాదిరిగా మ్యాడ్ జూనియర్
తో హిట్ కొట్టబోతున్నారా అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Manaswini Balabommala: ‘ కొక్కొరొకో’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేయనున్న మనస్విని బాల బొమ్మల

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×