IND VS BAN: ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Under 19 World Cup 2026) నేపథ్యంలో టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ అండర్ 19 జట్ల ( India U19 vs Bangladesh U19, 7th Match) మధ్య ఇవాళ గ్రూప్ స్టేజిలో మ్యాచ్ జరిగింది. జింబాబ్వే లో ఉన్న బులవాయే క్వీన్ స్పోర్ట్స్ క్లబ్ ( Queens Sports Club, Bulawayo ) వేదికగా ఏడవ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ( VAIBHAV SURYAVANSHI ) అటు బంగ్లా క్రికెటర్ జావీద్ అబ్రార్ ( Zawad Abrar ) మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో 70కి పైగా పరుగులు చేశాడు వైభవ్ సూర్యవంశీ. ఈ నేపథ్యంలోనే రెచ్చిపోయారు బంగ్లా క్రికెటర్లు. అందుకే వైభవ్ సూర్య వంశీ తో గొడవ పెట్టుకుని, అతని డిస్టబ్ చేశారు. ఈ నేపథ్యంలోనే సెంచరీ కూడా మిస్ చేసుకున్నాడు వైభవ్ సూర్య వంశీ.
ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో ( ICC Under 19 World Cup 2026) భాగంగా ఇవాళ బద్ధ శత్రువులైన ఇండియా అలాగే బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతున్నప్పటికీ కూడా ఆ జట్టుతో టీమిండియా మ్యాచ్ ఆడడం జరిగింది. ఐసీసీ రూల్స్ ప్రకారం కచ్చితంగా శత్రువు దేశంతో అయినా మ్యాచ్ ఆడాలి. లేకపోతే ఐసీసీ పాయింట్లను కట్ చేస్తుంది. అందుకే అండర్ 19 టీమిండియా ఆడాల్సి వచ్చింది.
అయితే ఈ మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ ( VAIBHAV SURYAVANSHI ) 67 బంతుల 72 పరుగులు సాధించాడు. ఇందులో మూడు సిక్సులతో పాటు ఆరు బౌండరీలు ఉన్నాయి. అయితే వైభవ్ సూర్య వంశీ సెంచరీ దిశగా దూసుకు వెళ్తున్న నేపథ్యంలో అతని డిస్టర్బ్ చేసింది బంగ్లాదేశ్ టీం. ఇందులో భాగంగానే బంగ్లా ఆటగాడు జావీద్ అబ్రార్ ( Zawad Abrar ) ఓవర్ యాక్షన్ చేశాడు. వైభవ్ సూర్య వంశీ గెలిచాడు. దీంతో 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ రెచ్చిపోయి.. అతనికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.
వేలు పెట్టి చూపించి మరీ.. ఆగ్రహించాడు. అంతలోనే అంపైర్లు రంగంలోకి దిగి గొడవను సద్దు మణిగేలా చేశారు. ఇది ఇలా ఉండగా, ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ లో ( ICC Under 19 World Cup 2026) భాగంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా మొదట బ్యాటింగ్ చేసింది. 48.4 ఓవర్లలో 238 పరుగులు చేసింది ఆలౌట్ అయింది అండర్ 19 టీమిండియా. కాగా ఈ మ్యాచ్ లో 239 పరుగులు చేస్తే, బంగ్లాదేశ్ జట్టు విజయం సాధించింది.
🚨 India vs Bangladesh cricket drama started
– First Indian captain Ayush Mhatre and Bangladesh captain Azizul Hakim did not handshake during the toss
– Then the Heated argument between Vaibhav Suryavanshi and Zawad Abrar
This is just a start, It's gonna be more exciting… pic.twitter.com/V9o3aPuzrH
— Tejash (@Tejashyyyyy) January 17, 2026