E-Paper
Advertisement

Manaswini Balabommala: ‘ కొక్కొరొకో’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేయనున్న మనస్విని బాల బొమ్మల

Manaswini Balabommala: ‘ కొక్కొరొకో’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేయనున్న మనస్విని బాల బొమ్మల
Advertisement

Manaswini Balabommala: సినిమా ఇండస్ట్రీలోకి నిరంతరం ఎంతోమంది కొత్తవారు అడుగుపెడుతూ వారి టాలెంట్ ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే థియేటర్ రంగంలో మంచి అనుభవం కలిగిన Little Women నాటకంలో జోగా, Much Ado About Nothing లో బియాట్రిస్‌గా ప్రధాన పాత్రలు పోషించిన మనస్విని బాల బొమ్మల వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈమె ‘ కొక్కొరొకో’ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన తెలియజేయడమే కాకుండా పస్టు లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

కొక్కొరొకో సినిమాతో వెండితెర అరంగ్రేటం..

ఇలా పోస్టర్ విడుదల చేస్తూ.. “మా బంగార్రాజు ఫ్యామిలీ నుంచి మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ సంక్రాంతి ‘కొక్కోరోకో’ త్వరలో థియేటర్లలో” అంటూ పోస్టర్ విడుదల చేశారు ఈ పోస్టర్లో మనస్వినితో పాటు సీనియర్ నటుడు సముద్రఖని సహా ఇతర నటులతో కలిసి కనిపించారు. ఈ సినిమా మనస్వినికి మొదటి తెలుగు సినిమా కావటం విశేషం.యువతరంలో మంచి గుర్తింపు సాధించే ప్రతిభావంతురాలైన మనస్విని బాలబొమ్మల తెలుగులో “కొక్కోరోకో” చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆమె సినిమా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది.

కోడిపందేలా నేపథ్యంలో..

Advertisement

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం దర్శకుడు రమేష్ వర్మ నిర్మాతగా మారి తన కొత్త బ్యానర్ ఆర్వీ ఫిల్మ్ హౌస్ ద్వారా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇక ఈ సినిమాకు శ్రీనివాస్ వసంతల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కొక్కోరోకో అనే టైటిల్ పెట్టడంతో కచ్చితంగా ఈ సినిమా కోడిపందాల నేపద్యంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని స్పష్టం అవుతుంది. 2026వ సంవత్సరంలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇలా థియేటర్ రంగంలో ఎంతో అనుభవం కలిగిన మనశ్విని వెండితెర పైకి ఓ అద్భుతమైన సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నారని స్పష్టమవుతుంది.

సంగీతంలో ప్రావీణ్యం..

Advertisement

ఈమె నటనలో మాత్రమే కాదు శాస్త్రీయ సంగీత నేపథ్యంలో కూడా ఎంతో మంచి పట్టు ఉంది. ఈమెకు పెరిని పని నాట్యం శాస్త్రీయ నృత్యంలో, కర్ణాటక సంగీతంలోనూ మంచి శిక్షణ, ప్రావీణ్యం కలిగి ఉన్నారు. పలు వేదికలపై భక్తి గీతాలను ప్రదర్శించడమే కాకుండా గ్లెండెల్ అకాడమీలో యాంకర్ గా కూడా కొనసాగారు. నటన, నాటక రంగంలో మంచి అనుభవం కలిగిన మనస్విని వెండి తెరపైకు రాబోతుండటం విశేషం. ఈ విషయం తెలిసిన ఆమె అభిమానులు వెండితెరపై కూడా మంచి సక్సెస్ అందుకోవాలి అంటూ ఆకాంక్షిస్తున్నారు.

Also Read: Sanjay Dutt: టెస్లా సైబర్ లో ముంబై రోడ్లపై చక్కర్లు కొట్టిన సంజయ్ దత్.. వీడియో వైరల్!

Related News

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

Big Stories

Advertisement
×