E-Paper
Advertisement

Hrithik Roshan: వార్‌ 2 ఫలితంపై హీరో సెల్ఫ్‌ ట్రోలింగ్‌.. దుబాయ్ వేదికగా షాకింగ్‌ కామెంట్స్‌

Hrithik Roshan: వార్‌ 2 ఫలితంపై హీరో సెల్ఫ్‌ ట్రోలింగ్‌.. దుబాయ్ వేదికగా షాకింగ్‌ కామెంట్స్‌
Advertisement

Hrithik Roshan Comments on War 2 Failure: హృతిక్ రోషన్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పుస్తకాల్లో చాలామంది రాకుమారుడు గురించి చదువుకుంటారు. అయితే హృతిక్ రోషన్ ను చూస్తే రాకుమారుడు అంటే ఇలానే ఉంటాడా అనిపించే కటౌట్. హాలీవుడ్ హీరోకు ఏ మాత్రం తగ్గని లుక్స్ హృతిక్ రోషన్ సొంతం. హృతిక్ రోషన్ బాలీవుడ్ హీరో అయినా కూడా చాలామంది తెలుగు ప్రేక్షకులు ఆయనను విపరీతంగా ఇష్టపడతారు.

బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ తో

ఇప్పుడైతే అందరూ వరల్డ్ సినిమా చూడటం మొదలుపెట్టారు. కానీ ఒకప్పుడు హృతిక్ రోషన్ సినిమాలను అప్పట్లో సిడీలు కొనుక్కుని మరీ చూసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చాలామంది యూత్ కి కోయి మిల్ గయా, క్రిష్ వంటి సినిమాలు ఫేవరెట్. ముఖ్యంగా హృతిక్ రోషన్ డాన్స్ వేసే స్టైల్ చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. ఇలా హృతిక్ రోషన్ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. సక్సెస్ వచ్చినప్పుడు చుట్టు పదిమంది చేరుతారు అనేది ఎన్నోసార్లు ప్రూవ్ అవుతూ వచ్చింది. అయితే సక్సెస్ ఫెయిల్యూర్స్ అనేవి ఇండస్ట్రీలో కామన్ గా జరుగుతాయి.

వార్ 2 ఫలితం పై సెల్ఫ్ ట్రోలింగ్

Advertisement

కొంతమంది ఫెయిల్యూర్స్ లో ఉంటే అసలు బయటకు రావడానికి కూడా ఇష్టపడరు. ఇంకొంతమంది ఆ ఫెయిల్యూర్స్ ని కూడా ఛాలెంజ్ గా తీసుకొని సక్సెస్ బాటలో వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఆసక్తికరంగా తన పైన తానే సెటైర్ వేసుకున్నారు హృతిక్ రోషన్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. అంచనాలను అందుకోకపోవడం ఒక స్థాయి వరకు పరవాలేదు, ఈ సినిమా మినిమం ఆకట్టుకోలేకపోయింది అంటూ విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది.

Also Read: Ramanaidu Studios: పన్ను ఎగవేత.. జీహెచ్‌ఎంసీ నోటీసులపై స్పందించిన రామానాయుడు స్టూడియోస్‌

ఎన్టీఆర్ కి కూడా మైనస్

Advertisement

దుబాయిలో జరిగిన ఓ అవార్డు వేడుకకు హృతిక్ హాజరయ్యాడు. అక్కడ హృతిక్ ని స్టేజ్ పైకి పిలుస్తూ సూపర్ స్టార్ అంటూ హోస్ట్ పరిచయం చేశారు. వెంటనే హృతిక్ “నా సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం పాలైంది, అందుకే అందరి ప్రేమను పొందడం ఆనందంగా ఉంది. అంటూ తనపైన తనే సెటైర్ వేసుకున్నాడు. అది విన్న వెంటనే ఒకసారిగా అందరూ నవ్వుకున్నారు. అయితే చాలామంది తెలుగు హీరోలకి బాలీవుడ్ అంతగా కలిసి రావడం లేదు. గతంలో రామ్ చరణ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి హీరోలు హిందీలో సినిమాలు చేశారు అవి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ కి కూడా ఇది మైనస్ గా మారింది. నాగ వంశీ ఈ సినిమా గురించి భారీ ఎలివేషన్. సినిమా ఫలితం వచ్చిన తర్వాత అతను కూడా సైలెంట్ అయిపోయాడు.

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×