E-Paper
Advertisement

Family Man season 3 : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ స్టార్స్ రెమ్యునరేషన్… విలన్ కు ఎంత? హీరోకి ఎంత ?

Family Man season 3 : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ స్టార్స్ రెమ్యునరేషన్… విలన్ కు ఎంత? హీరోకి ఎంత ?
Advertisement

Family Man season 3 : ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’. మనోజ్ బాజ్‌ పేయి నటించిన ఈ సిరీస్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఆకలి మీద ఉన్న ఆడియన్స్ ఇప్పుడు దీనిని తెగ చూసేస్తున్నారు. గత రెండు సీజన్లు ఇచ్చిన హైప్ తో మూడవ సీజన్ చూస్తే గాని ఆడియన్స్ కుదుట పడట్లేదు. ఇది 2025 నవంబర్ 21న విడుదలై, అత్యున్నత స్థాయిలో ఆదరణ పొందుతోంది. ఈ కథ ఇంతకు ముందు కంటే మరింత ఇంటెన్స్ గా నడుస్తోంది. ఇక పోతే ఇందులో నటీనటులకు పారితోషికం కూడా బాగానే ముట్టినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ లో ప్రతి నటుడికి ఎంత మొత్తం అందిందో తెలుసుకుందాం పదండి.

ఎవరెవరి పారితోషికం ఎంతంటే

ఈ సీజన్ లో ప్రధాన నటుడు మనోజ్ బాజ్‌పేయి అత్యధిక పారితోషికం అందుకున్నాడు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ శ్రీకాంత్ తివారీ పాత్రలో నటించిన ఈ హీరో సీజన్ 3 కోసం 22 కోట్ల వరకు అందుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో అతని పాత్ర కూడా చాలా ఇంటెన్స్ గా ఉంటుంది. అతను తన కుటుంబాన్ని, దేశాన్ని రక్షించే బాధ్యత మధ్య నలిగిపోయేలా ఈ సీజన్ ఉంది. ఆ తరువాత కొత్త విలన్ రుక్మా పాత్రలో నటిస్తున్న, జైదీప్ అహ్లవత్ కు 9 కోట్లు పారితోషికం అందింది. శ్రీకాంత్ కు మరో టఫ్ శత్రువు మీరా పాత్రలో నిమ్రత్ కౌర్ కూడా కీలక పాత్ర పోషించింది. ఆమె 8 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం.

Advertisement

శ్రీకాంత్ భార్య సుచి పాత్ర పోషించిన ప్రియమణి, ఈ సిరీస్‌లో సుమారు ₹7 కోట్ల పారితోషికం అందుకుంది. శ్రీకాంత్ నమ్మకమైన సహచరుడు JK పాత్ర ద్వారా అందరి అభిమానం పొందిన షరీబ్ హష్మీ కూడా గణనీయమైన పారితోషికాన్ని అందుకున్నాడు. కథనంలో అతని ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని సీజన్ 3 కోసం అతను దాదాపు ₹5 కోట్లు అందుకున్నాడని తెలుస్తోంది. శ్రీకాంత్ కుమార్తె ధృతి పాత్ర పోషించిన ఆశ్లేష ఠాకూర్ దాదాపు ₹4 కోట్ల పారితోషికం అందుకోవడంతో కథలో ఆమెకు పెరుగుతున్న ప్రాముఖ్యత ఎంత అనేది చెప్పకనే చెబుతోంది.

Read Also :  ‘ది బెంగాల్ ఫైల్స్’ లాంటి టాప్ రియల్ లైఫ్ స్టోరీస్… ఒక్కో ఊచకోతను చూస్తే వణుకే మావా

ఈ సిరీస్ ఎందులో ఉందంటే

Advertisement

మనోజ్ బాజ్‌ పేయి, ప్రియమణి, నిమ్రత్ కౌర్, షరీబ్ హాష్మీ నటించిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’ 2025 నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. 7 ఎపిసోడ్స్ తో ప్రతి ఒక్కటి దాదాపు యాభై నిమిషాల నిడివితో నడుస్తోంది. రాజ్ & డికే రూపొందించిన ఈ సిరీస్ ఐయండిబిలో 8.7/10 రేటింగ్ పొందింది. ఇక ఈ సిరీస్ లో మనోజ్ బాజ్‌పేయి ఇటు ఫ్యామిలీని, అటు దేశాన్ని కాపాడే ఒక స్పై ఏజెంట్ గా, శ్రీకాంత్ తివారీ పాత్రలో జీవించాడానే అంటున్నారు ప్రేక్షకులు.

 

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×