E-Paper
Advertisement

Ibomma Ravi:రవి వాళ్ల అమ్మ పెద్ద క్రిమినల్… అందుకే వీడు ఇలా… అసలు నిజం బయట పెట్టిన తండ్రి

Ibomma Ravi:రవి వాళ్ల అమ్మ పెద్ద క్రిమినల్… అందుకే వీడు ఇలా… అసలు నిజం బయట పెట్టిన తండ్రి
Advertisement

IBomma Ravi: ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐ బొమ్మ(Ibomma) నిర్వాహకుడు రవి అరెస్టు గురించి సంచలనంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా వేల సంఖ్యలో సినిమాలను పైరసీలు చేస్తూ కోట్ల రూపాయల ఆర్జించారు. ఈ విధంగా రవి పెద్ద ఎత్తున సినిమాలను పైరసీలకు గురి చేస్తున్న నేపథ్యంలో పోలీసులు గత కొంతకాలంగా ఈయనపై నిఘా ఉంచి పథకం ప్రకారం తనని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ విధంగా రవి అరెస్టు కావడంతో ఈయనకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా రవి తండ్రి అప్పారావు కూడా పలు మీడియా సమావేశాలలో పాల్గొంటూ తన కొడుకుకు సంబంధించి సంచలన విషయాలను బయటపెడుతున్నారు.

రవి వ్యవహారం తండ్రికి తెలియదా?

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా అప్పారావు(Apparao) మాట్లాడుతూ తనకు ఇద్దరు సంతానమని ఇద్దరు పిల్లల్ని డిగ్రీ వరకు చదివించానని తెలిపారు. తన కొడుకు ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్లి ఏదో ప్రైవేట్ జాబ్ చేస్తున్నారని మాకు చెప్పారు. నిన్న అతని గురించి టీవీలలో వార్తలు వచ్చే వరకు కూడా నా కొడుకు చేస్తున్న పని తెలియదని అప్పారావు తెలిపారు. ఇక తన కొడుకుకి తనకు నచ్చిన అమ్మాయితోనే పెళ్లి చేసినప్పటికీ పాప పుట్టిన తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారని తెలిపారు. నా కొడుకుకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు హైదరాబాదులో ఉండి కష్టపడి పనిచేసుకుంటున్నాడు అనుకున్నాను కానీ ఇలా చేస్తున్నాడని అసలు తెలియదంటూ అప్పారావు తెలిపారు.

రవికి అన్ని వాళ్ళ అమ్మ బుద్ధిలే..

Advertisement

సినిమాల విషయంలో నా కొడుకు చేసింది పూర్తిగా తప్పని ఈయన తెలియచేశారు. మేము మా కుటుంబంలో కష్టపడి పని చేసుకుని బ్రతికామె తప్ప ఇలాంటి పనులకు పాల్పడలేదని అయితే తన కొడుకుకి మొత్తం తన తల్లి బుద్ధులే వచ్చాయని, వాళ్ళ అమ్మది చాలా క్రిమినల్ బ్రెయిన్ తన తల్లి అలవాట్లే నా కొడుకుకి కూడా వచ్చాయి అందుకే వాడు ఇలాంటి పనులు చేస్తున్నారు అంటూ రవి తండ్రి అప్పారావు సంచలన విషయాలను బయటపెట్టారు. మా వంశంలో ఇలాంటి పాడు బుద్ధి ఎవరికీ లేదని తెలిపారు.

రవి ఒక్క రూపాయి కూడా పంపలేదు..

Advertisement

ఇక అప్పారావు కూడా తన భార్య నుంచి విడిపోయినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. తన భార్య వ్యక్తిత్వం మంచిది కాదని అందుకే తాను విడిపోయానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా తన కన్న కొడుకు గురించి ఆయన చేసిన పని తప్పు అని తెలియజేస్తూ అప్పారావు మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తన కొడుకు సంపాదించిన డబ్బు నాకు ఎప్పుడు పంపించలేదని తాను బిఎస్ఎన్ఎల్ లో రిటైర్డ్ ఎంప్లాయ్, తనకు పెన్షన్ వస్తుంది కాబట్టి ఎప్పుడు తన కొడుకును డబ్బులు అడగలేదని కూడా తెలిపారు. ఎప్పుడో ఒకసారి ఫోన్ లో మాత్రమే మాట్లాడే వారు అంటూ అసలు పలు కీలక విషయాలను అప్పారావు బయటపెట్టారు. మరి రవి అమ్మ ఎవరు? ఆమె ఎక్కడుంటారు ఈ విషయంపై ఆమె స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Actor Shivaji: ఐబొమ్మ రవి పై శివాజీ ప్రశంసలు.. సూపర్ టాలెంట్ అంటూ!

Related News

RC17 కోసం హాలీవుడ్ దిగ్గజం…సుకుమార్ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

చిరు ‘కాకా’ వాయిదా రూమర్లపై క్లారిటీ .. సంక్రాంతి పోటీకి సై అంటూ!

సౌందర్య మరణంపై స్టార్ హీరో ఎమోషనల్ కామెంట్స్!

రాకాను వెంటాడుతున్న వరుస లీకులు.. కథ మొత్తం లీక్ చేసేస్తారా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘కృష్ణంభజే’ నుండి ఫస్ట్ లుక్ లాంఛ్ !

సంక్రాంతి రేస్ నుంచి చిరంజీవి ‘కాకా’ ఔట్? నిజమేనా?

ఇరుముడి సినిమాకు భారీ షాక్…ప్రొజెక్టర్ ద్వారా వీధుల్లో ప్రదర్శనలు!

భార్యను కలవబోతున్న సీఎం విజయ్…త్రిష సైడ్ అవ్వాల్సిందేనా?

Big Stories

Advertisement
×