E-Paper
Advertisement

RRC: టెన్త్ అర్హతతో రైల్వేలో 1785 పోస్టులు.. అప్లికేషన్ ఫీజు జస్ట్ రూ.100 మాత్రమే.. డోంట్ మిస్

RRC: టెన్త్ అర్హతతో రైల్వేలో 1785 పోస్టులు.. అప్లికేషన్ ఫీజు జస్ట్ రూ.100 మాత్రమే.. డోంట్ మిస్

RRC: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే… ఎస్‌ఈఆర్‌ నుంచి పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. పపదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.

వెస్ట్ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతాలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే… ఎస్‌ఈఆర్‌ పరిధిలోని డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్‌ 17వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోండి.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1785

వివిధ వర్క్ షాపుల్లో.. యాక్ట్ అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి.

ఖరగ్‌పూర్ వర్క్‌షాప్, సిగ్నల్ అండ్‌ టెలికాం (వర్క్‌షాప్)(ఖరగ్‌పూర్), ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్ (ఖరగ్‌పూర్), ఎస్‌ఎస్‌ఈ (వర్క్స్)/ ఇంజినీరింగ్ (ఖరగ్‌పూర్), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (ఖరగ్‌పూర్), డీజిల్ లోకో షెడ్ (ఖరగ్‌పూర్), సీనియర్‌ డీఈఈ (జి) (ఖరగ్‌పూర్), టీఆర్‌డీ డిపో/ ఎలక్ట్రికల్ (ఖరగ్‌పూర్), ఈఎంయూ షెడ్/ ఎలక్ట్రికల్ (టీపీకేఆర్‌), ఎలక్ట్రిక్ లోకో షెడ్ (సంత్రగచి), సీనియర్‌ డీఈఈ (జి)(చక్రధర్‌పూర్), ఎలక్ట్రిక్ ట్రాక్షన్ డిపో(చక్రధర్‌పూర్), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో(చక్రధరపూర్), ఎలక్ట్రిక్ లోకో షెడ్(టాటా), ఇంజినీరింగ్ వర్క్‌షాప్ (సిని), ట్రాక్ మెషిన్ వర్క్‌షాప్(సిని), ఎస్‌ఎస్‌ఈ(వర్క్స్)/ ఇంజినీరింగ్ (చక్రధర్‌పూర్), ఎలక్ట్రిక్ లోకో షెడ్(బండాముండా), డీజిల్ లోకో షెడ్(బండాముండా), సీనియర్‌ డీఈఈ (జి)(ఆద్రా), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో(ఆద్రా), డీజిల్ లోకో షెడ్(బీకేఎస్‌సీ), టీఆర్‌డీ డిపో/ఎలక్ట్రికల్(ఆద్రా), ఎలక్ట్రిక్ లోకో షెడ్(బీకేఎస్‌సీ), ఎలక్ట్రిక్ లోకో షెడ్(ఆర్‌వోయూ), ఎస్‌ఎస్‌ఈ(వర్క్స్)/ ఇంజినీరింగ్ (ఆద్రా), క్యారేజ్ అండ్‌ వ్యాగన్ డిపో (రాంచీ), సీనియర్‌ డీఈఈ (జి)(రాంచీ), టీఆర్‌డీ డిపో/ ఎలక్ట్రికల్(రాంచీ), ఎస్‌ఎస్‌ఈ(వర్క్స్)/ ఇంజినీరింగ్ (రాంచీ) వర్క్ షాపుల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు:

యాక్ట్ అప్రెంటీస్: 1785 పోస్టులు

విద్యార్హత: టెన్త్ క్లాస్ పాస్ తో పాటు సంబందిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ పాసై ఉండాలి.

ట్రేడ్స్: ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, మెకానిక్ డీజిల్, ట్రిమ్మర్, ఎంఎంటీఎం, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్, రిఫ్రిజిరేటర్ అండ్‌ ఏసీ మెకానిక్, లైన్‌మ్యాన్..

వయస్సు: 2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 నవంబర్ 18

దరఖాస్తుకు చివరి తేది: 2025 డిసెంబర్ 17

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 1785

దరఖాస్తుకు చివరి తేది: డిసెంబర్ 17

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×