E-Paper
Advertisement

IBomma Ravi: రవి కస్టడీ ముగిసింది.. రేపు కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ విచారణ.. లాయర్‌ కామెంట్స్‌

IBomma Ravi: రవి కస్టడీ ముగిసింది.. రేపు కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ విచారణ.. లాయర్‌ కామెంట్స్‌
Advertisement

IBomma Ravi Advocate Comments: ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. సినిమాల పైరసీతో చేస్తూ కొన్నేళ్లుగా సినీ పరిశ్రమను, పోలీసులు ముప్పుతిప్పలు పెట్టిన రవిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. అతడు అరెస్టై వారం దాటింది. కానీ, ఇంకా అతడు పోలీసుల కస్టడీలోనే ఉన్నాడు. అతడి అరెస్టుతో తర్వాత పోలీసులు మెజీస్ట్రేట్‌ ముందు హాజరపరిచారు. ఈ సందర్బంగా అతడికి కోర్టు 5 రోజుల పోలీసుల కస్టడీని విధించింది. కానీ, వారం దాటిన ఇంకా ఐబొమ్మ రవి పోలీసుల కస్టడీలోనే ఉన్నారు. దీనికి అతడు పోలీసులకు సహకరించడం లేదని, కేసు విచారణలో పొంతన లేని సమాధానాలు చెబుతూ విచారణకు సహాకరించడం లేదని పోలీసులు ఆరోపిస్తున్నారు.

మొత్తం 5 కేసులు

దీంతో అతడి కస్టడీ గడువు పెంచాలని నాంపల్లి కోర్టును కోరారు. అయితే ఇమ్మడి రవి బెయిల్‌ కోసం ఆయన తరపు న్యాయవాది శ్రీనాథ్‌ తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇమ్మడి రవి కేసుకి సంబంధించిన ఆసక్తికర విషయం బయటపెట్టారు ఆయన. ఇమ్మడి రవి పోలీసులకు సహాకరించడం లేదనడంలో నిజం లేదన్నారు. ఆయన రవి 5 రోజుల కస్టడీ గడువు ముగిసిందన్నారు. అయినా ఇంకా రవి పోలీసు కస్టడీలోనే ఉన్నారని తెలిపారు. కస్టడి లో పోలీసులకు సహకరించలేదనేది అవాస్తవం. ఇమ్మడి రవిపై మొత్తం 5 కేసులో నమోదయ్యాయి. ఇందులో ఒక్క కేసుకు మాత్రమే రిమాండ్‌ విధించారన్నారు. మరో 4 కేసులో పిటి వారెంట్ కోసం పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. రవి బెయిల్‌ కోసం కోర్టులో పటిటిషన్‌ వేశామని, రేపు బెయిల్‌పై కోర్టులో విచారణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

కొన్నేళ్లుగా పోలీసులకు చక్కలు

Advertisement

కాగా గత కొన్నేళ్లుగా సినిమాలను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు చుక్కలు చూపిస్తున్న ఇమ్మడి రవిని ఇటీవల పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి అరెస్ట్‌తో టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకుంది. అతడికి కఠిన శి క్ష విధించాలని కోర్టుని కోరుతుంది. సినిమాల పైరసీతో రవి కోట్లు కోట్లు సంపాదించాడు. ప్రీగా ప్రజలకు సినిమా చూపిస్తూ సినీ ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం చేశాడు. అతడు మాత్రం పైరసీతో కోట్ల రూపాయలు సంపాదించాడు. దీంతో సినీ పరిశ్రమ, పోలీసు శాఖ ఇమ్మడి రవి, ఐబొమ్మ వెబ్‌ సైట్లపై నిఘా పెట్టింది. అతడి కోసం గాలిస్తున్న సమయంలో ఇమ్మడి రవి పోలీసులకే సవాలు విసిరాడు. తనను పట్టుకున్న పెద్దగా జరిగే నష్టమేమి లేదని, నాకంటు ఎవరూ లేనివాడినంటూ రవి పోలీసులతో సవాలు చేశాడు. దీంతో పోలీసు శాఖ తమ నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది.

స్నేహితుడి వల్లే అరెస్ట్‌

అయితే ఇమ్మడి రవి ఎక్కువ విదేశాల్లో ఉన్నందున్న అతడి పట్టుకోవడానికి పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. యూకే, కరేబియన్‌ దీవులు వంటి ప్రాంతాల నుంచి ఈ కార్యక్రలాపాలను నిర్వహించడానికి సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నట్టు రవి దర్యాప్తులో వెల్లడించాడు. డేటా అంతా విదేశాల్లో ఉండటం వలన, తనను పట్టుకోవడం పోలీసులకు అంత సులభం కాదనే ధీమాతో రవి ఉండేవాడు. సైబర్‌ టీం ద్వారా ఐబొమ్మ వెబ్‌ సైట్లపై నిఘా పెట్టిన పోలీసులకు ఈ-మెయిల్‌ లింక్‌ ద్వారా పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్‌లోని ఉంటున్న రవి అత్యంత సన్నిహితుడు ఫోన్‌ నెంబర్‌ సేకరించిన పోలీసులు రవి హైదరాబాద్‌ వచ్చినప్పుడల్లా తమకు సమాచారం అందేలా రహస్యంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అలా గత నెల హైదరాబాద్‌ వచ్చిన రవి కుకట్‌పల్లిలోని అతడి నివాసంలో నిఘా పెట్టి అరెస్టు చేశారు. దీంతో అతడి స్నేహితుడి వల్ల రవి పోలీసులకు చిక్కాడు.

Related News

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

Advertisement
×