E-Paper
Advertisement

Fruits For Glowing Skin: ఈ చలిలోనూ మీ చర్మం కాంతులీనాలా? ఐతే ఇలాంటి ఫ్రూట్స్ తినండి!

Fruits For Glowing Skin: ఈ చలిలోనూ మీ చర్మం కాంతులీనాలా? ఐతే ఇలాంటి ఫ్రూట్స్ తినండి!
Advertisement

Fruits For Glowing Skin: చలికాలం వచ్చిందంటే చాలు… చర్మం పొడిబారడం, పగుళ్లు రావడం, కాంతి కోల్పోవడం సహజం. చలిగాలి, తక్కువ తేమ కారణంగా చర్మం నిర్జీవంగా కనిపిస్తుంది. అయితే.. మీ చలికాలంలో పండ్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ సీజన్‌లో లభించే కొన్ని శక్తివంతమైన పండ్లను తినడం ద్వారా చర్మానికి లోపలి నుంచి పోషణ అందించి, ఆరోగ్యకరమైన కాంతిని తిరిగి పొందవచ్చు. ఇంతకీ అవేంటో తెలుసుకుందామా..

Advertisement

చలికాలంలో మీరు తప్పక తినాల్సిన పండ్లు:

1. బొప్పాయి:

Advertisement

బొప్పాయి చర్మానికి ఒక వరం లాంటిది. ఇది సహజమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. ఇందులో పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది మృత కణాలను తొలగించి.. కొత్త చర్మం ఏర్పడటానికి సహాయ పడుతుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది, మొటిమలు తగ్గించడానికి సహాయపడుతుంది. చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. చలికాలంలో చర్మంపై పేరుకుపోయే పొడి పొరను తొలగించడానికి బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుంది.

2. నారింజ, సిట్రస్ ఫ్రూట్స్:

చలికాలంలో విరివిగా లభించే నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు చర్మ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి విటమిన్ ‘సి’ తో నిండి ఉంటాయి. విటమిన్ ‘సి’ కొల్లాజెన్ ఉత్పత్తికి అత్యంత అవసరం. కొల్లాజెన్ చర్మాన్ని దృఢంగా, యవ్వనంగా ఉంచుతుంది. విటమిన్ ‘సి’ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి, కాలుష్యం, ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని కాపాడుతుంది.చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా.. చర్మానికి సహజమైన తేమను, రక్షణను ఇవ్వడంలో నారింజ పండ్లు చాలా మేలు చేస్తాయి. వీటిని జ్యూస్, లేదా ముక్కలు తినడం కూడా చాలా మంచిది.

3. దానిమ్మ :

దానిమ్మ గింజలు కేవలం రుచికరమైనవి మాత్రమే కావు. మీ చర్మానికి ఇవి ‘యాంటీ-ఏజింగ్’ బూస్టర్‌లుగా పని చేస్తాయి. దానిమ్మలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఫలితంగా చర్మానికి మరింత ఆక్సిజన్ , పోషకాలు అందుతాయి. ఇది చర్మంపై ముడతలు, సన్నని గీతలు ఏర్పడకుండా కాపాడుతుంది. రక్త ప్రసరణ మెరుగు పడటం వల్ల చలికాలంలో మీ చర్మం సహజంగా ఎర్రగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

Also Read: చలికాలంలోనూ అందమైన చర్మం కోసం.. సింపుల్ టిప్స్

4. అరటిపండు:

అరటిపండు తినడం వల్ల చాలా మంది బరువు పెరుగుతారు అని దూరం పెడతారు. కానీ ఇది చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ ‘ఎ’, ‘ఇ’, పొటాషియం అధికంగా ఉంటాయి. పొటాషియం చర్మానికి తేమను అందించి, పొడిబారకుండా కాపాడుతుంది. అంతే కాకుండా ఇందులోని విటమిన్ ‘ఎ’ మచ్చలను తగ్గించి, చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. చలి కాలంలో చర్మం తేమను త్వరగా కోల్పోతుంది. అరటి పండు తినడం వల్ల చర్మానికి అవసరమైన హైడ్రేషన్ లోపలి నుంచి అందుతుంది.

5. అవకాడో :

అవకాడోను కొందరు కూరగాయ అనుకుంటారు. కానీ ఇది ఒక పండు. దీని లోని కొవ్వు పదార్థాలు చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇది విటమిన్ ‘ఇ’, ఆరోగ్యకరమైన మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులతో నిండి ఉంటుంది. ఇందులోనివిటమిన్ ‘ఇ’ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మం యొక్క సహజ నూనెల పొరను బలపరుస్తాయి.

Related News

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

Big Stories

Advertisement
×