E-Paper
Advertisement

థియేటర్ డోర్ వెనుక బాలీవుడ్ లవ్ బర్డ్స్ సీక్రెట్ ప్లాన్.. కెమెరామెన్స్ దెబ్బకు స్కెచ్ రివర్స్!

థియేటర్ డోర్ వెనుక బాలీవుడ్ లవ్ బర్డ్స్ సీక్రెట్ ప్లాన్.. కెమెరామెన్స్ దెబ్బకు స్కెచ్ రివర్స్!
Advertisement

Palak Ibrahim: బాలీవుడ్ స్టార్ కిడ్స్ ఇబ్రహీం అలీఖాన్, పాలక్ తివారీ లవ్‌ స్టోరీ గత కొంతకాలంగా బి-టౌన్‌లో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ప్రతిసారీ మీడియా కంటికి చిక్కడం, ఆ ఫొటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవ్వడం కామన్ అయిపొయింది. అయితే, ఈసారి మాత్రం మీడియా కెమెరాల నుంచి తప్పించుకోవడానికి ఈ లవ్ బర్డ్స్ వేసిన స్కెచ్ పూర్తిగా బెడిసికొట్టింది. ముంబైలోని ఒక ప్రముఖ మల్టీప్లెక్స్‌లో జరిగిన ఈ ఇంట్రెస్టింగ్ హైడ్ అండ్ సీక్ గేమ్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మీడియాకి చిక్కిన ప్రేమ పక్షులు 
అసలు ఏం జరిగిందంటే, ఇబ్రహీం అలీఖాన్, పాలక్ తివారీ కలిసి ఒక సినిమా చూసేందుకు ముంబైలోని థియేటర్‌కు వచ్చారు. సినిమా ముగిసిన తర్వాత బయటకు వస్తున్న సమయంలో, అక్కడ అప్పటికే మాటు వేసి ఉన్న పపరాజీలు (మీడియా ఫొటోగ్రాఫర్లు) వీరిని గమనించారు. వారిని చూడగానే ఇబ్రహీం అలెర్ట్ అయ్యాడు. ఈసారి ఎలాగైనా మీడియా కంట పడకుండా, ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడాలని భావించాడు. ఇందులో భాగంగానే, లోపలి నుంచి మెట్లు దిగి ఎగ్జిట్ డోర్ వైపు వస్తున్న పాలక్ తివారీని మీడియా వాళ్లు చూసేలోపే వెనక్కి నెట్టేశాడు. ‘ఇప్పుడు బయటకు రావద్దు, వెనక్కి వెళ్లు’ అన్నట్లుగా ఆమెను లోపలికి తోసేసి, తను మాత్రం ఏమీ తెలియనట్లు ఒంటరిగా బయటకు నడుచుకుంటూ వచ్చాడు.
ఇలా దొరికిపోయారేంటి బాస్..?
కానీ, బాలీవుడ్ మీడియా కెమెరామెన్లను అంత తేలిగ్గా అంచనా వేయడం ఇబ్రహీం వల్ల కాలేదు. బయట గేటు దగ్గరే కాదు, లోపలి వైపు కూడా కొందరు ఫొటోగ్రాఫర్లు అప్పటికే కెమెరాలతో సిద్ధంగా ఉన్నారు. ఇబ్రహీం బయట డ్రామా ప్లే చేస్తుంటే, లోపల ఉన్న మీడియా ప్రతినిధులు పాలక్ తివారీని చుట్టుముట్టేశారు. దీంతో చేసేదేమీ లేక, తన ప్లాన్ వర్కవుట్ అవ్వలేదని గ్రహించిన పాలక్, నవ్వుకుంటూనే మెట్లు దిగి బయటకు వచ్చేసింది. ఈ ఇద్దరి ముఖాల్లోని కంగారు, మీడియా నుంచి తప్పించుకోవడానికి వారు పడ్డ తంటాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌ వేదికల్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, “ఇలా దొరికిపోయారేంటి బాస్.. మీ ప్రేమ నిజమేనని హింట్ ఇచ్చేసారు” అంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్న ఇబ్రహీం
ఇక వీరిద్దరి సినిమా కెరీర్ విషయానికి వస్తే, సైఫ్ అలీఖాన్ కుమారుడైన ఇబ్రహీం అలీఖాన్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. బోమన్ ఇరానీ కుమారుడు కైయోజ్ ఇరానీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్జమీన్’ అనే సినిమాతో ఇబ్రహీం హీరోగా పరిచయం కానున్నాడు. ఈ చిత్రంలో కాజల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. మరోవైపు, ప్రముఖ టెలివిజన్ నటి శ్వేతా తివారీ కుమార్తె అయిన పాలక్ తివారీ ఇప్పటికే బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. 2023 ఏప్రిల్ 21న విడుదలైన సల్మాన్ ఖాన్ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాతో పాలక్ వెండితెరకు పరిచయమైంది. అంతకుముందు హార్డీ సంధు పాడిన ‘బిజ్లీ బిజ్లీ’ మ్యూజిక్ వీడియోతో ఈ బ్యూటీ నేషనల్ వైడ్ గా క్రేజ్ కొట్టేసింది. ప్రస్తుతం మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

Advertisement

బీ టౌన్ లో క్లారిటీ వచ్చేసినట్టే
గతంలో కూడా ఈ ఇద్దరూ కలిసి డిన్నర్ డేట్‌లకు వెళ్లినప్పుడు, కార్లలో ప్రయాణిస్తున్నప్పుడు మీడియాకు దొరికిపోయారు. ఒక సందర్భంలో పాలక్ తివారీ కెమెరాలను చూసి ముఖం దాచుకోవడం కూడా అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. అయితే తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని పాలక్ కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పింది.కానీ జరిగిన ఇన్సిడెంట్స్ మరియు ఈ వైరల్ వీడియో చూస్తుంటే వీరిద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్‌ కంటే ఎక్కువే ఉందనే విషయం బీ టౌన్ లో క్లారిటీ వచ్చేసినట్టే కనిపిస్తుంది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×