K-Dramas Releasing in June 2026 : కొరియన్ సిరీస్‌ల (K-Dramas)పై భారతీయ యువత, ముఖ్యంగా యువతుల్లో ఉన్న క్రేజ్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. రొమాన్స్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అన్ని రకాల కంటెంట్ తో జూన్ 2026లో కొత్త కొరియన్ సిరీస్ లు ఓటీటీలో వస్తున్నాయి. ఈ వారం కె డ్రామా ప్రియులు మిస్ అవ్వకుండా చూడాల్సిన టాప్ 6 అప్‌కమింగ్ కొరియన్ డ్రామాలు ఏంటో తెలుసుకుందాం పదండి.
‘ఎండ్యూరెన్స్ డాక్టర్’ అనే పాపులర్ వెబ్‌టూన్ ఆధారంగా తెరకెక్కిన మెడికల్ రొమాంటిక్ కామెడీ ‘డాక్టర్ ఆన్ ది ఎడ్జ్’. ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ మిలిటరీ సర్వీస్ లో భాగంగా ఒక మారుమూల ద్వీపానికి పబ్లిక్ హెల్త్ డాక్టర్ గా వెళ్తాడు. అక్కడ ఒక నర్సును కలుసుకున్న తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇందులో లీ జే-వుక్, షిన్ యే లీడ్ రోల్స్‌లో నటించారు.
విడుదల తేదీ : జూన్ 1
ప్లాట్‌ఫామ్ : Jio Hotstar
హై-వోల్టేజ్ యాక్షన్ స్కూల్ డ్రామా ‘టీచ్ యు ఎ లెసన్’. పాఠశాలల్లో పెరిగిపోతున్న హింస, ర్యాగింగ్ లను అరికట్టడానికి ప్రభుత్వం ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తుంది. ఆకతాయిలను ఈ బృందం ఎలా అణచి వేస్తుందనేది ఈ డార్క్ సిరీస్ కథ. కిమ్ మూ-యుల్, లీ సుంగ్-మిన్, జిన్ కి-జూక్ ఇందులో మెయిన్ లీడ్స్ గా నటించారు.
విడుదల తేదీ : జూన్ 5
ప్లాట్‌ఫామ్ : Netflix
సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా. ఇద్దరు అబ్బాయిల మధ్య ప్రేమ, హత్య కాంట్రాక్ట్, డిటెక్టివ్ ఎంట్రీతో కథ ఊహించని మలుపులు తీసుకుంటుంది. కిమ్ సంగ్-బియోమ్, కిమ్ గ్యోంగ్-మిన్, లీ జియాంగ్-హో నటించారు.
విడుదల తేదీ: జూన్ 5, 2026
ప్లాట్‌ఫారమ్: Rakuten Viki & Wavve
ఆఫీస్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే స్లో-బర్న్ రొమాంటిక్ కామెడీ డ్రామా. కెరీర్ లో విసిగిపోయిన ఒక ప్రొడక్ట్ ప్లానర్, తన కొత్త కఠినమైన బాస్ తో కలిసి పని చేయాల్సి వస్తుంది. మొదట గొడవలు మెల్లగా ప్రేమగా మారే కథ ఇది. సియో ఇన్-గుక్, పార్క్ జి-హ్యూన్, కాంగ్ మి నటించారు.
విడుదల తేదీ : జూన్ 22
ప్లాట్‌ఫారమ్ : Amazon Prime Video
Also Read : తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు
మైండ్-బెండింగ్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘నోట్స్ ఫ్రమ్ ది లాస్ట్ రో’. ఒక లిటరేచర్ ప్రొఫెసర్ తన క్లాస్ లో చివరి బెంచీలో కూర్చునే విద్యార్థి రాసిన కథల్లో నిజ జీవిత సంఘటనలు ప్రతిబింబించడంతో కథ ప్రమాదకరమైన మలుపులు తీసుకుంటుంది.
విడుదల తేదీ : జూన్ 26
ప్లాట్‌ఫారమ్ : Netflix
‘మేనేజర్ కిమ్’ వెబ్‌టూన్ ఆధారంగా వచ్చిన యాక్షన్ రివెంజ్ డ్రామా ‘ఏజెంట్ కిమ్ రీయాక్టివేటెడ్’. గతంలో ఎలైట్ కోవర్ట్ ఏజెంట్ గా పని చేసిన వ్యక్తి ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ గా, ఒంటరి తండ్రిగా జీవితం గడుపుతాడు. కూతురు కిడ్నాప్ అవడంతో మళ్లీ పాత ప్రపంచంలోకి వెళ్తాడు. జాన్ విక్ స్టైల్ యాక్షన్ ఉంటుంది ఇందులో.
విడుదల తేదీ : జూన్ 26
ప్లాట్‌ఫారమ్ : నెట్ ఫ్లిక్స్