E-Paper
Advertisement

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ!

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ!
Advertisement

Allu Arjun: తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే .ఒకప్పుడు థియేటర్లలో పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించిన సినిమాలు మరోసారి 4k వెర్షన్ లో తిరిగి విడుదలవుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా పెద్ద ఎత్తున రీ రిలీజ్ సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలన్నీ విడుదల అయ్యి కలెక్షన్లలో సంచలనాలను సృష్టించారు. తాజాగా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ సినిమాని కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర నిర్మాతలు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్..

అల్లు అర్జున్ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాలలో రేసుగుర్రం (Race Gurram)సినిమా ఒకటి. డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అల్లు అర్జున్ శృతిహాసన్ (Shruthi Hassan)జంటగా నటించిన ఈ సినిమా 2014వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. అల్లు అర్జున్ నటన శృతిహాసన్ అమాయకత్వం ఈ సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలబెట్టాయి. అయితే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా రీ రిలీజ్ కాబోతోందని సమాచారం. అల్లు అర్జున్ ఏప్రిల్ 8వ తేదీ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.

ఏప్రిల్ 8న రేసుగుర్రం రీ రిలీజ్..

Advertisement

ఈ నేపథ్యంలోనే తన పుట్టినరోజు సందర్భంగా రేసుగుర్రం సినిమా రీ రిలీజ్ కాగా మార్చి 26వ తేదీ విడుదల చేయబోతున్నారు. ఇక  ఈ సినిమాని ఏప్రిల్ 8వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలు చిత్ర నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా ఊహించని విధంగా అల్లు అర్జున్ సినిమా నుంచి ఇలాంటి గుడ్ న్యూస్ రావడంతో బన్నీ ఫాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రీ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకోవాలి అంటూ అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

అల్లు అర్జున్ అట్లీ సినిమా టైటిల్ ప్రకటన..

Advertisement

ప్రస్తుతం ఈయన కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ కూడా బయటకు రాకుండా చిత్ర బృందం చాలా పకడ్బందీగా షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు.. ఇక ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టినరోజు కావడంతో ఆ రోజున సినిమాకు సంబంధించిన టైటిల్ రివిల్ చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. ఇలా టైటిల్ తో పాటు ఒక వీడియోని కూడా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది.అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కూడా సినిమా చేయబోతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలపై క్లారిటీ ఇచ్చిన టీం.. ఓజి 2 పై కీలక అప్డేట్!

Related News

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

ఎవరీ సాత్విక.. ఒక్క టీజర్ తోనే ఊహించని క్రేజ్!

Big Stories

Advertisement
×