E-Paper
Advertisement

Sambarala Yetigattu: హీరో శ్రీకాంత్ బర్త్‌డే స్పెషల్.. బ్రిటీషు‌గా ఫస్ట్ లుక్ అదిరింది!

Sambarala Yetigattu: హీరో శ్రీకాంత్ బర్త్‌డే స్పెషల్.. బ్రిటీషు‌గా ఫస్ట్ లుక్ అదిరింది!
Advertisement

Sambarala Yetigattu: ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఉన్న మోస్ట్ ఎవెటెడ్ చిత్రాలలో మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా స్పెక్టికల్ ‘సంబరాల ఏటిగట్టు’ (Sambarala Yetigattu) కూడా ఒకటి. ఈ సినిమాతో ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్‌పీరియన్స్‌ని ప్రేక్షకులకు ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ వంటి చిత్రాన్ని అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్‌లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్ ట్రెమండస్ రెస్పాన్స్‌ని రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలు పెంచిన విషయం తెలిసిందే. అలాగే సినిమా (SYG Movie) నుంచి వచ్చిన పోస్టర్స్ కూడా మంచి క్రేజ్ ఏర్పడేలా చేశాయి. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.

Also Read- Pallichattambi Teaser: టొవినో థామస్ ‘పళ్లిచట్టంబి’ టీజర్ ఎలా ఉందంటే?

బ్రిటిషు‌ పాత్రలో శ్రీకాంత్

Advertisement

సీనియర్ హీరో శ్రీకాంత్ (Srikanth) ఇందులో పవర్ ఫుల్ పాత్రని పోషిస్తున్నట్లుగా మేకర్స్ చెప్పిన విషయం తెలిసిందే. సోమవారం (మార్చి 23) శ్రీకాంత్ బర్త్ డే (Happy Birthday Srikanth) సందర్భంగా ఆయన్ని బ్రిటిషు పాత్రలో ప్రజెంట్ చేస్తూ కొత్త పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ప్రతి గాయాన్ని ఒక పతకంలా ధరించే సైనికుడుగా ఇందులో శ్రీకాంత్ నటిస్తున్నారు. ఆయన లుక్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే, మన ఇళ్లలో ఉండే పాత ఫొటోలు సగం కాలిపోయి ఉన్నప్పుడు ఎలా ఉంటాయో.. ఈ పిక్‌ని అలా డిజైన్ చేశారు. బ్రిటీష్ అవతార్‌లో ఊర మాస్‌గా శ్రీకాంత్ ఇందులో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకుంటూ, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను షేర్ చేస్తూ.. శ్రీకాంత్‌కు నెటిజన్లు బర్త్‌డే విశెస్ చెబుతున్నారు.

Also Read- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలపై క్లారిటీ ఇచ్చిన టీం.. ఓజి 2 పై కీలక అప్డేట్!

బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్‌

Advertisement

ఇక సినిమా విషయానికి వస్తే.. సాయి ధరమ్ తేజ్ కెరీర్‌లో రూపుదిద్దుకుంటోన్న మొదటి పాన్ ఇండియా చిత్రమిది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం.. ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్‌గా నిలుస్తోందని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో సాయి దుర్గా తేజ్ లుక్ చాలా కొత్తగా ఉంది. ఈ లుక్, బాడీ కోసం ఆయన ఎంతగానో శ్రమిస్తూ వస్తున్నారు. కచ్చితంగా ఈ సినిమా తన కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని సాయి తేజ్ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సాయి కుమార్, అనన్య నాగళ్ల వంటి వారు ఇతర పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

Also Read- Poonam Controversy: ‘రియల్ సింగ్’ vs ‘ఫేక్ సింగ్’..! టార్గెట్ పవన్ కళ్యాణేనా?

Related News

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

Big Stories

Advertisement
×