E-Paper
Advertisement

High Court Jobs: హైకోర్టులో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, పూర్తి వివరాలివే

High Court Jobs: హైకోర్టులో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు, పూర్తి వివరాలివే
Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. హైకోర్టులో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిపికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, వయస్సు, తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (AP HC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో 78 అసిస్టెంట్స్‌, 50 డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌, 20 ఆఫీస్ సబార్డినేట్, 44 టైపిస్ట్ ఖాళీలతో పాటు తదితర పోస్టులను రెగ్యులర్‌ ప్రాతిపదికన పోస్టులన భర్తీ చేయనున్నారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 19వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 300

పోస్టుల వివరాలు:  

Advertisement

సెక్షన్ ఆఫీసర్స్: 05 పోస్టులు

సీనియర్ సిస్టమ్ ఆఫీసర్: 01 పోస్టు

కంప్యూటర్ ఆపరేటర్: 31 పోస్టులు

అసిస్టెంట్ లైబ్రేరియన్: 01

లైబ్రేరియన్ గ్రేడ్-II: 01

యూడీ స్టెనోగ్రాఫర్: 07 పోస్టులు

అసిస్టెంట్: 78 పోస్టులు

ఎగ్జామినర్: 27  పోస్టులు

టైపిస్ట్: 44 పోస్టులు

కాపీయిస్ట్: 34 పోస్టులు

డేటా ఎంట్రీ ఆపరేటర్: 50  పోస్టులు

స్టెనోగ్రాఫర్: 01

ఆఫీస్ సబార్డినేట్: 20 పోస్టులు

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఏడో తరగతి, డిగ్రీ, బీటెక్, లా డిగ్రీ, ఎమ్మెస్సీ పాసై ఉండాలి. అలాగే టైపింగ్ లేదా షార్ట్ హ్యాండ్ వంటి టెక్నికల్ అర్హతలు కలిగి ఉండాలి.

జీతం: ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.20 వేల నుంచి రూ.1,47,760 జీతం ఉంటుంది.

సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

వయస్సు: 2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ప్రాసెస్: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు: 

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2026 మార్చి 30

దరఖాస్తుకు చివరి తేది: 2026 ఏప్రిల్ 19

అఫీషియల్ వెబ్ సైట్: https://aphc.gov.in/

ALSO READ: SSB Constable: భారీగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఈ వయస్సు ఉంటే అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×