Heroine: ఫొటోలో త్రిష పక్కన కనిపిస్తున్న ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? స్టార్ హీరోయిన్ పక్కన క్యూట్ స్మైల్‌తో మెరిసిన ఈ అమ్మాయి, ఇప్పుడు వెండితెరపై నేషనల్ క్రష్ రేంజ్‌లో ట్రెండింగ్ హీరోయిన్‌గా మారిపోయింది. కేవలం తన చిరునవ్వుతోనే కాదు, అద్భుతమైన నటనతో దక్షిణాది సినీ ప్రియులను మంత్రముగ్ధులను చేస్తోంది. చిన్నతనంలోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, త్రిష, మంజు వారియర్ వంటి దిగ్గజ నటీమణులతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆ చైల్డ్ ఆర్టిస్ట్ మరెవరో కాదు.. అనస్వర రాజన్. మలయాళ చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఈ కేరళ కుట్టి, ఇప్పుడు తెలుగు యూత్ మనసు దోచేస్తోంది.
చైల్డ్ ఆర్టిస్ట్ టు హీరోయిన్
చిన్నప్పుడే తన నటనతో పలువురి ప్రశంసలు అందుకున్న అనస్వర, హీరోయిన్‌గా మారిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతోంది. ఓటీటీలో విడుదలైన మలయాళ డబ్బింగ్ మూవీ ‘రేఖా చిత్రం’ ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, తన సహజమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది.
టాలీవుడ్ ఎంట్రీ
ప్రస్తుతం అనస్వర రాజన్ నేరుగా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. శ్రీకాంత్ కుమారుడు రోషన్ మేక హీరోగా నటిస్తున్న ‘ఛాంపియన్’ సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ‘చంద్రకళ’ అనే పక్కింటి అమ్మాయి లాంటి పాత్రలో ఆమె కనిపించనుంది.

అందానికి ఫిదా
సినిమా ఫంక్షన్లలో, ప్రమోషన్లలో చక్కని చీరకట్టులో మెరుస్తూ తెలుగు ప్రేక్షకులకు అచ్చం పక్కింటి అమ్మాయిలా కనిపిస్తోంది అనస్వర. ఆమె అందం, అభినయానికి తెలుగు యువత ఫిదా అవుతోంది. ‘ఛాంపియన్’ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతుండగా, ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ , పోస్టర్స్ ఆమె పాత్రపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాతో పాటు ‘మీ అర్జున’ అనే మరో తెలుగు చిత్రంలో కూడా ఆమె నటిస్తోంది.