E-Paper
Advertisement

Huawei Nova 15: ఎదురుచూపులకు తెర.. 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP ట్రిపుల్ కెమెరాలతో హువాయి నోవా 15 ఎంట్రీ!

Huawei Nova 15: ఎదురుచూపులకు తెర.. 100W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP ట్రిపుల్ కెమెరాలతో హువాయి నోవా 15 ఎంట్రీ!
Advertisement

Huawei Nova 15: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హువాయి తన మిడ్-ప్రీమియమ్ ఫోన్ Huawei Nova 15ను చైనా మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఫోన్ అక్కడ అమ్మకాలకు అందుబాటులోకి వచ్చేసింది. డిజైన్, పనితీరు, బ్యాటరీ పరంగా చూసుకుంటే.. ఆల్ రౌండర్‌గా ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది.

Kirin 8020 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌:

హువాయి నోవా 15లో కంపెనీ స్వయంగా డిజైన్ చేసిన Kirin 8020 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది 12GB RAMతో పాటు గరిష్టంగా 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది. డే టు డే యూజ్ నుంచీ హెవీ మల్టీటాస్కింగ్ వరకూ స్మూత్ పనితీరును అందించేలా ఈ చిప్‌సెట్‌ను ఆప్టిమైజ్ చేశారు.

Advertisement

Also Read: బ్యాటరీ మాన్‌స్టర్ వచ్చేస్తోంది.. 9000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌తో ఐకూ కొత్త ఫోన్ విడుదలకు సిద్ధం!

50MP+50MP+50MP కెమెరాలు:

కెమెరా విభాగంలో కూడా Nova 15 బలమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ పోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీనిలో OIS సపోర్ట్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్, 30x డిజిటల్ జూమ్ సామర్థ్యంతో ఉన్న 12MP టెలిఫొటో లెన్స్, అలాగే రంగుల ఖచ్చితత్వాన్ని మెరుగుపరచే 1.5MP ‘Red Maple’ మల్టీ-స్పెక్ట్రల్ సెన్సార్ ఉన్నాయి. ఫొటోగ్రఫీ ప్రేమికులకు ఇది మంచి ఆప్షన్‌గా నిలవనుంది.

48 గంటల బ్యాటరీ బ్యాకప్:

Advertisement

ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ Huawei Nova 15లో 6000mAh సిలికాన్ ఆధారిత భారీ బ్యాటరీని అమర్చారు. సాధారణ వినియోగంలో ఇది రెండు రోజుల వరకు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ తెలిపింది. దీంతోపాటు 100W వైర్డ్ సూపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం దీన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తుంది.

కళ్లకు ఒత్తిడి లేకుండా:

డిస్‌ప్లే పరంగా ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల ఫ్లాట్ OLED స్క్రీన్ ఉంది. ఇది Full HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు కళ్లకు ఒత్తిడి తగ్గించే 2160Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే స్క్రీన్ రక్షణ కోసం అల్యూమినోసిలికేట్ గ్లాస్‌ను ఉపయోగించడంతో పాటు, IP65 రేటింగ్ ఉండటం వల్ల దుమ్ము, నీటి తుంపర్ల నుంచి భద్రత లభిస్తుంది.

ఆడియో స్పీకర్లు అదిరాయ్:

హువాయి నోవా 15 కనెక్టివిటీ ఫీచర్లలో కూడా ఎలాంటి రాజీ లేదు. ఇది 5G, వైఫై 7, బ్లూటూత్ 6.0, NFCకు మద్దతు ఇస్తుంది. ఆడియో అనుభూతిని మెరుగుపరచేందుకు Histen 9.0 టెక్నాలజీతో స్టీరియో స్పీకర్లు అందించారు. హువాయి నోవా 15 ఇప్పటికై చైనా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. 256GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.34,000 గా నిర్ణయించారు. ప్రస్తుతం ఇతర దేశాల్లో లాంచ్‌పై కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Also Read: భారత్‌లో రెడ్‌మీ నోట్ 15 5G లాంచ్ కన్ఫర్మ్.. 108MP కెమెరాతో పవర్‌ఫుల్ ఫీచర్లు!

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×